




Best Web Hosting Provider In India 2024

Beauty Movie: బ్యూటీ మూవీ నుంచి కన్నమ్మ సాంగ్ రిలీజ్ – యూట్యూబ్‌లో రెండు మిలియన్లకుపైగా వ్యూస్
Beauty Movie: అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బ్యూటీ మూవీ నుంచి కన్నమ్మ అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మూడు రోజుల్లోనే ఈ పాటకు రెండు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. బ్యూటీ మూవీకి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Beauty Movie: అంకిత్ కొయ్య, నీలఖీ పాత్ర హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న బ్యూటీ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని కన్నమ్మ అనే పాటను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. మూడు రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్‌లో రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. ట్రెండింగ్ తెలుగు సాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
కెమిస్ట్రీ హైలైట్…
కన్నమ్మ కన్నమ్మ అంటూ సాగిన ఈ గీతాన్ని సనారే రాయగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించాడు. మెలోడీ ప్రధానంగా సాగిన పాటకు సాహిత్యం, పిక్చరైజేషన్ , హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ‘బ్యూటీ’ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, గ్లింప్స్ కూడా ఆకట్టుకున్నాయి. కన్నమ్మ పాటతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
భలే ఉన్నాడే ఫేమ్..
బ్యూటీ మూవీకి జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహిస్తూనే డైలాగ్స్ అందించాడు. గతంలో డైరెక్టర్‌గా గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్ అనే వెబ్‌సిరీస్‌లు చేశాడు వర్ధన్. రాజ్‌తరుణ్‌తో భలే ఉన్నాడే సినిమాను తెరకెక్కించాడు బ్యూటీ మూవీని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు.కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. బ్యూటీ మూవీకి డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోండటం గమనార్హం
బ్యూటీ మూవీలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
టాలీవుడ్‌లోకి ఎంట్రీ…
హీరోగా, కమెడియన్‌గా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు అంకిత్ కొయ్య. నాగచైతన్య మజిలీ మూవీతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జోహార్, శ్యామ్ సింగరాయ్, సత్యభామ, బచ్చలమల్లితో పాటు మరికొన్ని తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. గత ఏడాది రిలీజైన ఆయ్‌తో పాటు మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాల్లో కామెడీ ప్రధాన పాత్రలతో మెప్పించాడు.
14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో
అంకిత్ కొయ్య హీరోగా నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో అనే మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం సింపుల్ సంతోష్‌తో పాటు మరో రెండు సినిమాల్లో హీరోగా కనిపించబోతున్నాడు. సినిమాలే కాకుండా 9 అవర్స్, మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్‌తో పాటు గుడ్ ఓల్డ్ డేస్ అనే వెబ్‌సిరీస్‌లు చేశాడు అంకిత్ కొయ్య.
సంబంధిత కథనం