


Best Web Hosting Provider In India 2024
Nightclub roof collapse: నైట్ క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో వంద మందికి పైగా దుర్మరణం; మృతుల్లో ఫేమస్ సింగర్
Nightclub roof collapse: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లో ప్రముఖ సింగర్ ప్రదర్శన ఇస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించినట్లు సమాచారం. మృతదేహాలను వెలికితీయడానికి, క్షతగాత్రులను రక్షించడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Nightclub roof collapse: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లోని ఒక నైట్ క్లబ్ లో ప్రముఖ గాయకుడు రబ్బీ పెరెజ్ ప్రదర్శన ఇస్తుండగా, పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి.
పెరెజ్ ప్రదర్శన సమయంలో..
ప్రముఖ డొమినికన్ గాయకుడు రబ్బీ పెరెజ్ ఇచ్చే ప్రదర్శనలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అలాగే, మంగళవారం అర్ధరాత్రి దాటిన జెట్ సెట్ నైట్ క్లబ్ లో ఆయన ప్రదర్శన ఇస్తుండగా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో సింగర్ పెరెజ్ కూడా మరణించాడని అతని మేనేజర్ తెలిపారు. మృతుల్లో మాజీ మేజర్ లీగ్ బేస్ బాల్ ఆటగాళ్లు ఆక్టావియో డోటెల్, టోనీ బ్లాంకో కూడా ఉన్నారు. అలాగే, మృతుల్లో మోంటే క్రిస్టీ మున్సిపాలిటీ గవర్నర్ నెల్సీ క్రూజ్ కూడా ఉన్నారని అధ్యక్షుడు లూయిస్ అబినాడర్ తెలిపారు.
సహాయ చర్యలు ముమ్మరం
సమాచారం తెలియగానే సంఘటన స్థలం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, శిథిలాలను తొలగించడానికి క్రేన్ ను ఉపయోగించారు. పెరెజ్ షో చూడడం కోసం వచ్చి ఈ ప్రమాదంతో శిధిలాల్లో చిక్కుకుపోయిన వారి కోసం, వారి బంధువులు, కుటుంబ సభ్యులు భారీగా అక్కడికి చేరుకున్నారు. “మా స్నేహితులు, మేనకోడలు, బంధువులు వచ్చారు. వారు ఈ శిథిలాల కింద ఉన్నారు” అని రోడోల్ఫో ఎస్పినల్ చెప్పారు.
ప్రమాదం సమయంలో అక్కడ వెయ్యి మంది
స్థానిక కాలమానం ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 12:44 గంటలకు ఈ ప్రమాదం సంభవించినప్పుడు క్లబ్ లో 500 నుండి 1,000 మంది ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. ఈ క్లబ్ లో 1,700 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ప్రమాదం సమయంలో పెరెజ్ వేదికపై ఉండగా పైకప్పు కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పైకప్పు కూలడంతో తాను తప్పించుకోగలిగానని, కానీ అతను అలా చేయలేదని పెరెజ్ కుమార్తె జులింకా విలేకరులకు చెప్పారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link