




Best Web Hosting Provider In India 2024

Jr NTR: ఆరోజు తమ్ముడు వస్తాడు.. జూనియర్ ఎన్టీఆర్ రాకను కన్ఫర్మ్ చేసిన నందమూరి కల్యాణ్ రామ్
Nandamuri Kalyan Ram On Jr NTR Guest To Arjun S/O Vyjayanthi Event: నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో కల్యాణ్ రామ్‌కు తల్లిగా విజయశాంతి నటించారు. తాజాగా జరిగిన ముచ్చటగా బంధాలే సాంగ్ రిలీజ్ లాంచ్‌లో జూనియర్ ఎన్టీఆర్ రాకపై నందమూరి కల్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేశాడు.

Nandamuri Kalyan Ram On Jr NTR Guest To Arjun S/O Vyjayanthi Event: నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించారు.
తల్లిగా కీలక పాత్ర
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా.. హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు సీనియర్ హీరోయిన్ విజయశాంతి తల్లిగా కీలక పాత్ర పోషించారు. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశంగా తెరకెక్కింది. తాజాగా చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా సెకండ్ సింగిల్ ముచ్చటగా బంధాలే సాంగ్‌ని రిలీజ్ చేశారు.
స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే సాంగ్ కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్. రఘు రామ్ సాహిత్యంతో కూడిన ఈ పాట తల్లి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
సున్నితమైన రిలేషన్‌ని
అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కల్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది. సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్‌ని పాటకు అదనపు ఎమోషన్‌ని యాడ్ చేసింది.
హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్‌ని క్రియేట్ చేసింది. మొత్తంమీద, ముచ్చటగా బంధాలే తల్లి-కొడుకుల బంధానికి హృదయపూర్వక నివాళి అని మేకర్స్ చెబుతున్నారు. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పణంగా పెట్టి జన్మనిస్తుంది
హీరో నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “చిత్తూరు ప్రజలకు ఇక్కడే విద్యార్థులకు, మా నందమూరి అభిమానులందరికీ లవ్ యు ఆల్. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక అమ్మ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని అన్నాడు.
“ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది. కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేయండి. భాద్యతగా ఉండండి. నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నదే రేపు మనకి లైఫ్ ఇస్తుంది. ఇక్కడికి విచ్చేసినఅందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అని నందమూరి కల్యాణ్ రామ్ తెలిపాడు.
తమ్ముడు వస్తాడు
“12వ తేదీన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఆ ఈవెంట్‌కి తమ్ముడు (జూనియర్ ఎన్టీఆర్) వస్తాడు. ఆరోజు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ అద్భుతంగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ పేరుపేరు ధన్యవాదాలు” అని అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడని నందమూరి కల్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేశాడు.
సంబంధిత కథనం