


Best Web Hosting Provider In India 2024
Trump Tariffs Pause : టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన.. అన్ని దేశాలకు 90 రోజుల విరామం.. ఒక్క చైనాకు తప్ప!
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై కీలక ప్రకటన చేశారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒక్క చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ అనేలా ఉన్నారు.

అన్ని దేశాలపై టారిఫ్ వార్ చేస్తున్న ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 90రోజులపాటు సుంకాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటిదాకా 10 శాతం మాత్రమే ఉంటుందని తెలిపారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని 125 శాతం వరకు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థరాత్రి ప్రకటించారు. అంతకుముందు చైనా అమెరికన్ ఉత్పత్తులపై సుంకాన్ని 84 శాతానికి పెంచడం ద్వారా ప్రతీకార చర్య తీసుకుంది. దీనితో పాటు ట్రంప్ అన్ని ఇతర దేశాలకు 90 రోజుల విరామం ప్రకటించారు.
చైనాపై మాత్రం దూకుడు
వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ట్రంప్ ఈ చర్యలు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇది చైనాకు తప్ప ఇతర దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ కారణంగా సుంకాలు మరింత పెరిగాయి. ఇతర దేశాలకు 90 రోజుల గ్రేస్ పీరియడ్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. చైనా తప్ప మిగతా దేశాలన్నింటికీ పరస్పర సుంకాలపై 90 రోజుల విరామం ప్రకటిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.
90 రోజుల పాజ్ అంటే ఏమిటి?
90 రోజుల విరామం అంటే ట్రంప్ ప్రభుత్వం రాబోయే 90 రోజుల పాటు చైనా తప్ప ఇతర దేశాలపై కొత్త ప్రతీకార సుంకాలను విధించదు. బహుశా ప్రస్తుతం ఉన్న పరస్పర సుంకంలో కూడా పెరుగుదల ఉండకపోవచ్చు. ఇది తాత్కాలిక ఉపశమనం. అయితే 90 రోజుల నిషేధం చైనా తప్ప అన్ని దేశాలకు వర్తిస్తుంది. చైనాపై సుంకాలకు సంబంధించి అమెరికా విధానంలో ఎటువంటి మార్పు లేదు.
చైనా స్పందన
అమెరికా సుంకాలపై చైనా స్పందించింది. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని, తగిన విధంగా బదులిచ్చేందుకు తమవద్ద విధానపరంగా అన్ని ఆయుధాలున్నాయని చైనా ప్రధాని లీ కియాంగ్ చెప్పారు. సుంకాల పేరుతో అమెరికా బెదిరింపులు చేస్తుందని, దీనిపై చివరి వరకూ పోరాడుతామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధాని అన్నారు. సొంత ప్రయోజనాలు మాత్రమే గాక.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు కాపాడేందుకు పోరాడుతాం అని పేర్కొన్నారు.
ప్రతీకార సుంకాలకు ఆమోదం
మరోవైపు ఇప్పటికే అమెరికాపై 23 బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలకు ఐరోపా కూటమి దేశాలు ఆమోదం చెప్పాయి. 27 దేశాలు తీర్మానానికి ఓకే తెలిపాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే ఎలాంటి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామో మాత్రం బయటకు చెప్పలేదు.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link