




Best Web Hosting Provider In India 2024

Miracle Tea: ఈ అద్భుతమైన టీని ప్రతిరోజూ తాగారంటే చర్మం మెరిసిపోవడంతో పాటూ బరువు తగ్గుతారు
ఆయుర్వేదంలో మిరాకిల్ టీ ఒకటుంది. ఇది శరీరానికి చేసే మేలు ఎంతో. ముఖ్యంగా పొట్టకు రక్షణగా నిలుస్తుంది. రోజుకొకసారి ఈ టీ తాగితే చాలు చర్మం మెరవడం మొదలవుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. యాభై ఏళ్ల వయసులో కూడా అలా మెరుపు తీగాలా శిల్పా శెట్టి కనిపించడానికి ఈ టీనే కారణం.

ఆయుర్వేదం పురాతన వైద్యం. ఆయుర్వేదం చెప్పిన ఒక అద్భుతమైన టీ గురించి ఇక్కడ చెప్పాము. ఇది అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. భారతదేశంలో వందల ఏళ్ల క్రితం నుంచి ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నారు. అల్లోపతి వచ్చాక ఆయుర్వేదానికి డిమాండ్ తగ్గింది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని అద్భుతమైన వైద్య విధానం ఇది.
ఆయుర్వేదం ప్రకారం ఇక్కడ చెప్పిన అద్భుత మైన టీని ప్రతి రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ టీని జీలకర్ర, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో తయారుచేస్తారు. ఈ మూడు భారతీయ మసాలా దినుసులు. ఈ మూడూ మీ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. మీకు పొట్ట సమస్యలు ఉంటే ఈ తప్పనిసరిగా తాగాల్సిన అవసరం ఉంది.
ఈ అద్భుతమైన మసాలా టీని ఎలా తయారు చేయాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ ఇచ్చాము. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి యాభై ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ప్రతిరోజూ ఈ టీనే తాగుతుంది. ఈ టీ చర్మానికి మెరుపును కూడా అందిస్తుంది.
భారతీయ వంటగదిలో దొరికే మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వాటిని అనే రకాలు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. జీలకర్ర, కొత్తిమీర, సోంపు ఈ మూడింటిని కలిపి టీ తయారు చేస్తే ఆరోగ్యం నుంచి అందం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా ఈ టీకి వీరాభిమాని. మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత ఈ టీ తాగుతానని చెప్పింది.
ప్రయోజనాలు
– ఈ టీలో చేర్చిన మూడు మసాలా దినుసులు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.
– మీకు అపానవాయువు లేదా జీర్ణ సమస్యలు ఉంటే, ఈ టీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.
– ఈ టీ తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది.
– మహిళలకు పీరియడ్స్ సమమంలో పొట్ట నొప్పి అధికంగా వస్తుంది. అలాంటి పీరియడ్స్ పెయిన్ ఉన్న వారు ఈ టీ తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది.
– దీన్ని డిటాక్స్ డ్రింక్ గా తాగవచ్చు.
– ఈ టీ తాగడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.
తయారుచేసే విధానం
ఈ మిరాకిల్ టీ చేయడానికి రెండు కప్పుల నీళ్లు తీసుకోవాలి. అర టీస్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలు అందులో వేయాలి. ఈ నీటిని మరిగించాలి. నీరు సగానికి తగ్గే వరకు ఉంచాలి. ఇప్పుడు వడకట్టి ఆ టీని మెల్లగా సిప్ చేస్తూ తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్