


Best Web Hosting Provider In India 2024

Jack Twitter Review: జాక్ ట్విట్టర్ రివ్యూ -సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ మూవీకి ఊహించని టాక్ -మిస్ ఫైర్ అంటూ ట్వీట్స్
Jack Twitter Review: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ జాక్. స్పై యాక్షన్ కామెడీ కథాంశంతో సిద్ధు జొన్నలగడ్డ చేసిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన జాక్ మూవీ ఏప్రిల్ 10న (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
నెగెటివ్ టాక్…
జాక్ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో స్పై యాక్షన్ అంశాలు థ్రిల్‌ను పంచలేదని, కామెడీ అస్సలు వర్కవుట్ కాలేదని చెబుతోన్నారు. ఫ్యామిలీ, లవ్‌స్టోరీ సినిమాల దర్శకుడిగా ముద్రపడిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి తన జోనర్ మార్చి జాక్ మూవీని తెరకెక్కించాడు. కానీ అతడి ప్రయత్నం మాత్రం పూర్తిగా బెడిసికొట్టిందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. జాక్ మూవీ కోసం బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథ వీక్‌గా ఉందని, స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్‌గా సాగుతూ బోర్ కొట్టిస్తుందని ఓవర్‌సీన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
ఇరిటేట్…
సినిమాలోని స్పై బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ చాలా వరకు ఇరిటేట్ చేస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. విలన్ క్యారెక్టరైజేషన్, టెర్రరిస్ట్ ట్రాక్స్ సిల్లీగా ఉన్నాయని కామెంట్ చేశాడు. మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్‌గా నిలిచిందని చెప్పాడు.
డీజే టిల్లు క్యారెక్టరైజేషన్…
సిద్ధు జొన్నలగడ్డ వన్ లైనర్స్, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు పెద్ద రిలీఫ్‌గా నిలిచాయని అంటున్నారు. కానీ పేలవమైన కథ, కథనాల కారణంగా సిద్ధు జొన్నలగడ్డ కష్టం వృథా అయ్యిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల జాక్‌లో డీజే టిల్లు క్యారెక్టరైజేషన్ కనిపిస్తుందని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జాక్‌తో సిద్దు జొన్నలగడ్డ సక్సెస్‌లకు బ్రేక్ పడటం ఖాయమని చెబుతోన్నారు.
మిస్ ఫైర్…
సిద్ధు జొన్నలగడ్డ ప్రయోగం పూర్తిగా మిస్‌ఫైర్ అయ్యిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య రొమాంటిక్ ట్రాక్, కెమిస్ట్రీని దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయాడని ఓవర్‌సీస్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
సంబంధిత కథనం