Karthika Deepam 2 Serial: భ‌ర్త కోసం దీప యుద్ధం – డేంజ‌ర్‌లో ప‌డ్డ జ్యోత్స్న- ప్లాన్ రివ‌ర్స్‌ -కాంచ‌న‌పై కార్తీక్ ఫైర్

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: భ‌ర్త కోసం దీప యుద్ధం – డేంజ‌ర్‌లో ప‌డ్డ జ్యోత్స్న- ప్లాన్ రివ‌ర్స్‌ -కాంచ‌న‌పై కార్తీక్ ఫైర్

Nelki Naresh HT Telugu
Published Apr 10, 2025 08:15 AM IST

Karthika Deepam 2: కార్తీక దీపం 2 ఎప్రిల్ 10 ఎపిసోడ్‌లో జ్యోత్స్న కుట్ర‌ల‌ను ఆమె నోటితోనే బ‌య‌ట పెట్టించాల‌ని దీప ఫిక్స‌వుతుంది. త‌న ప్లాన్ దీప‌కు తెలిసింద‌ని పారిజాతం ద్వారా తెలుసుకున్న జ్యోత్స్న కంగారు ప‌డుతుంది. దీప‌ను త‌న ఇంటికి రాకుండా అడ్డుకోవాల‌ని చూస్తుంది.

కార్తీక దీపం 2 ఎప్రిల్ 10 ఎపిసోడ్‌
కార్తీక దీపం 2 ఎప్రిల్ 10 ఎపిసోడ్‌

గౌత‌మ్‌తో జ్యోత్స్న పెళ్లిని ఆపేయ‌మ‌ని తండ్రిని వేడుకుంటుంది కాంచ‌న‌. కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని బ‌తిమిలాడుతుంది. జ్యోత్స్న పెళ్లి ఆగ‌ద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. ముహూర్తాలు పెట్టుకుంటున్నామ‌ని, ఫారిన్‌లో గౌత‌మ్‌, జ్యోత్స్న‌ల పెళ్లి చేయ‌బోతున్న‌ట్లు చెబుతాడు. మీరు ఎక్క‌డ ఆపేస్తారోన‌ని భ‌య‌ప‌డి పారిపోతున్నామ‌ని అంటాడు. నేనే నీ కాళ్లు ప‌ట్టుకుంటాన‌ని కాంచ‌న కాళ్ల‌కు మొక్కుతాడు శివ‌న్నారాయ‌ణ‌.

ఏం పాపం చేసింది…

ఈ ఇంట్లో శుభ‌కార్యం అనే మాట వింటే మీకు న‌చ్చ‌డం లేదు…మీ కొడుకు కాపురం బాగానే ఉంది క‌దా..మ‌రి నీ అన్న కూతురు ఏం పాపం చేసింది…ఆమెను ఎందుకు అలా వేధిస్తున్నార‌ని కాంచ‌న‌పై ఫైర్ అవుతాడు శివ‌న్నారాయ‌ణ‌. కాంచ‌న క‌న్నీళ్లు చూసి…ఇది పెళ్లి జ‌రుగుతున్న ఇళ్లా…చావు ఇళ్లా…ఎందుకు ఆ ఏడుపు అని శివ‌న్నారాయ‌ణ క‌సురుకుంటాడు. ఏ జ‌న్మ‌లో చేసిన పాప‌మో కూతురు రూపంలో నాకు మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తుంద‌ని కాంచ‌న‌ను త‌క్కువ చేసి మాట్లాడుతాడు.

ఏ సంబంధం లేదు…

ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించిన జ్యోత్స్న‌, గౌత‌మ్ పెళ్లి ఆగ‌ద‌ని శివ‌న్నారాయ‌ణ ఖ‌రాఖండిగా చెబుతాడు. ఈ ఇంటికి నీకు ఏం సంబంధం లేద‌ని…ఈ ఇంటి శుభ‌కార్యానికి మీకు ఆహ్వానాలు ఉండ‌వ‌ని అంటాడు. మ‌ళ్లీ వీళ్ల‌ను జీవితంలో ఈ ఇంటి గ‌డ‌ప తొక్క‌ద‌ని చెప్పు సుమిత్ర అని కోడ‌లితో చెప్పి లోప‌లికి వెళ్లిపోతాడు శివ‌న్నారాయ‌ణ‌.

మీరు ఇక వెళ్లొచ్చు…

గౌత‌మ్ మంచివాడు కాద‌ని సుమిత్ర‌తో అంటుంది కాంచ‌న‌. మీరు ఇక వెళ్లొచ్చు అని క‌ఠువుగా బ‌దులిస్తుంది సుమిత్ర‌. నా కూతురు పెళ్లి జ‌రుగుతుంద‌ని నా మాట‌గా దీప‌తో చెప్ప‌మ‌ని అంటుంది. పుట్టింట్లో జ‌రిగిన అవ‌మానం భ‌రించ‌లేక కాంచ‌న క‌న్నీళ్లు పెట్టుకుంటుంది.

కావేరి స‌మాధానం…

రెస్టారెంట్ నుంచి చెప్ప‌కుండా మాయ‌మైన కావేరి గురించి ఆలోచిస్తూ ఇంటికొస్తాడు శ్రీధ‌ర్‌. ఇంటి త‌లుపులు తెరిచే ఉండ‌టంతో కంగారు ప‌డ‌తాడు. కావేరి ఇంట్లోనే క‌నిపిస్తుంది. నువ్వు నాకు చెప్ప‌కుండా ఎక్క‌డికి వెళ్లావ‌ని భార్య‌ను నిల‌దీస్తాడు. దీపను క‌లిసిన సంగ‌తి దాచేస్తుంది కావేరి.

రెస్టారెంట్‌లో ఫుడ్ న‌చ్చ‌క ఇంటికి వ‌చ్చాన‌ని చెబుతుంది. భార్య మాట‌ల‌ను శ్రీధ‌ర్ న‌మ్మ‌డు. నా కంటూ కొంద‌రు ఉన్నారు. వాళ్ల కోసం వెళ‌తాను. వాళ్ల‌ను కల‌వ‌డానికి నీ ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేదంటూ భ‌ర్త‌ను ద‌బాయించి మాట్లాడుతుంది కావేరి. కావేరి నిజం దాచిదంటే ఏదో జ‌రుగుతుంద‌ని శ్రీధ‌ర్ అనుమానిస్తాడు.

సారి చెప్పిన కాంచ‌న‌…

ఈ పెళ్లి ఆప‌లేక‌పోయాన‌ని దీప‌కు సారీ చెబుతుంది కాంచ‌న‌. ముహూర్తాలు పెట్టుకున్నార‌ని, వ‌చ్చే వార‌మే ఫారిన్‌లో గౌత‌మ్‌, జ్యోత్స్న పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు తండ్రితో త‌న‌తో చెప్పాడ‌ని కాంచ‌న అంటుంది.

ఇదంతా జ్యోత్స్న ప్లాన్ అని దీప అర్థం చేసుకుంటుంది. గౌత‌మ్ ఎలాంటివాడో తెలిసిన త‌ర్వాత జ్యోత్స్న తాళి క‌ట్టించుకోదు. మ‌నం రాకుండా, త‌ను అనుకున్న‌ది జ‌ర‌గ‌కుండా జ్యోత్స్న ఎలా పెళ్లి చేసుకుంటుంద‌ని కాంచ‌న‌తో దీప అంటుంది.

నువ్వే ఈ పెళ్లి ఆపాలి…

కార్తీక్‌పై ప్రేమ‌తో త‌న జీవితాన్ని కాకుండా నీ జీవితాన్ని కూడా జ్యోత్స్న‌ పాడు చేయాల‌ని అనుకుంటుంది. ఎవ‌రికి ఏ న‌ష్టం జ‌ర‌గ‌కుండా, నీపై నింద ప‌డ‌కుండా ఈ పెళ్లిని నువ్వే ఆపాల‌ని దీప‌ను అడుగుతుంది కాంచ‌న‌. ఏదో ఒక‌టి చేయ‌మ‌నిబ‌తిమిలాడుతుంది. జ్యోత్స్న‌కు స‌తీసావిత్రి క‌థ చెబుతుంది అన‌సూయ‌. మొగుడి జోలికి వ‌స్తే ఆడ‌ది చావుతోనైనా పోరాడుతుంద‌న్న‌ది ఈ క‌థ‌లో నీతి. ఇప్పుడు నీ మొగుడి కోసం మ‌రో ఆడ‌ది కాచుకు కూర్చుంది.

నీ మొగుడి గురించి ఆలోచించాల‌న్న భ‌య‌ప‌డాలి. అంత‌లా దానికి బుద్దిచెప్పాల‌ని దీప‌లో ధైర్యాన్ని నూరిపోస్తుంది అన‌సూయ. జ్యోత్స్న నోటితోనే నిజం బ‌య‌ట‌పెట్టించాల‌ని దీప అనుకుంటుంది. అప్పుడే జ్యోత్స్న పెళ్లి ఆగుతుంద‌ని, త‌న‌పై ప‌డిన నింద పోతుంద‌ని దీప నిర్ణ‌యించుకుంటుంది.

తండ్రి ఆశీర్వాదం…

శాంతి కోసం కాంచ‌న‌ను జ్యోత్స్న ఇంటికి పంపించాను విన‌లేదు..ఇప్పుడు యుద్ధం చేయ‌డానికి వెళుతున్నాన‌ని, వినాల్సిన వాళ్లు వినేలా చేస్తాన‌ని తండ్రీ ఫొటో ముందు నిల‌బ‌డి ఆయ‌న ఆశీర్వాదం తీసుకుంటుంది దీప‌. ఆవేశంగా ఇంటి నుంచి బ‌య‌ట అడుగుపెడుతుంది.

పారిజాతం అనుమానం…

దీప‌కు నిజం తెలిసిపోయింద‌ని అనుమానంగా ఉంద‌ని జ్యోత్స్న‌తో అంటుంది పారిజాతం. కాంచ‌న ఇంటికొచ్చి చేసిన గొడ‌వ గురించి జ్యోత్స్న‌కు చెబుతుంది. నీ నాట‌కం దీప‌కు తెలిసింది కాబ‌ట్టే తెలివిగా తాను రాకుండా కాంచ‌న‌ను దీప పంపించింద‌ని జ్యోత్స్న‌తో అంటుంది పారిజాతం.

నేను వేసిన ప్లాన్ నీకు త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం లేద‌ని, నువ్వే లీక్ చేసి ఉంటావ‌ని పారిజాతంపై అనుమానం వ్య‌క్తం చేస్తుంది. న‌మ్మ‌కానికి అమ్మ వంటి న‌న్నే అనుమానిస్తున్నావా అని పారిజాతం స‌మాధాన‌మిస్తుంది.

ఆధారం ఉంది..

గౌత‌మ్‌తో నీ పెళ్లిని దీప జ‌ర‌గ‌నివ్వ‌దు. నువ్వు అనుకున్న‌ది కూడా జ‌ర‌గ‌నివ్వ‌ద‌ని జ్యోత్స్న‌తో అంటుంది పారిజాతం. దీప‌ను నువ్వు అవ‌మానించి ఛీ కొట్టించిన మ‌రోసారి ఇంటికి వ‌చ్చిందంటే ఖ‌చ్చితంగా దీప ద‌గ్గ‌ర ఏదో ఆధారం ఉండి ఉంటుంద‌ని, నేను నిన్ను క‌నిపెట్టిన‌ట్లే దీప కూడా నీ నాట‌కాన్ని క‌నిపెట్టి ఉండొచ్చ‌ని త‌న మాట‌ల‌తో జ్యోత్స్న‌ను భ‌య‌పెడుతుంది పారిజాతం.

నువ్వు డేంజ‌ర్‌లో ఉన్నావ‌ని, నువ్వే ఆగుతావో…దీప‌నే ఆపుతావో నీ ఇష్టం. నిజం బ‌య‌ట‌పెడితే మాత్రం ఇంట్లో నిన్ను ఎవ‌రు క్ష‌మించ‌ర‌ని జ్యోత్స్న‌తో అంటుంది పారిజాతం. దీప‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని మ‌న‌వ‌రాలికి స‌ల‌హా ఇస్తుంది పారిజాతం.

డైరెక్ట్‌గా మాట్లాడుతా…

నిజం తెలుసుకున్న దీప‌ను ఎలాగైనా ఇంటికి రాకుండా ఆపాల‌ని అనుకుంటుంది జ్యోత్స్న‌. దీప‌కు కాల్ చేస్తుంది. ప‌ది నిమిషాలు ఆగితే డైరెక్ట్‌గా మాట్లాడుకుందామ‌ని జ్యోత్స్న‌తో అంటుంది దీప‌. అన్నింటికి స‌మాధానం చెప్ప‌డానికే వ‌స్తున్నాన‌ని రిప్లై ఇస్తుంది. మ‌ళ్లీ మా ఇంటికొచ్చి ఛీ అనిపించుకుంటావ‌ని జ్యోత్స్న బ‌దులిస్తుంది.

నువ్వు గౌత‌మ్‌ను కాపాడ‌టానికి స‌త్తిపండు తీసుకొచ్చావ‌ని నాకు తెలుసు అని జ్యోత్స్న‌తో అంటుంది దీప‌. గౌత‌మ్‌ను నేను కాపాడ‌టం ఏంటి అని జ్యోత్స్న బుకాయించ‌బోతుంది. ఆప‌వే నాట‌కాల పెళ్లి కూతురా అని దీప అంటుంది.

తొక్కి నార తీయ‌డానికే..

నీ గురించి నిజాల‌న్ని నాకు తెలిసిపోయాన‌ని జ్యోత్స్న‌తో అంటుంది దీప‌. నువ్వు ఆట ఎప్పుడు, ఎక్క‌డ మొద‌లుపెట్టిన గెలిచేది నేనే అని జ్యోత్స్న అంటుంది. నువ్వు మోసంతో గెలిస్తే నేను నిజాయితీతో గెలుస్తాన‌ని జ్యోత్స్న‌కు ధీటుగా బ‌దులిస్తుంది దీప‌. నీ మంచికే చెబుతున్నా నువ్వు ఇక్క‌డికి రావ‌ద్దు అని దీప‌ను త‌న ఇంటికి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది జ్యోత్స్న‌. నేను వ‌చ్చేలోపు తాత కాళ్ల‌పై ప‌డి చేసిన త‌ప్పులు ఒప్పుకో జ్యోత్స్న‌కు వార్నింగ్ ఇస్తుంది దీప‌. నీ అహాన్ని, నిన్ను తొక్కి నార తీయ‌డానికే వ‌స్తున్నాన‌ని అంటుంది.

కార్తీక్ కోపం…

క‌ష్ట‌ప‌డి తాను వేసిన ప్లాన్ నాశ‌నం కావ‌డం జ్యోత్స్న స‌హించ‌లేక‌పోతుంది. దీప‌ను ఇంట్లో అడుగుపెట్ట‌కుండా అడ్డుకోవాల‌ని ఫిక్స‌వుతుంది. కార్తీక్ సీరియ‌స్‌గా ఇంట్లో అడుగుపెడ‌తాడు. దీప అని కోపంగా పిలుస్తాడు. నా త‌ర‌ఫున దీప‌కు వార్నింగ్ ఇవ్వాల‌ని కాంచ‌న‌, అన‌సూయ‌ల‌తో అంటాడు. దీప ఏం చేసింది అని కాంచ‌న అంటుంది. స‌ర‌దాగా అన్నాన‌ని కార్తీక్ అంటాడు.

ఎక్క‌డికి వెళ్లిందో తెలియ‌దు…

ఈ మ‌ధ్య దీప‌లో మార్పు క‌నిపిస్తుంద‌ని, దేనికో కంగారు ప‌డుతుంద‌ని, అర్జెంట్ ప‌ని ఉంద‌ని వెళ్లాల‌ని అంటుంద‌ని దీప అంటుంద‌ని త‌ల్లితో చెబుతాడు కార్తీక్‌. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ‌డం లేద‌ని, మ‌ళ్లీ చేస్తే క‌ల‌వ‌డం లేద‌ని అంటాడు. ఇప్పుడే ఈ విష‌యం తేల్చుకుంటాన‌ని దీప‌ను పిలుస్తాడు. కానీ దీప ఇంట్లో లేద‌ని కాంచ‌న అంటుంది. దీప ఎక్క‌డికి వెళ్లింది అంటే త‌డ‌బ‌డిపోతారు. ఎక్క‌డికి వెళ్లిందో తెలియ‌ద‌ని నిజాన్ని దాచ‌బోతారు.

అస‌లు ఏం జ‌రుగుతుంది…

అస‌లు ఈ ఇంట్లో ఏం జ‌రుగుతుందో నేను తెలుసుకోవ‌చ్చా కాంచ‌న‌, అన‌సూయ‌ల‌ను కోపంగా అడుగుతాడు కార్తీక్‌. మీరు ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు నాకు ఇప్పుడే తెలియాల‌ని అంటాడు. జ్యోత్స్న చేసిన కుట్రల గురించి కార్తీక్‌కు చెబుతుంది కాంచ‌న‌. గౌత‌మ్‌ను కాపాడింది జ్యోత్స్న‌నే అనే నిజం బ‌య‌ట‌పెడుతుంది కాంచ‌న‌.

గౌత‌మ్‌తో పెళ్లికి ఒప్పుకోవ‌డం, నిశ్చితార్థం ఆగిపోవ‌డం, దీప‌పై నింద‌ప‌డ‌టం…ఇవ‌న్నీ జ్యోత్స్న ప్లాన్‌లో భాగ‌మేన‌ని కార్తీక్‌తో అంటుంది కాంచ‌న‌. దీప స్థానంలో నీ భార్య‌గా రావ‌డం కోస‌మే జ్యోత్స్న ఈ కుట్ర‌లు ప‌న్నింద‌ని అంటుంది. త‌న‌ను తండ్రి అవ‌మానించిన సంగ‌తి బ‌య‌ట‌పెడుతుంది కాంచ‌న‌. దీప‌ను బ‌లిప‌శువు చేసింది జ్యోత్స్న కాదు మీరు అని కాంచ‌న‌తో పాటు అన‌సూయ‌పై ఫైర్ అవుతాడు కార్తీక్‌.

ఇంట్లో వాళ్ల‌నే మోసం చేసింది…

ఇన్నాళ్లు బ‌య‌టివాళ్ల‌ను మోసం చేసేది…ఇప్పుడు ఇంట్లో వాళ్ల‌నే మోసం చేసే స్థాయికి దిగ‌జారింద‌ని జ్యోత్స్న‌పై కార్తీక్ చిరాకు ప‌డ‌తాడు. నీకు తెలిస్తే గొడ‌వ‌లు ప‌డ‌తావ‌ని నిజం దాచామ‌ని కాంచ‌న అంటుంది. గొడ‌వ‌లు ప‌డ‌టం కాదు జ్యోత్స్న చెంప‌లు ప‌గ‌ల‌గొట్టాల‌ని ఉంద‌ని అంటాడు.

దీప నిశ్చితార్థం ఆపేసింద‌ని నిప్పులు తొక్కిన‌ట్లు ఎగిరిప‌డ్డ తాత‌కు నిజం చెప్ప‌కుండా ఎందుకు ఉన్నార‌ని కాంచ‌న‌, అన‌సూయ‌పై కోప్ప‌డుతాడు కార్తీక్‌. దీప‌ను నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడినా…సాక్ష్యం లేదు కాబ‌ట్టే మౌనంగా ఉండిపోయా. సాక్ష్యం దొరికిన‌ప్పుడు రెస్టారెంట్‌లో ప‌క్క‌నే ఉన్న నాకు కాకుండా మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెప్పింద‌ని కోపంగా అంటాడు.

ఏ త‌ప్పు లేదు…

దీంట్లో దీప‌ది ఏ త‌ప్పు లేద‌ని కోడ‌లిని వెన‌కేసుకొస్తుంది కాంచ‌న‌. నిజం తెలిసి కూడా ప‌ని ఉంద‌ని చెప్ప‌కుండా వెళ్లిపోయిన దీప‌ది ఏం త‌ప్పులేదు. నిజం నాకు కాకుండా దీప‌కు చెప్పిన పిన్నిది ఏ త‌ప్పు లేద‌ని కార్తీక్ అంటాడు. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024