




Best Web Hosting Provider In India 2024

Siblings day 2025: ఒకే తల్లికి పుట్టిన స్నేహితులు తోబుట్టువులు, కష్టసుఖాలలో ఒకరికొకరు తోడు, హ్యాపీ సిబ్లింగ్స్ డే
Siblings day 2025: తోబుట్టువులు ప్రత్యేక అనుబంధాన్ని పంచుకుంటారు. ఒకే తల్లికి పుట్టిన స్నేహితులుగా ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటారు. వారి బంధానికి గుర్తుగా ఏప్రిల్ 10న జాతీయ తోబుట్టువుల దినోత్సవం నిర్వహించుకుంటారు.

తోబుట్టువులు ఈ ప్రపంచంలో మొదటి స్నేహితులు. ఒకే కుటుంబంలో పెరిగిన తోబుట్టువులు కష్టసుఖాలను పంచుకునిపెరుగుతారు. వారి మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. ఆనందాన్ని షేర్ చేసుకుని ఓటమి సమయంలో ఒకరికొకరు ఓదార్పుగా ఉంటారు. తల్లిదండ్రుల తరువాత ఒక వ్యక్తికి బాగా దగ్గరయ్యే వ్యక్తులు తోబుట్టువులే.
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు… మళ్లీ కలిసి ఆడుకుంటారు. కలిసి ప్రతి పనిని పూర్తి చేస్తారు. అమ్మానాన్నలకు అండగా నిలుస్తారు. పెద్దయ్యాక తోబుట్టువులతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను మరచిపోవడం చాలా కష్టం. తోబుట్టువులు హద్దుల్లేని ప్రేమ బంధాలను పంచుకుంటారు. చివరి వరకు ఒకరికొకరు అండగా ఉంటామనే వాగ్దానం చేస్తారు.
మన రహస్యాలను దాచుకోవడం దగ్గర్నుంచి మన మనసులో ఏముందో చెప్పేదే తోబుట్టువులే. వారితో పంచుకునే ప్రత్యేక బంధాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏప్రిల్ 10న జాతీయ తోబుట్టువుల దినోత్సవం జరుపుకుంటారు.
ఈ దినోత్సవం చరిత్ర
1995లో, న్యూయార్క్ కు చెందిన లీగల్ ఆఫీసర్ క్లాడియా ఎవర్ట్, తనకు తన తోబుట్టువులు అలన్, లిజ్సెట్ మధ్య ఉన్న ప్రత్యేక బంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉండాలని అనిపించింది. తన లాగే ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు ఉంటారు. వారితో ఉన్న తీపి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి ఒక ప్రత్యేక దినోత్సం ఉండాలని తొలిసారి ‘జాతీయ తోబుట్టువుల దినోత్సవం’ నిర్వహించుకోవడం ప్రారంభించింది.
క్లాడియాకు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు వేర్వేరు ప్రమాదాలలో మరణించారు. కానీ వారిని మర్చిపోవడం క్లాడియా వల్ల కాలేదు. వారితో ఉన్న అనుబంధాన్ని ఏటా ఏప్రిల్ 10 ఆమె గుర్తు చేసుకుంటుంది.
ప్రాముఖ్యత
జాతీయ తోబుట్టువుల దినోత్సవం మీ తోబుట్టువులు మీకు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, ప్రజలు తమ తోబుట్టువులకు బహుమతుల అందిస్తారు. వారితో ఎక్కువ సమయంలో గడుపుతారు. కష్టసుఖాలలో అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అండగా ఉంటామని మాట ఇస్తారు.
తోబుట్టువులు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. తోబుట్టువులు లేని వారి జీవితం అంత అందంగా ఉండదు. మనం మన సోదర సోదరీమణులను గౌరవించాలి. ఆప్యాయతను చూపించాలి. ఒకరినొకరు అభినందించుకోవాలి. జాతీయ తోబుట్టువుల దినోత్సవం రోజున ఈ పనులు చేయడం మర్చిపోవద్దు.
కుటుంబంలో పుట్టిన క్రమంలో ఏ తోబుట్టువుకు తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ విషయంపై కొన్నేళ్లుగా అనేక పరిశోధనలు జరిగాయి. 2018 లో ప్రచురించిన మమ్స్నెట్ పరిశోధన ప్రకారం, తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అందుకే ఇంట్లో చిన్నవారికి గారాబం ఎక్కువ చేస్తారు.
జాతీయ తోబుట్టువుల దినోత్సవం తోబుట్టువుల బంధాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కుటుంబం ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఒక తోబుట్టువు తరచుగా మరొకరి అవసరాల కోసం త్యాగం చేయాలి. మీకు మీ అన్నదమ్ములు చేసిన సహాయ సహకారాలు, పంచిన ప్రేమను గుర్తు తెచ్చుకోండి. తోబుట్టువులు ఉన్న అందరికీ హ్యాపీ సిబ్లింగ్స్ డే.
సంబంధిత కథనం
టాపిక్