




Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: మాణిక్యంకు కల్లు తాగించిన బాలు- ప్లాన్ అట్టర్ ఫ్లాప్- శత్రువుల్లా అన్నదమ్ములు
Gunde Ninda Gudi Gantalu Serial April 10th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 10 ఎపిసోడ్లో రోహిణి మావయ్య మలేషియా మాణిక్యంకు కల్లు తాగించి నిజాలు రాబట్టాలని బాలు తన ఫ్రెండ్స్‌తో ప్లాన్ వేస్తాడు. కానీ, ఫుల్లుగా తాగిన మటన్ కొట్టు మాణిక్యం మత్తులో కిందపడిపోతాడు. దాంతో బాలు ప్లాన్ ఫ్లాప్ అవుతుంది.

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సుశీల ఇంట్లో తనకు తల్లి లేదని రోహిణి బాధపడుతుంది. మేమున్నాం అంటూ మీనా, శ్రుతి ఓదార్చుతారు. నేను నీకు తల్లిగా ఉన్నాని ప్రభావతి అంటుంది. దానికి సుశీల ప్రభావతికి క్లాస్ తీసుకుంటుంది.
తనను పూజించినట్లుగా
ఒక్క రోహిణిని మాత్రమే కాదు. ముగ్గురు కోడళ్లను సమానంగా చూసుకోవాలి అని ప్రభావతితో అంటుంది. రోహిణికి తల్లి లేదు, మీనాకు తండ్రి లేడు, శ్రుతికి ఇద్దరు ఉన్నారు. కానీ, ఎవరు మీతో రారు. మీ అత్తమామలననే తల్లిదండ్రులుగా చూసుకునే బాధ్యత మీకు కూడా ఉంది. అత్తమామలను చూసుకుంటే తనకంటే ఎక్కువ పూజించినట్లుగా దేవుడు భావిస్తాడట అని సుశీల అంటుంది. దాంతో ముగ్గురు తల ఊపుతారు.
బద్ధ శత్రువుల్లా మారారు
తర్వాత ప్రభావతిని నీ ముగ్గురు కొడుకులు సరిగా లేరు. ఒకరికి ఒకరంటే పడదు. ఎందుకు నువ్ వాళ్లను బేధాలతో పెంచావ్. దాంతో వారు బద్ద శత్రువుల్లా మారారు. మీరు నన్ను ఏకాకిని చేసి వెళ్లిపోయినట్లు రేపు వాళ్లు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే తట్టుకునే శక్తి నా కొడుక్కి లేదు. నీకు కూడా ఉండదు అని సుశీల బాధగా చెబుతుంది. బాలు గాడే ఏదో ఒకటి అంటుంటాడు తప్ప నేను అందరిని బాగానే చూసుకుంటున్నాను అత్తయ్య అని ప్రభావతి అంటుంది.
శ్రుతి మాటకు ప్రభావతి సైలెంట్
ఆంటీ నాకు అమ్మ ఉంది. మీనాకు అమ్మ ఉంది. రోహిణిని మీరు ఎలాగు అమ్మలాగే చూస్తారు. కాబట్టి నాకున్న అమ్మ చాలు. మీరు నాకు అత్తలాగే ఉండండి ఆంటీ అని శ్రుతి అంటుంది. దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. సుశీల నవ్వుకుంటుంది. రోహిణి కూడా ఆశ్చర్యపోతుంది. శ్రుతి ఇంతేలా అన్నట్లుగా మీనా అనుకుంటుంది. ఏం చెప్పలేక సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. మరోవైపు రోహిణి మావయ్యకు తన ఫ్రెండ్స్‌తో కలిసి కల్లు తాగిస్తుంటాడు బాలు.
బాలు పంచులు, సెటైర్లు
బాలు ఫ్రెండ్స్ అంతా మటన్ కొట్టు మాణిక్యంతో సరదాగా మాట్లాడుతూ అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఇంతలో మనోజ్ అక్కడికి వస్తాడు. అదంతా చూసి షాక్ అవుతాడు. ఇలా ఛీప్‌గా కల్లు తాగడం ఏంటీ, ఆయన మలేషియా నుంచి వచ్చారు. ఇలాంటివి తాగరు అని బాలును అంటాడు మనోజ్. దాంతో మనోజ్‌కు బాలు పంచులు, సెటైర్లు వేస్తాడు. ఇక చేసేది లేక రోహిణికి తెలిస్తే తిడుతుంది అని మాణిక్యంతో అంటాడు మనోజ్.
ఎంత మర్యాద చేస్తున్నారో
ఏం పర్లేదు కానీ, చూడు వీళ్లంతా నాకు ఎంత మర్యాద చేస్తున్నారో అని మాణిక్యం అంటాడు. దాంతో మనోజ్ సైలెంట్‌గా చూస్తుండిపోతాడు. నీ నుంచి నిజాలు రాబట్టడానికే ఇదంతా అని బాలు మనసులో అనుకుంటాడు. తర్వాత బాలు ఫ్రెండ్స్‌తో కలిసి మాణిక్యం కల్లు తెగ తాగేస్తుంటాడు. ముంత మీద ముంత తాగుతూనే ఉంటాడు. అది చూసి షాక్ అయిన మనోజ్ ఈయనేంటీ ఇంతలా తాగుతున్నాడు అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మలేషియాలో ఏం చేసేవాడివి
ముంత మీద ముంత మీద మాణిక్యంకు కల్లు తాగించిన బాలు ఫ్రెండ్స్ అతన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెడతారు. మలేషియాలో నువ్ ఏం చేసేవాడివి అని రాజేష్ అడుగుతాడు. కల్లు బాగా ఎక్కిన మాణిక్యం పైకి లేచు అటు ఇటు తూలుతుంటాడు. నా ఏరియా ఎక్కడో తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అంతా చెబుతున్నాడురా అన్నట్లుగా బాలు చెవిలో రాజేష్ మెల్లిగా చెబుతాడు.
కిందపడిపోయిన మాణిక్యం
నా ఏరియాలో నేను పెద్ద ఫేమస్సో తెలుసా అని తూలుతూ మటన్ కొట్టు మాణిక్యం అంటాడు. ఎక్కడ అంకుల్ అని బాలు ఉత్సాహంగా అడుగుతాడు. కానీ, అదేం చెప్పకుండానే మాణిక్యం కల్లు ఎక్కువై కిందపడిపోతాడు. బాబాయ్.. బాబాయ్ అంటూ బాలు పిలిచిన మాణిక్యం లేవడు. దాంతో ఏంట్రా నిజం చెప్పించాలనుకున్న నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది అని రాజేష్ అంటాడు. దానికి బాలు మాత్రం అస్సలు వదిలిపెట్టను అని అంటాడు.
ప్రభావతి ఫైర్
వీడు కచ్చితంగా మలేషియా నుంచి రాలేదు. వీడి నుంచి ఎలాగైనా నిజం రాబట్టాలి అని మనసులో గట్టిగా అనుకుంటాడు బాలు. ఇక మరోవైపు మాణిక్యంకు కల్లు తాగిపించిన సంగతి రోహిణి, ప్రభావతి వాళ్లకు చెబుతాడు మనోజ్. దాంతో ప్రభావతి బాలును నానా మాటలు అంటుంది. ఆ డ్రైవర్ గాడికి కల్లు తప్పా ఇంకేం తెలుస్తుంది అని ఫైర్ అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం