Peddapalli Suicides: బిడ్డకు ఉరేసి తల్లి ఆత్మహత్య….పెద్దపల్లి జిల్లాలో దారుణం

Best Web Hosting Provider In India 2024

Peddapalli Suicides: బిడ్డకు ఉరేసి తల్లి ఆత్మహత్య….పెద్దపల్లి జిల్లాలో దారుణం

HT Telugu Desk HT Telugu Published Apr 10, 2025 10:03 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Published Apr 10, 2025 10:03 AM IST

Peddapalli Suicides: పెద్దపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదిన్నర పాపకు ఉరేసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికి పసిపాపకు ఉరేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

పెద్దపల్లిలో బిడ్డకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
పెద్దపల్లిలో బిడ్డకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

Peddapalli Suicides: పెద్దపల్లి జిల్లాలో బిడ్డకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రానికి చెందిన లోక వేణుగోపాల్ రెడ్డికి అయిదేళ్ల కిందట కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరకు చెందిన సాహితి(27)తో వివాహం అయ్యింది. వారికి ఏడాదిన్న వయసున్న కూతురు రీతిన్య ఉంది.

పెద్దపల్లి ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న వేణుగోపాల్ బుధవారం ఉద్యోగ రీత్యా జగిత్యాల కు వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చేసరికి కూతురు రితిన్య, భార్య సాహితి ప్లాస్టిక్ తాడుకు వేలాడుతూ విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రిపూట తల్లికూతురు మృతదేహాలను పెద్దపల్లి ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు.

సాహితి మానసిక స్థితి సరిగా లేక గత కొంతకాలంగా ఇబ్బందిపడుతుందని అందులో బాగంగానే బిడ్డకు ఉరేసి తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు సందర్శించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మొన్న రుద్రంగిలో… నేడు పెద్దపల్లిలో..

మూడు రోజుల క్రితం రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తల్లి కొడుకు పుష్పలత, నిహాన్ ఆత్మహత్య చేసుకున్నారు. పాయిజన్ కలిపిన చపాతి మూడేళ్ళ బాబుకు తినిపించి తల్లి తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన మరిచిపోకముందే పెద్దపల్లి జిల్లాలో ఏడాదిన్నర పాపకు ఉరేసి తల్లి ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది.

మానసిక ఆందోళనతో క్షణికావేశంతోనే ఆ ఇద్దరు తల్లులు పిల్లలను చంపి తాము తనువు చాలించినట్లు తెలుస్తుంది. ఆవేశాలకు లోనుకాకుండా ఆలోచనతో పనిచేస్తే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్

Crime TelanganaCrime NewsPeddapalliTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024