




Best Web Hosting Provider In India 2024

Adventure Horror OTT: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన మలయాళం అడ్వెంచర్ హారర్ మూవీ – ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్
Horror OTT: మలయాళం హారర్ ఫాంటసీ మూవీ బియాండ్ ది సెవన్ సీస్ ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళం అడ్వెంచర్ హారర్ మూవీ బియాండ్ ది సెవన్ సీస్ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు. కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ మూవీ చూడొచ్చు.
మలయాళం మూవీ…
బియాండ్ ది సెవన్ సీస్ మూవీకి ప్రతీష్ ఉత్తమన్, స్మిటీ టైటస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అథిరా పటేల్, ప్రశాంతి నాయర్, గౌరి గోపన్ కీలక పాత్రలు పోషించారు. 2022లో ఈ మలయాళం మూవీ థియేటర్లలో రిలీజైంది. విజువల్స్ బాగున్నా తాము అనుకున్న పాయింట్‌ను తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకద్వయం తడబడిపోయారు. థియేటర్లలో బియాండ్ ది సెవన్ సీన్ డిజాస్టర్‌గా నిలిచింది.
మిస్టరీయస్ ఐలాండ్…
కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఓ యువకుడ మిస్టరీయస్ ఐలాండ్‌లోకి ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి బయటపడేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. మరోవైపు తన తల్లి ప్రాణాలకు ప్రమాదం ఉందనే నిజం బయటపడుతుంది. ఆ ఐలాండ్‌కు ఆ యువకుడికి ఎలాంటి సంబంధం ఉంది? ఆ ఐలాండ్‌లో మిస్టరీని ఎలా బయటపెట్టాడు? అందులోని అదృశ్య శక్తులతో ఏ విధమైన పోరాటం సాగించాడు అన్నదే బియాండ్ ది సెవన్ సీస్ మూవీ కథ.
ఐఎమ్‌డీబీలో…
హాలీవుడ్ ఫాంటసీ సినిమాల స్ఫూర్తితో దర్శకులు ఈ సినిమాను రూపొందించారు. ఐఎమ్‌డీబీ ఈ మూవీకి 7.1 రేటింగ్‌ను ఇచ్చింది. సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ పాటు వీఎఫ్ఎక్స్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి.
బియాండ్ ది సెవన్ సీస్లో కీలక పాత్ర పోషించిన అథిరా పటేల్ మలయాళంలో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేసింది. కాంటెస్సా, పొన్ మాణికవేళ్, భోగన్ విల్లా, భూతకాలం సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
మలయాళం సినినమాలు
ఈ వారం బియాండ్ ది సెవన్ సీస్‌తో పాటు ప్రవీణ్‌కూడు షాప్పు, పైన్కిల్తో పాటు మరికొన్ని మలయాళ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.
సంబంధిత కథనం