



Best Web Hosting Provider In India 2024

Asha Pasham Song Lyrics: ఆశ పాశం సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 11 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకున్న బ్లాక్‌బస్టర్ ఇది
Asha Pasham Song Lyrics: కేరాఫ్ కంచరపాలెం సినిమాలోని ఆశ పాశం సాంగ్ యూట్యూబ్ లో 11 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. ఎంతో హాయిగొలిపే మెలోడీ ఉన్న ఈ సాంగ్ ను మీకు ఇష్టమైన వారి కోసం పాడుకోండి.

Asha Pasham Song Lyrics: కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బోరు కొట్టదు. పైగా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తూనే ఉంటుంది. అలాంటిదే ఈ పాట కూడా. కేరాప్ కంచరపాలెం అనే ఓ చిన్న సినిమా నుంచి వచ్చిన ఆశ పాశం (asha pasham) సాంగ్ కూడా అలాంటిదే. ఆరున్నరేళ్ల కిందట యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఈ సాంగ్ ఇప్పటికే 11 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి.
ఆశ పాశం సాంగ్
వెంకటేశ్ మహా డైరెక్షన్ లో 2018లో వచ్చిన మూవీ కేరాఫ్ కంచరపాలెం. ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించింది. డిఫరెంట్ స్టోరీలైన్ తోపాటు ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆశ పాశం సాంగ్ అయితే ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
ఈ పాటను స్వీకార్ అగస్తి కంపోజ్ చేయగా.. అనురాగ్ కులకర్ణి పాడాడు. ఇక విశ్వ లిరిక్స్ అందించాడు. ఒక్క పాటతో జీవితసారాన్ని చెప్పిన ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ మీకోసం ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.
ఆశ పాశం సాంగ్ లిరిక్స్ ఇవే
పల్లవి
ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
సేరువైనా సేదూ దూరాలే
తోడౌతూనే ఈడే వైనాలే
నీదో కాదో తేలేలోగానే ఏదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోనా.. సాగేనా..
చరణం 1
ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో
లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో
నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి
సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం
దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు
పల్లటిల్లిపోయి నీ వుంటే తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా
ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా.. సాగేనా
ఆశ పాశం బందీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో
చరణం 2
ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడలా విధి వేచున్నదో
ఏ మలుపులో ఏం దాగున్నదో
నీవుగా తేల్చుకో నీ శైలిలో
సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న
లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం
నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని
పక్కదారి పట్టి పోతుంటే కంచికి నీ కథలే దూరం
నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా
రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా
ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా.. ఉంటున్నా..
సంబంధిత కథనం