




Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller: ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండదు!
OTT Crime Thriller: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రవీణ్ కూడు షాప్పు ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ మూవీ గురువారం సాయంత్రం నుంచే సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ హీరోలుగా నటించారు.

OTT Crime Thriller: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రవీణ్‌కూడు షాప్పు ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న సోనీలివ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సోనీలివ్ ప్రకటించింది. ఏప్రిల్ 10… సాయంత్రం నుంచే ఈ మూవీని చూడొచ్చని వెల్లడించింది.
ప్రవీణ్‌కూడు షాప్పు మూవీని సోనీలివ్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
డార్క్ హ్యూమర్ థ్రిల్లర్…
డార్క్ హ్యూమర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ప్రవీణ్ కూడు షాప్పు మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీతోనే అతడు దర్శకుడిగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్, శబరీష్ వర్మ ప్రధాన పాత్రలు పోషించారు. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో ఆరు కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. బాసిల్ జోసెఫ్ కెరీర్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఒక హత్య…11 మంది అనుమానితులు…
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా దర్శకుడు శ్రీరాజ్ ప్రవీణ్‌కూడు షాప్పు మూవీని తెరకెక్కించాడు. వర్షం వల్ల కల్లు షాప్‌ను మూసేస్తారు. కానీ ఓ పదకొండు మంది మిత్రులు మాత్రం రాత్రి అదే కల్లు షాప్‌లో రాత్రంతా పేక ఆడుతారు. మత్తులో అక్కడే పడుకొంటారు. ఉదయం లేచిచూసేసరికి కల్లు షాప్ ఓనర్…షాప్‌లోనే ఉరేసుకొని చనిపోయి కనిపిస్తాడు.
ఈ మర్డర్ కేసును ఇన్వేస్టిగేషన్ చేసే బాధ్యతను ఎస్ఐ సంతోష్ చేపడతాడు. అతడి ఇన్వేస్టిగేషన్‌లో ఏం తెలిసింది? అదే కల్లు షాప్‌లో వెయిటర్‌గా పనిచేసే కన్నన్‌కు ఈ హత్యకు ఎలాంటి సంబంధం ఉంది? కన్నన్ గత ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
టెక్నికల్‌గా బాగుంది కానీ…
ప్రవీణ్ కూడు షాప్పు మూవీలో బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ యాక్టింగ్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్‌కు బాగుందనే కామెంట్స్ వచ్చాయి. టెక్నికల్‌గా ఈ మూవీ అద్భుతమంటూ ప్రశంసించారు. కానీ రొటీన్ స్టోరీ కారణంగా సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
గత కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బాసిల్ జోసెఫ్. అతడు హీరోగా నటించిన సూక్ష్మదర్శిని, పొన్‌మాన్ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
సంబంధిత కథనం