



Best Web Hosting Provider In India 2024

Hyderabad : త్వరలోనే ఆ వివరాలన్నీ అందుబాటులో ఉంచుతాం – హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నగరంలోని చెరువుల హద్దులు, ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. హైడ్రా రావడంతో ప్రజలందరికీ చెరువుల హద్దులు తెలుస్తున్నాయని చెప్పారు.

పర్యావరణ హిత నగరానికి హైడ్రా దిక్సూచి వంటిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. చెరువులు, పార్కులు, నాళాలు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షేందుకు ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
ఆదిలో హైడ్రా చట్టబద్ధత పై పలువురికి అనుమానాలున్నా తర్వాత అన్ని పటాపంచలయ్యాయని వ్యాఖ్యానించారు. గురువారం ఎల్బీ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన… జీవితంలో పెళ్లి, సొంత ఇళ్లు చాలా ముఖ్యమైన అంశాలని.. వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అందుబాటులోకి హద్దుల వివరాలు – రంగనాథ్
“స్థిరాస్తి కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది సర్వే నంబర్లను మార్చేసి, ప్రైవేట్ పట్టాల అనుమతులతో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టేసి అమ్మేస్తున్నారు. అందుకే అన్ని విధాల పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. హైడ్రా రావడంతో ప్రజలందరికీ చెరువుల హద్దులు తెలిశాయి. FTL, బఫర్ జోన్లు గురించి చర్చించుకుంటున్నారు. త్వరలోనే నగరంలోని చెరువుల హద్దులు, ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలందరికీ అందుబాటులో హైడ్రా ఉంచుతోంది” అని రంగనాథ్ ప్రకటించారు.
“నగర పరిధిలోని చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ముందుగా 6 చెరువుల అభివృద్ధి పనులు ప్రారంభించాం. వచ్చే వర్షాకాలానికి యివి సిద్ధమవుతాయి. చెరువులు, నాలా ల అభివృద్ధితో నగరంలో వరద ముప్పును కూడా నివారించ వచ్చు” అని చెప్పారు.
“రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో అన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం స్పీడ్ తగ్గింది. నగరంలో దాదాపు 3 లక్షలవరకు ఫ్లాట్లు, ఇళ్లు ఇప్పటికే కట్టి ఉన్నాయని.. అవి అమ్ముడుపోవాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. మోసాలకు ఆస్కారం లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం 2008లో కూడా మందగించింది అని… అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లు, ఫ్లాట్లు వుంటే వ్యాపారం పుంజుకుంటుంది” అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
టాపిక్