OTT Action Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఆరు భాషల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

OTT Action Thriller: ఓటీటీలోకి నేరుగా వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఆరు భాషల్లో స్ట్రీమింగ్

Hari Prasad S HT Telugu
Published Apr 10, 2025 10:04 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి మరో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చింది. గురువారం (ఏప్రిల్ 10) ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. తెలుగు సహా మొత్తంగా ఆరు భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు.

ఓటీటీలోకి నేరుగా వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఆరు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి నేరుగా వచ్చిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగు సహా ఆరు భాషల్లో స్ట్రీమింగ్

OTT Action Thriller: ఓ ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రపంచ దేశాధినేతల సదస్సుపై ఉగ్రదాడి నేపథ్యంలో సాగే ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 10) స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉండటం విశేషం.

జీ20 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు జీ20. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మొత్తాన్ని సౌతాఫ్రికాలో చిత్రీకరించారు. “ఆమెనే లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడామెనే ముప్పుగా మారింది” అనే క్యాప్షన్ తో ఈ జీ20 మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ప్రైమ్ వీడియో వెల్లడించింది. కొత్త ఒరిజినల్ మూవీ అంటూ ఈ జీ20ని ఆ ఓటీటీ పరిచయం చేసింది.

జీ20 మూవీ స్టోరీ ఏంటంటే?

జీ20 మూవీని పాట్రిసియా రెగెన్ డైరెక్ట్ చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వయోలా డేవిస్, ఆంథోనీ ఆండర్సన్, మర్సాయి మార్టిన్ లాంటి వాళ్లు నటించారు. సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. అక్కడ జీ20 సదస్సు జరుగుతుండగా ఉగ్రదాడి నేపథ్యంలో మూవీ సాగుతుంది.

ఈ దాడి నుంచి తనను, తన కుటుంబాన్ని, ప్రపంచాన్ని కాపాడటానికి అమెరికా అధ్యక్షురాలుగా ఉన్న డానియెల్ సటన్ ఏం చేసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఈ జీ20ని థియేటర్లలో కాకుండా నేరుగా ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం 240 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో ఆరు భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో యాక్షన్ థ్రిల్లర్

అటు నెట్‌ఫ్లిక్స్ లోకి కూడా ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు హావోక్ (Havoc). ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఎప్పుడో నాలుగేళ్ల కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. మొత్తానికి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తోంది.

హావోక్ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీని గారెత్ ఇవాన్స్ డైరెక్ట్ చేశాడు. ఇందులో టామ్ హార్డీ, జెస్సీ మై లీ, ఫారెస్ట్ విటేకర్, టిమోతీ ఓలీఫెంట్ లాంటి వాళ్లు నటించారు. యూకే, అమెరికా దేశాలకు చెందిన సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఏకంగా 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ.773 కోట్లు) బడ్జెట్ తో రూపొందించిన మూవీ ఇది.

ఓ డ్రగ్ డీల్ విషయంలో దెబ్బ తిన్న ఓ డిటెక్టివ్.. అండర్‌వరల్డ్ లోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ చిక్కుకున్న ఓ రాజకీయ నాయకుడి కొడుకును బయటకు తీసుకురావడానికి అతడు ఎలాంటి ప్రయత్నం చేస్తాడన్నది ఈ హావోక్ సినిమాలో చూడొచ్చు. ఇందులో టామ్ హార్డీ.. వాకర్ అనే డిటెక్టివ్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఇవాన్స్ తో కలిసి టామ్ హార్డీ కూడా ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024