Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: ధశరథ్‌ను గన్‌తో షూట్ చేసిన దీప – జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ – కార్తీక్ షాక్
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఏప్రిల్ 11 ఎపిసోడ్‌లో జ్యోత్స్న అంతు చూడాలని ఆవేశంగా ఆమె ఇంటికొస్తుంది దీప. చేసిన తప్పులు ఒప్పుకోమని వార్నింగ్ ఇస్తుంది. నిన్ను, నీ కూతురిని చంపి మా బావ చేత నా మెడలో తాళి కట్టించుకుంటానని దీపతో ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న.
తన ఎంగేజ్‌మెంట్‌ను ప్లాన్ చేసి చెడగొట్టుకున్న జ్యోత్స్న…ఆ నిందను దీపపై కావాలనే వేసిందనే నిజాన్ని కార్తీక్‌తో చెబుతుంది కాంచన. ఈ నిజం తన దగ్గర దాచినందుకు దీపతో పాటు తల్లిపై కార్తీక్ ఫైర్ అవుతాడు.మీరు చెప్పింది శివన్నారాయణ అసలు నమ్మడని, సాక్ష్యాలు తీసుకొచ్చినా ఎంతకు కొన్నావని అడిగే మనిషి అతడు అని కార్తీక్ అంటాడు.
తుఫాన్ ఊరి మీద పడినట్లు…
దీప ఇంట్లో కనబడకపోతే నాకు ఫోన్ చేసి చెప్పాలిగా అని తల్లితో పాటు అనసూయపై కోప్పడుతాడు కార్తీక్. కనీసం దీప ఇప్పుడైనా ఎక్కడికి వెళ్లిందో తెలుసా అని కార్తీక్ నిలదీస్తాడు. గుడికి వెళ్లి ఉంటుందని అనసూయ సమాధానం ఇస్తుంది. ఆమె ఆన్సర్ వినగానే కార్తీక్ కోపం మరింత పెరుగుతుంది.
జ్యోత్స్న ఇన్ని చెత్త పనులు చేసింది అని తెలిసిన తర్వాత గుడికి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని ఉంటుందని అనుకుంటున్నారా అని అంటాడు. తుఫాన్ సముద్రం దాటి ఊరి మీద పడినట్లు…దీప ఈ పాటికి ఊరి మీద పడే ఉంటుంది. జ్యోత్స్న దొరికిందో చచ్చిందే అని తల్లితో పాటు అనసూయకు చెబుతాడు కార్తీక్.
మరో నాటకం ఆడి…
ఇన్ని నాటకాలు ఆడిన జ్యోత్స్న మరో నాటకం ఆడి దీప చెప్పింది అబద్ధం చాలా పద్దతిగా నిరూపించగలదని కార్తీక్ చెబుతాడు. ఇప్పుడు దీపను ఆపడం తప్ప మరో దారి లేదని జ్యోత్స్న ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్. మేము వస్తామని కాంచన, అనసూయ అంటారు. ఈ సారి నేనే ఒక్కడినే వెళతానని కార్తీక్ అంటాడు.
సాక్ష్యాలు, ఆధారాలు…
కార్తీక్ ఊహించినట్లే దీప ఆవేశంగా జ్యోత్స్న ఇంటికి వస్తుంది. దీప ఇంట్లోకి వస్తే ఏ గొడవ చేస్తుందో అని భయపడిన జ్యోత్స్న బయటే ఉంటుంది. చీకట్లో బాణం వేసి నిజం తెలిసిపోయింది అంటే నమ్మేంత అమాయకురాలిని కాదని జ్యోత్స్న అంటుంది. నువ్వు మీ నానమ్మ మాట్లాడుకుంది చీకట్లో కాదు కదా అని దీప అంటుంది. మనకు మంచి చేసేవాళ్లు మన చుట్టూనే ఉంటారని చెబుతుంది.
గౌతమ్ చెడ్డవాడు అంటే సాక్ష్యాలు, ఆధారాలు ఏవి అని అడిగారుగా…నువ్వు అంతకంటే చెడ్డదానివని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు నా దగ్గర ఉన్నాయని దీప కోపంగా అంటుంది. నువ్వెళ్లి మీ తాత కాళ్లపై పడి నిజాన్ని ఒప్పుకుంటావా…నన్ను వెళ్లి చెప్పమంటావా అని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది దీప. నా సహసాన్ని పరీక్షించవద్దని అంటుంది.
కొట్టకుండా వదిలేశా…
నిన్ను కొట్టకుండా వదిలేసినందుకు సంతోషించమని జ్యోత్స్నతో అంటుంది దీప. తాను ఏ తప్పు చేయలేదని బుకాయించబోతుంది జ్యోత్స్న. తప్పులు కాదు పాపాలు చేస్తున్నావని దీప కోపంగా అంటుంది. మా బావ కోసమే పాపాలు చేస్తున్నానని, నిజాయితీగా ఉన్న నన్ను నాశనం చేయించింది నువ్వు అని దీపపై ఎగిరిపడుతుంది జ్యోత్స్న. అబద్దాలు, మోసాలు, పాపాలు చేయిస్తుంది నువ్వే అని జ్యోత్స్న కోపంగా అంటుంది.
మంచిదానివిఅనే ముద్ర…
మా బావ జీవితంలో నుంచి వెళ్లగొడట్టానికే ఇదంతా చేశానని లన ప్లాన్ బయటపెడుతుంది. మా బావను మనసులో పెట్టుకొని వేరే వాడితో ఎలా తాళి కట్టించుకుంటానని అంటుంది. జనాల్లో నీ మీద ఉన్న సింపథీతో పాటు మంచిదానివి అనే ముద్రను చెరిపేయాలన్నదే నా ప్లాన్ అని జ్యోత్స్న అంటుంది. కానీ ఇప్పుడు కూడా అదృష్టం నీవైపే ఉందని, నా ప్లాన్ మొత్తం నీకు తెలిసిపోయిందని జ్యోత్స్న.
జీవితాన్ని ఇచ్చిన దేవుడు…
కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవని జ్యోత్స్నతో అంటుంది దీప. నువ్వు ఉన్నావా అని దీపను అడుగుతుంది జ్యోత్స్న. ఆ మనిషి మనసులో ఉన్నాను కాబట్టే అతడు నాతో ఉన్నాడని దీప బదులిస్తుంది. కార్తీక్ తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు అని, తన మనసులో లేకుండా ఎలా ఉంటాడని దీప కోపంగా అంటుంది.
నమ్మించి మోసం చేశాడు…
కార్తీక్ నీ భర్త అని మీ ఇద్దరికి పెళ్లి చేయడానికే మీ ఇంటికి వచ్చానని నమ్మించి మోసం చేసిన నీలాంటిదానిని ఏం చేసిన తప్పులేదని జ్యోత్స్న అంటుంది. తప్పులేదంటూనే తప్పులు చేస్తున్నావని, అన్ని ఇక్కడితో ఆపేయమని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది దీప. మా బావనే పెళ్లి చేసుకుంటానని దీపతో అంటుంది జ్యోత్స్న. అడ్డుగా ఉన్నది నువ్వు నీ కూతురు కాబట్టి నిన్ను నీ కూతురిని బతకనివ్వను. మీ ఇద్దరిని చంపి మా బావ చేత నేను తాళి కట్టించుకుంటానని అంటుంది. జ్యోత్స్న మాటలతో దీప కోపం పట్టలేకపోతుంది. చెంపపై లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది.
చంపేంత ప్రేమ…
బావ కోసం నిన్ను, నీ కూతురిని చంపేంత ప్రేమ నాకు ఉందని జ్యోత్స్న అంటుంది. ఆమె మాటలతో కోపం పట్టలేని దీప…జ్యోత్స్న పీక పట్టుకుంటుంది. జ్యోత్స్న విడిపించుకుంటుంది. నా బావ జోలికి వస్తే నిన్నే చంపాలనుకున్నా…నీ కూతురు ఎంత అని దీపను రెచ్చగొడుతుంది జ్యోత్స్న. నా కూతురి గురించి మాట్లాడకు. నీకు బీపీ వస్తుంది. ఆ తర్వాత నా బుర్ర పనిచేయదు. నిన్ను కొడతానో, చంపుతానో తెలియదని అంటుంది. శౌర్యను బతకనివ్వనని, ఈ రోజే చంపుతానని జ్యోత్స్న అంటుంది.
నిన్ను నీ కూతురిని చంపే మా బావ చేత నా మెడలో తాళి కట్టించుకుంటానని దీపతో జ్యోత్స్న ఛాలెంజ్ చేసి ఇంట్లోకి పారిపోతుంది.
గన్ గురిపెట్టిన జ్యోత్స్న…
కోపం పట్టలేకపోయిన దీప…పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఆవేశంగా ఇంట్లో అడుగుపెడుతుంది. చంపుతానని అన్నావుగా…భయమేసి దాక్కున్నావా…బయటకు రా అని జ్యోత్స్నను పిలుస్తుంది.
లోపలికి వచ్చింది దాక్కోవడానికి కాదని గన్ తీసి దీపపై గురి పెడుతుంది జ్యోత్స్న. దీప నన్ను చంపడానికి వచ్చింది. ఆత్మరక్షణ కోసం వేరే దారి లేక దీపను చంపేశానని చెబుతానని జ్యోత్స్న అంటుంది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవని అంటుంది. నిన్ను చంపేసి…నీ కూతురిని నీ దగ్గరకే పంపుతానని దీపను షూట్ చేయబోతుంది జ్యోత్స్న.
సుమిత్ర షాక్…
అంతవరకు నువ్వు బతికి ఉంటే కదా అని…జ్యోత్స్న చేతిలోని గన్ లాక్కొని ఆమెకు గురి పెడుతుంది దీప. నన్ను చంపొద్దు…వదిలేయ్ అని దీప బతిమిలాడటం మొదలుపెడుతుంది జ్యోత్స్న. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర, దశరథ్…జ్యోత్స్నకు దీప గన్ గురిపెట్టడం చూసి షాకవుతారు. దీప నన్ను చంపాలని చూస్తుందని, కాపాడమని యాక్టింగ్ మొదలుపెడుతుంది జ్యోత్స్న. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలిని చంపడానికి చూస్తావని దీపపై విరుచుకుపడుతుంది పారిజాతం. ఎవరేంటో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అందరికి తెలియాలని దీప అంటుంది.
ఏం అన్యాయం చేశాం…
జ్యోత్స్నను దీప చంపేస్తుందని అరుస్తూ శివన్నారాయణను పిలుస్తుంది పారిజాతం. మరోవైపు దశరథ్, సుమిత్ర కూడా జ్యోత్స్నను ఏం చేయద్దని దీపను బతిమిలాడుతారు. నా గన్ దీప చేతికి ఎలా వచ్చిందని శివన్నారాయణ షాకవుతాడు. నీకు మేము ఏం అన్యాయం చేశావని ఎందుకు ఇంతలా మాపై పగ పట్టావని దీపను కొప్పడుతాడు శివన్నారాయణ.
పోలీసులకు ఫోన్…
జ్యోత్స్న ప్లేట్ ఫిరాయిస్తుంది. నువ్వే నా నిశ్చితార్థం చెడగొట్టావ్…రమ్య చేత అబద్ధం ఆడించావు…పెళ్లి జరగనివ్వను అని నన్ను కొట్టావ్…కర్ర తీసుకొని నన్ను చంపడానికి వెంటపడ్డావని జ్యోత్స్న అబద్ధం ఆడుతుంది. దీప నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే తాత గన్ తీసుకొచ్చానని, కానీ అది లాక్కొని నన్ను చంపుతానని అంటుందని జ్యోత్స్న నాటకం ఆడుతుంది. ఆమె మాటలు నిజమని సుమిత్రతో పాటు మిగిలిన వాళ్లు నమ్ముతారు. పారిజాతం పోలీసులకు ఫోన్ చేస్తుంది. దీప చేసిన పాపాలు పండాయని శివన్నారాయణ అంటాడు.
దశరథ్‌ను షూట్ చేసిన దీప
జ్యోత్స్నను దీప చంపకుండా దశరథ్ ముందుకొచ్చి నిలబడతాడు. గన్ ఇవ్వమని అంటాడు. అయినా దీప గన్ దించదు. పొరపాటున గన్ పేలుతుంది. దశరథ్‌కు బుల్లెట్ తగలడంతో కుప్పకూలిపోతాడు. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్….ఆ సీన్ చూసి షాకవుతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.