

Best Web Hosting Provider In India 2024
AP SSC Results 2025 : ఏపీ టెన్త్ 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎలా చెక్ చేసుకోవాలి…?
AP SSC Exam Result 2025 Updates : ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియలో భాగంగా… ప్రస్తుతం మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతికపరమైన అంశాలను పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ ఏప్రిల్ నెలలోనే ఫలితాలను ప్రకటించనున్నారు.
ఏపీ పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది 6 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్ తేదీ కోసం వేచి చేస్తున్నారు. ఫలితాలను బట్టి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 18 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు సజావుగా జరిగాయి. ఆ వెంటనే ఆలస్యం చేయకుండా అధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి షురూ కాగా… తాజాగానే పూర్తైనట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కేంద్రాలు ఈ ప్రక్రియ కొనసాగింది.
జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా స్పాట్ జరగాలని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాంకేతికపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియను అంతా కూడా ఏప్రిల్ 15వ తేదీలోపు పూర్తి చేస్తారని సమాచారం.
ఫలితాలు ఎప్పుడు…?
వివిధ దఫాల పరిశీలన పూర్తయ్యాకే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని అంశాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత… సర్వం సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫలితాల తేదీని ప్రకటిస్తారు.
గతేడాది మార్చి 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగిశాయి. ఏప్రిల్ 22వ తేదీన టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తైన నేపథ్యంలో… ఈసారి కూడా ఏప్రిల్ నెలాఖారులోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. త్వరలోనే అధికారికంగా తేదీని ప్రకటించనున్నారు. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..?
- ముందుగా ఏపీ SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఏపీ పదో తరగతి ఫలితాలు – 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ వివరాలను ఎంట్రీ చేయాలి. సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఈసారి వాట్సాప్ లో టెన్త్ ఫలితాలు…!
ఈసారి ఏపీలోని టెన్త్ విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
Step 3 : ‘డౌన్‌లోడ్ ఏపీ SSC ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయాలి.
Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.
గతేడాది మాదిరిగానే ఈసారి ఏపీ టెన్త్ ఫలితాలను HT తెలుగు వెబ్ సైట్ లోనూ చెక్ చేసుకోవచ్చు. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే క్షణాల వ్యవధిలోనే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
టాపిక్