




Best Web Hosting Provider In India 2024

Cristiano Ronaldo Net Worth: హాలీవుడ్ లోకి ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో.. అతని విలువ ఎన్ని మిలియన్ డాలర్లంటే? షాకవాల్సిందే!
Cristiano Ronaldo Net Worth: ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఫిల్మ్ స్టూడియోను లాంఛ్ చేశాడు. మూవీస్ పై ప్రేమతో ఈ పని చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో రొనాల్డో నెట్ వర్త్ పై మరోసారి చర్చ జోరందుకుంది. అతని విలువ ఎంతనో చూసేద్దాం.

ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ప్రఖ్యాత దర్శకుడు మాథ్యూ వాన్ తో కలిసి యూఆర్.మార్వ్ (UR•Marv) అనే జాయింట్ ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించాడు. 40 ఏళ్ల రొనాల్డో ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ వార్తను పంచుకున్నాడు. తన కెరీర్ లోని ఈ మార్పును ‘‘ఎక్సైటింగ్ ఛాప్టర్ (ఉత్తేజకరమైన అధ్యాయం)” అని రొనాల్డో చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ లో రొనాల్డో అడుగుపెట్టడంతో అతని నెట్ వర్త్ పై చర్చ జోరందుకుంది.
రికార్డు విలువ
జోనల్ స్పోర్ట్స్ ప్రకారం ఆల్ టైమ్ ఫుట్‌బాల్ లెజెండ్లలో ఒకడైన రొనాల్డో నికర విలువ (నెట్ వర్త్) సుమారు 800 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ ప్రకారం.. ఐదు సార్లు బాలోన్ డి’ఓర్ విజేతగా నిలిచిన రొనాల్డో 2020 లో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీతం సంపాదించిన మొదటి యాక్టివ్ టీమ్-స్పోర్ట్స్ ఆటగాడిగా నిలిచాడు. 2024లో అతను ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఆటగాళ్లలో టాప్ లో నిలిచాడు. అప్పుడు అతని మొత్తం ఆదాయం 260 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
పోర్చుగల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రొనాల్డో ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా తన వ్యాపార వెంచర్లను విస్తరించాడు. “వ్యాపారంలో నేను కొత్త వెంచర్లను చూస్తున్నందున ఇది నాకు ఉత్తేజకరమైన అధ్యాయం” అని రొనాల్డో యూఆర్.మార్వ్ గురించి చెప్పాడు. ఈ స్టూడియో ద్వారా టెక్నికల్ గా, ఇన్నోవేషన్ గా ముందుకు సాగుతామని ఎక్స్ లో రొనాల్డో ప్రకటించాడు. హాలీవుడ్ లో తన ఎంట్రీని కన్ఫామ్ చేశాడు.
ఇద్దరు కలిసి
ఫుట్‌బాల్ స్టార్ అయిన రొనాల్డోకు మూవీస్ అంటే ఇష్టం. ప్రముఖ డైరెక్టర్ మాథ్యూ వాన్ కు స్పోర్ట్స్ అంటే లవ్. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఫిల్మ్ స్టూడియో లాంఛ్ చేయడం స్పెషల్ గా మారింది.
‘‘నేనెప్పుడూ రాయని కథలను రొనాల్డో గ్రౌండ్ లో సృష్టించాడు. అతనితో కలిసి స్ఫూర్తిదాయకమైన సినిమాలను తీసేందుకు ఎదురు చూస్తున్నా. అతను రియల్ లైఫ్ సూపర్ హీరో’’ అని ఆ పోస్ట్ లో డైరెక్టర్ మాథ్యూ పేర్కొన్నారు.
ఇప్పటికే యూఆర్ మార్వ్ స్టూడియో తరపున రొనాల్డో, మాథ్యూ రెండు యాక్షన్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. మరో యాక్షన్ థ్రిల్లర్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ సినిమాను రిలీజ్ కోసం రెడీ చేస్తున్నారు.
సంబంధిత కథనం