పెదవులు పగలడానికి, నల్లగా మారడానికి కారణాలేంటి? పరిష్కారం కోసం ఏం చేయాలి?

Best Web Hosting Provider In India 2024

పెదవులు పగలడానికి, నల్లగా మారడానికి కారణాలేంటి? పరిష్కారం కోసం ఏం చేయాలి?

Ramya Sri Marka HT Telugu
Published Apr 11, 2025 08:30 AM IST

పెదవులు తరచూ పగిలిపోతున్నాయా, నల్లగా అందవిహీనంగా కనిపిస్తున్నాయా? పరిష్కారం కోసం రకరకాల లిప్ బామ్‌లు, అందం పెంచే ఉత్పత్తులు వాడకండి. ముందుగా పెదవులకు సంబంధించిన సమస్యలకు కారణాలు తెలుసుకోండి. సమస్యను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అదెలాగో ఇక్కడ తెలుసుకోండి.

పగిలిపోయిన పెదవులు
పగిలిపోయిన పెదవులు (shutterstock)

చేతులు, కాళ్ళు, ముఖం చూసి ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు. కానీ మీ పెదవులు కూడా మీ ఆరోగ్యం గురించి చెబుతాయని మీకు తెలుసా? పెదవులకు సంబంధించిన సమస్యలను అంటే పెదవులు పగలడం, నల్లగా మారడం వంటివి మీరు వాతావరణం, అందానికి అనుసంధానించే అవకాశం ఉంది.కానీ వాస్తవానికి అవి శరీరంలో ముఖ్యమైన పోషకాల లోపం వల్ల వస్తాయి. పగిలిపోయిన తరచూ పగలడం, నల్లగా అందవిహీనంగా కనిపించడం కేవలం వాతావరణం వల్ల కాదని తెలుసుకోండి. అలాగే ఇందుకు పరిష్కారంగా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన లిప్‌బామ్‌లు, రకరకాల క్రీములకు వాడకండి.

ఏ సమస్యకైనా సహజమైన, శాశ్వతమైన పరిష్కారం లభించాంటే దానికి కారణం తెలయాలి.పెదవుల విషయంలోనూ అంతే. కొందరికి పెదవులు తరచూ పగులుతుంటాయి, ఇంకొందరికి లిప్స్ కలర్ మారి చూడటానికి బాగొదు. మరికొందరి విషయంలో పెదవుల అంచుల్లో పగుళ్లు, పుండ్లు వస్తాయి. ఇంకా పెదవులు పొడిగా, నర్జీవంగా మారతాయి. ఈ సమస్యలన్నింటికీ కారణం వాతావరణమే అనుకుంటే మీరు పొరబడ్డట్టే. పెదవులకు సంబంధించిన పలు రకాల సమస్యలకు కారణాలేంటి, పరిష్కారం కోసం ఏం చేయాలి తెలుసుకుందాం రండి.

1. పెదవులు బాగా పగిలిపోవడం

శీతాకాలం, వేసవి, ఏ సీజన్‌లోనైనా పెదవులు పగిలిపోతాయి. కొందరికి రక్తాలు కారుతుంటాయి కూడా. ఇలాంటప్పుడు రకరకాల క్రీములు, లిప్‌బామ్‌లు వాడి పొరపాటు చేయండి. బదులుగా శరీరంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని పూరించండి. పెదవులు పగిలిపోవడానికి ఇదే ప్రధాన కారణం. రోజూ అక్రోట్లు, పండ్లు, నట్స్, విత్తనాలతో పాటు చేపలు వంటి వాటిని తప్పకుండా తినండి. మితంగా తీసుకోవాలని గుర్తుంచుకోండి.

2. పెదవుల అంచులలో పగుళ్లు

చాలా మంది పెదవుల అంచులలో పగుళ్లు ఏర్పడతాయి. తినేటప్పుడు, నోరు తెరిచి మాట్లాడేటప్పుుడు కూడా ఇవి ఇబ్బంది పెడుతుంటాయి. చాలా సార్లు నొప్పితో పాటు రక్తం కూడా వస్తుంది. ఈ సమస్యకు కారణంగా విటమిన్ B2 లోపం. దీని నుండి బయటపడటానికి విటమిన్ B2 (రిబోఫ్లేవిన్) అధికంగా ఉండే ఆహారాలు అంటూ మాంసం, పాలు, గుడ్లు, బలవర్థకమైన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులు తినడం మంచిది.

3. పెదవుల రంగు మసకబారడం

మీ పెదవుల రంగు ముందు కంటే మసకబారడానికి చాలా కారణాలున్నాయి. వీటిలో కొన్ని ప్రధానమైనవి సూర్యరశ్మి, నిర్జలీకరణం, జన్యు సిద్ధత, అలాగే సరైన పెదవి సంరక్షణ లేకపోవడం. కొన్ని సందర్భాల్లో, ఇది రక్తహీనత, ఇనుము లోపం వల్ల కూడా కావచ్చు. ఇందుకోసం మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు అంటే మాంసం, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, ఆకుకూరలు, నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు ఉన్నాయి. మాంసం, చేపలు వంటివి తతరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.

4. పెదవులు నల్లగా మారడం

పెదవుల రంగు నల్లగా మారుతుంటే ఒకటి మీరు ధూమపానం చేస్తున్నారని అర్థం లేదంటి. లేదు చేయకపోయిన పెదవులు ఎందుకు నల్లగా మారుతున్నాయంటే శరీరంలో మెలనిన్ పెరుగుతుందని సంకేతం. శరీరంలో మెలనిన్ పెరిగితే, పెదవుల బయటి భాగం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. ఈ రకమైన నల్లదనాన్ని నివారించడానికి, రోజూ ఒక ఆవకాయ తినండి. అలాగే సూర్యుడి హాని కరమైన కిరణాల నుంచి చర్మాన్ని కాపాడడం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చేయండి.

5. పెదవులు పొడిబారడం

పెదవులు పొడిబారడానికి పర్యావరణ కారకాలు, ఆహారం, ఆరోగ్య పరిస్థితులు వంటి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. పొడి గాలి, చల్లని వాతావరణం, గాలి బహిర్గతం, సూర్యరశ్మి వంటి పర్యావరణ కారకాలు వంటివి కూడా పెదవులు పొడిబారడానికి దోహదం చేస్తాయి. పెదాలను కొరుకుకోవడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వంటి అలవాట్లు కూడా పెదవులు పొడిబారడానికి కారణమవుతాయి. నిర్జలీకరణం, విటమిన్ లోపాలు కూడా పెదవులు పొడిబారడానికి దారితీస్తాయి. కాబట్టి ఎక్కువ నీరు తాగడం, సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించడం వంటి జాగ్రత్తలు తీసుకోండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024