Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Today Episode: మత్తులో తూగిన మనోజ్- బాలును కొట్టిన నానమ్మ- బెడిసి కొట్టిన బాలు కల్లు ప్లాన్!
Gunde Ninda Gudi Gantalu Serial April 11th Episode: గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ 11 ఎపిసోడ్‌లో మనోజ్‌కు బలవంతంగా కల్లు తాగిస్తాడు మాణిక్యం. దాంతో మనోజ్ మత్తులో తూలుతూ కిందపడిపోతాడు. ఇంటికి తీసుకెళ్లాక మాణిక్యం అబద్ధం చెప్పడంతో బాలును కొడుతుంది నానమ్మ సుశీల. అలా బాలు కల్లు ప్లాన్ బెడిసి కొడుతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ముగ్గురు కోడళ్లను బాగా చూసుకోమ్మని ప్రభావతికి క్లాస్ పీకుతుంది సుశీల. నాకు అమ్మ ఉంది కాబట్టి మీరు అత్తలాగే ఉండండి అని ప్రభావతికి శ్రుతి పంచ్ వేస్తుంది. మరోవైపు అన్నదమ్ములంతా చెరుకు తింటుంటారు.
పంట్లో శక్తి లేదు
చెరుకు కొరకలేకపోతున్నాను. జ్యూస్ చేసి తీసుకొస్తావా అని రవిని అడిగితే.. బాలు ఇంత వయసు వచ్చింది. ఆ మాత్రం కొరకలేవా. ఒంట్లో శక్తి లేదు పంట్లో శక్తి లేదు. ఏ మనిషివిరా అని బాలు అంటాడు. జ్యూస్ ఎప్పుడు తాగేదే కదా. ఇలా తిను అని రవి అంటాడు. ఇంతలో మాణిక్యం వస్తాడు. ఇదిగే మేకరావు గారు వచ్చారు. కూర్చోండి మేకగారు అని బాలు అంటాడు. మీ మేనకోడలి మొగుడు గారు చెరుకు కొరకలేకపోతున్నారు అని బాలు అంటే.. ఇదే కొరకలేకపోతే రేపు పూలుగు ఎముకని ఎలా కొరుకుతారు, నములుతారు అని మాణిక్యం అంటాడు.
ఇంతలో వచ్చిన రోహిణి వీడేదో కొంప ముంచేలా ఉన్నాడు అని వెళ్లి మాణిక్యంకు పడుకోమంటుంది. ఆ శవంలా పడుకోవడం నావల్ల కాదమ్మా అని మాణిక్యం అంటాడు. మధ్యలో మేకలే కాదు శవాలు కూడా దూరిపోతున్నాయి. అదేంటో అని మాణిక్యంను అంటాడు బాలు. ఆ మందు విషయం కనుక్కోరా అని రాజేష్ బాలుతో అంటాడు. ఏంట్రా గుసగుసలు ఆడుతున్నారు. తాటి తోపుళ్లకు వెళ్లారో తాట తీస్తా అని సత్యం వార్నింగ్ ఇస్తాడు. మేమెందుకు వెళ్తాం. వెళ్లం అని రాజేష్ అంటాడు.
ఊరు చూసొద్దామంటున్నాడు అని బాలు అంటే.. నేను కూడా వస్తాను. నేను అసలే చూడలేదు అని మాణిక్యం అంటాడు. ఇక్కడ చాలా ఉంటాయి. తోటలు, మేకలు అని మనోజ్ అంటే.. మేకలా.. ఇక్కడ మేకల రేటు ఎంతో కనుక్కోవాలి అని మాణిక్యం అంటాడు. పోయి పోయి బాలుతో వెళ్తానంటున్నాడే. మాణిక్యం గుట్టు బయట పెట్టేస్తాడు అని మనసులో అనుకుంటుంది రోహిణి. వాళ్లు వెళ్తారులే. నువ్ ఆగమని రోహిణి అంటుంది.
రండి మేకేశ్వరా
వస్తే కుక్కలు పిక్కలు పీక్కుతుంటాయని, అవి వెంటపడతాయని వద్దంటుంది. మేమున్నాముగా ఏం అనవులే. మీరు రండి మేకేశ్వరా అని బాలు అంటాడు. అక్కడ కెమెరాలు ఉంటాయా అని మాణిక్యం అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఊరిలోకి వెళ్తున్నారుగా. ఫొటోలు తీయడానికా అని రోహిణి కవర్ చేస్తుంది. వెళ్దామా అని రాజేష్ అంటే.. మనోజ్ నువ్ కూడా వెళ్లమని రోహిణి అంటుంది. ఇంతలో మీనా వచ్చి బాలును పక్కకు తీసుకెళ్లి ఏంటీ మీరు ఆ మలేషియా అతనివెంటపడుతున్నారు అని అడుగుతుంది.
నేను ఓ మహత్కార్యం కోసం తీసుకెళ్తున్నాను. వచ్చాక తెలుస్తుందిలే అని బాలు వెళ్తాడు. రాజేష్, బాలు, మనోజ్, మాణిక్యం ఊరిలోకి వెళ్తారు. బాలుపై మనోజ్ సెటైర్ వేస్తే అంతా నవ్వుతారు. మలేషియాలో ఎలా ఉంటుంది అని మనోజ్ అడిగితే.. తన ఊరిలో ఉండే పరిస్థితులు చెబుతాడు మాణిక్యం. వర్షాలు పడితే ఇళ్లల్లోకి నీళ్లు వస్తాయి. మా ఇల్లు చెరువు పక్కనే ఉంది అందుకే. దుబాయిలో కూడా వరదలు వచ్చాయిగా అని మాణిక్యం కవర్ చేస్తాడు.
మీరు మలేషియా నుంచి వస్తున్నారని చెప్పగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాడు. మలేషియాలో మందు బాగుంటుందట కదా. దానికోసం వచ్చాడు అని బాలు అడుగుతాడు. ఐదు ఫుల్ బాటిల్స్ తీసుకొచ్చాను కానీ, లెక్కకు మించి తెచ్చానని ఏయిర్‌పోర్ట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు తీసుకున్నారని మాణిక్యం అంటాడు. దాంతో బాలు, రాజేష్ నిరాశపడతారు. ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లకు మందుతో ఏంటీ పని అని మనోజ్ డౌట్ పడితే.. వాళ్లు కాదు కస్టమ్స్ వాళ్లు అని మాణిక్యం అంటాడు.
కల్లే బాగుంటుంది
అయినా ఇక్కడ లోకల్ మందు ఉంటుందిగా. నాకు ఫారెన్ బ్రాండ్స్ తాగి తాగి బోర్ కొట్టింది. వాటికన్నా కల్లే బాగుంటుంది. నువ్ ఎంత తెప్పించినా నాకు ఓకే. తగ్గేదేలే అని మాణిక్యం అంటాడు. అలాంటివన్ని నాన్నకు ఇష్టముండదు అని మనోజ్ అంటాడు. తెలియనిస్తామా. రోహిణికి నేను చెప్పుకుంటానులే అని మాణిక్యం అంటాడు. తర్వాత బాలు ఫ్రెండ్స్ అందరితో మాణిక్యం కూర్చుంటాడు. మనోజ్ వద్దని అడ్డుపడితే నాకెంత మర్యాద చేస్తున్నారో చూడు అని మాణిక్యం అంటాడు.
ముంత కల్లును మాణిక్యం ఒకేసారి తాగేయడంతో బాలు ఫ్రెండ్స్ షాక్ అవుతారు. మనకన్న ఊర మాస్‌లా ఉన్నాడేంట్రా. ఫారెన్ సరుకులా కాదు లోకల్ సరుకులా ఉన్నాడు. తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా ఉన్నాడురా అని బాలు ఫ్రెండ్స్ అంటారు. నాకూడా అదే డౌట్ ఉంది. అందుకే ఇది. కల్లు లోపలికి వెళ్తే కదా నిజం బయటకు వచ్చేది అని బాలు అంటాడు. ఎత్తిన ముంతను దించకుండా తాగడం మా వంశపార్యంపరంగా వస్తున్న ఆచారం అని మాణిక్యం అంటాడు.
కల్లులోకి మంచింగ్‌కి పచ్చడి నాకుతాడు మాణిక్యం. మనోజ్ వద్దని చెబితే మాణిక్యం వినడు. మేము ఒక్క ముంతలేపేలోపే రెండు ఎత్తారు. ఇంకోదానికి రెడీగా ఉన్నారు. మలేషియా బాబాయినా మజాకా అని బాలు అంటాడు. మనోజ్‌ను కూడా తాగమని మాణిక్యం అంటాడు. మనోజ్ వద్దంటాడు. కానీ, మనోజ్‌కు బలవంతంగా మాణిక్యం తాగిపిస్తాడు. ఏంటీ బాబాయ్ ఇలా చేశారు. వాడికి అలవాటు లేదన్నాడుగా అని బాలు అంటాడు.
మటన్ కొట్టేవాడిలా
గొంతులో కారంగా ఉంది. తల తిరుగుతుందని మనోజ్ అంటే.. ఇంకో ముంత తాగితే సెట్ అవుతుందని తాగిస్తాడు మాణిక్యం. తర్వాత మనోజ్ నాలుకకు పచ్చడి రాస్తాడు. అది చూసి మనిషేంట్రా ఇంత వయెలెంట్‌గా ఉన్నాడు అని రాజేష్ అంటాడు. వీడు పక్కా లోకలే అని బాలు అంటాడు. నాకు అంత అదోలా ఉందని, ఇంటికి వెళ్తానని తూలుతు వెళ్తాడు మనోజ్. ఏం కాదు. మటన్ కొట్టేటప్పుడు ముందు మాకు కూడా చేయి వణుకుతుంది. తర్వాత అలవాటు అవుతుందని మాణిక్యం అంటాడు.
ఏంట్రా ఈయన మటన్ కొట్టేవాడిలా మాట్లాడుతున్నాడు అని రాజేష్ అంటాడు. మలేషియాలో ఎక్కడ ఉంటావ్ అడ్రస్ చెప్పమని రాజేష్ అడుగుతాడు. మలేషియా అంతా నాదే. చాలా బిజినెస్‌లు ఉన్నాయి. అసలు నేను ఎవరో తెలుసా. నా ఏరియా ఎక్కడో తెలుసా. అసలు మా ఊరు ఎక్కడో తెలుసా. నేను ఎంత ఫేమసో తెలుసా అని కిందపడిపోతాడు మాణిక్యం. మొత్తం చెప్పమని బాలు అడుగుతాడు. మొత్తం కక్కిద్దామని చూస్తే ఇలా చేశాడేంటీ అని బాలు అంటాడు.
మరోవైపు మనోజ్ తూలుకుంటూ వెళ్తాడు. ఓ చోట కిందపడిపోతాడు మనోజ్. మరోవైపు బాగా తాగిన మాణిక్యంను పట్టుకుని బాలు వాళ్లు వస్తారు. మత్తులో కూడా నిజం చెప్పకుండా అబద్ధాలే చెబుతాడు మాణిక్యం. వీడు నిజం చెప్పడురా అని బాలు అంటే.. రెస్పెక్ట్. నేను మత్తులో ఉన్న అన్ని వినపడతాయ్ అని మాణిక్యం అంటాడు. తర్వాత కింద పడి ఉన్న మనోజ్‌ను చూసి లేపుతారు. రెండు ముంతలకే ఇలా అయిపోయాడు అని రాజేష్ అంటాడు.
బాలును కొట్టిన సుశీల
బాలును ఇంతకీ నువ్ ఎవరు అని అడుగుతాడు. నువ్ చేసిన పనికి నువ్ అడుగుతున్నాడని మాణిక్యంతో బాలు అంటాడు. ఇంతకీ ఎవరితను అని మాణిక్యం అంటాడు. మీ పాపగారి మొగుడు అని బాలు చెబుతాడు. మనోజ్‌ను తీసుకెళ్దామని చూస్తే ఇక్కడే బాగుందని అక్కడే పడుకుంటాడు. ఇంటికెళ్తే అంతా నన్ను అంటారు. వీడికి ఇలా చేసింది నువ్వే అని చెప్పాలి అని బాలు అంటాడు. తర్వాత మనోజ్‌ను లేపుతారు.
మనోజ్‌ను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతారు. మనోజ్ తాగొచ్చావా అని రోహిణి అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పండి మేకేశ్వర్ రావు అని బాలు అంటాడు. మనోజ్ తాగను అన్న బాలు బలవంతంగా తాగించాడు అని మాణిక్యం అబద్ధం చెప్పి అందరిముందు బుక్ చేస్తాడు. దాంతో ప్రభావతి ఫైర్ అవుతుంది. నీలాగే పచ్చితాగుబోతును చేయాలనుకుంటున్నావా అని రోహిణి అంటుంది. ఇంతలో సుశీల వచ్చి బాలును కొడుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగిసిపోతుంది.