




Best Web Hosting Provider In India 2024

ఉపవాసంతో డయాబెటిస్ తగ్గుతుందా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ శరీరంపై ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా?
ఉపవాసాలలో రీసెంట్‌గా ట్రెండింగ్‌లో ఉంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇందులో పర్టిక్యులర్ సమయానికి గ్యాప్‌లు ఇస్తూ తినడం వల్ల డయాబెటిస్ అనేది కంట్రోల్‌లో ఉంటుందట. అయితే ఈ బెనిఫిట్స్ పొందడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌ను పలు రకాలుగా ట్రై చేయొచ్చు. అదెలా అంటే..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రెగ్యూలర్‌గా ఆహారం తీసుకునే సమయంలో కాకుండా కొద్దిసేపు విరామం తీసుకుని ఆ తర్వాత తినడం లేదా చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినడం. రీసెర్చర్ల నమ్మకం ప్రకారం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది శరీరం శక్తి కోసం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును వాడుకునేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫాస్టింగ్ అనేది పేగుల ఆరోగ్యంపై ఇన్సులిన్ హార్మోన్‌పై, గ్రోత్ హార్మన్‌పై చాలా పాజిటివ్ గా పనిచేస్తుంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎన్ని రకాలుంటాయి. అదెలా ట్రై చేయాలో తెలుసుకుందామా..
ట్రైమ్ రిస్ట్రిక్ట్‌డ్ ఫీడింగ్:
దీనిని బట్టి చెప్పాలంటే ప్రతి రోజూ ఒకే సమయంలో తినడం. చాలా మంది దీని కోసం 16:8 పద్ధతి వాడుతుంటారు. ఇందులో వ్యక్తి 16 గంటల పాటు తినకుండా ఉండి 8 గంటల పాటు మాత్రమే ఆహారం తీసుకుంటారు.
ప్రత్యామ్నాయ ఉపవాసం:
ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరో రోజు ఆహారం తీసుకుంటూ ఉండటం దీని కిందకు వస్తుంది. ఒక రోజు మొత్తం ఆహారం తీసుకోకపోవడం లేదా 500 కంటే తక్కువ కేలరీలు ఆహారంగా తీసుకోవడం వంటిది పాటించాలి. మరుసటి రోజు ఎంత తినగలిగితే అంత తినవచ్చు.
పీరియాడిక్ పాస్టింగ్:
- ఈ ఫాస్టింగ్ టెక్నిక్‌లో 24 గంటల పాటు అస్సలు తినకుండా లేదా ఏదైనా కొద్దిపాటి ఆహారం తీసుకుంటారు. ఉదాహరణకు 5:2 డైట్, ఈట్ స్టాప్ ఈట్.
- 5:2 డైట్‌లో ఓ వ్యక్తి వారానికి 5 రోజుల పాటు తిని మిగతా రెండు రోజులు కేవలం 500 కేలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకుని ఉపవాసం ఉంటాడు.
- ఈట్ స్టాప్ ఈట్ టెక్నిక్‌లో 24గంటల పాటు డ్రింక్స్ లేదా ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయాలి. మిగిలిన రోజుల్లో పోషకాహారం, బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ ఉండాలి.
ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిపై ఎలా పనిచేస్తుందంటే..
• బరువు తగ్గడానికి
• ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడానికి, ఇన్సులిన్ స్థాయిలు తగ్గించుకోవడానికి
• రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరపరచుకోవడానికి
• హిమొగ్లోబిన్ A1 స్థాయిలు తగ్గించుకోవడానికి
టైప్ 2 డయాబెటిస్ ఉన్న చాలా మందిలో మెటబాలిక్ సిండ్రోమ్, హైబీపీ, హైపర్ లిపిడెమియా కూడా ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈ మెటబాలిక్ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ మీద ఫాస్టింగ్ ఎలా పనిచేస్తుంది?
కొందరిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోగలిగారు. ఇన్సులిన్ థెరపీ చేయించుకోవడం వల్ల బరువు తగ్గడానికి, నడుం దగ్గర కొవ్వు కరిగించుకోవడానికి బాగా ఉపయోగపడింది. హిమోగ్లోబిన్ A1c స్థాయి తగ్గడానికి తోడ్పడింది. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ తగ్గేందుకు అవకాశం ఉంది. డయాబెటిస్ రీమిషన్ క్లినికల్ ట్రయల్ (DiRECT) జరిపిన అధ్యయనంలో పాల్గొన్నవారిని రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, ఫార్మాకాలాజికల్ థెరపీ. అందులో ఎవరైతే బరువు తగ్గగలిగారో వారిలో డయాబెటిస్ రీమిషన్ అనేది జరిగింది.
డయాబెటిస్ ఉన్న వాళ్లు ఫాస్టింగ్‌ను సేఫ్‌గా ఎలా పాటించాలి?
- డయాబెటిస్ లేదా షుగర్ ఉన్న వాళ్లు ఉపవాసం పాటించాలంటే, ముందుగా వైద్యుడ్ని సంప్రదించాలి. వారు సూచించినట్లుగా రక్తంలో ఉన్న షుగర్ రిస్క్ పెరగకుండా ఉండేలా మెడికేషన్స్ తీసుకోవాలి.
- డయాబెటిస్ ఉన్న వారు ఫాస్టింగ్ ఉంటే ప్రతి 2 లేదా 4గంటలకోసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉపవాస సమయంలో డీహైడ్రేషన్, హైపోటెన్షన్ కలగకుండా ఉండేందుకు ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఉపవాస సమయానికి తగ్గట్టుగా డయాబెటిక్ మెడికేషన్స్, డైయూరిటిక్స్, యాంటీహైపర్ టెన్సివ్స్ డోసేజ్ తగ్గించుకోవడం మంచిది.
- ఉపవాసం పాటించని రోజుల్లో బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. ప్రోసెస్డ్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్, షుగరీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండటమే బెటర్. ఇలా చేయడం మీ ఫాస్టింగ్ బెనిఫిట్స్ ను ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి.
సంబంధిత కథనం