




Best Web Hosting Provider In India 2024

Vishnupriya OTT: ఓటీటీలోకి ప్రియా ప్రకాష్ వారియర్ కన్నడ రొమాంటిక్ మూవీ -ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్ -నైంటీస్ లవ్‌స్టోరీ
OTT: ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించిన కన్నడ రొమాంటిక్ మూవీ విష్ణుప్రియ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. శ్రేయాస్ మంజు హీరోగా నటించిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.

OTT: వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ విష్ణుప్రియ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన దాదాపు యాభై రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.
ఐఎమ్‌డీబీలో…
రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన విష్ణుప్రియ మూవీలో శ్రేయాస్ మంజు హీరోగా నటించాడు. సీనియర్ డైరెక్టర్ వీకే ప్రకాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది. విష్ణుప్రియ మూవీతో ప్రియా ప్రకాష్ వారియర్ కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
1990 లవ్‌స్టోరీ…
1990 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ లవ్‌స్టోరీగా విష్ణుప్రియ మూవీని దర్శకుడు వీకే ప్రకాష్ తెరకెక్కించాడు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా లేని కాలంలో ఉత్తరాల ద్వారా ప్రేమికులు తమ భావాలను ఎలా పంచుకునేవారు? అప్పటి స్వచ్ఛమైన ప్రేమలు ఎలా ఉండేవన్నది ఈ మూవీలో నాచురల్‌గా చూపించారు.
విష్ణుప్రియ కథ ఇదే…
బాలు, విష్ణు చిన్ననాటి స్నేహితులు. ప్రియ అనే అమ్మాయిని బాలు ఇష్టపడతాడు. తన ప్రేమను వ్యక్తం చేసే ధైర్యం లేక విష్ణు సహాయం అడుగుతాడు. బాలు ప్రేమను రిజెక్ట్ చేసిన ప్రియ…విష్ణుకు ఐ లవ్ యూ చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? విష్ణు, ప్రియ ప్రేమకథకు బాలు ఎలా విలన్‌గా మారాడు? ప్రాణంగా ప్రేమించిన ప్రియకు విష్ణు ఎలా దూరమయ్యాడు? మళ్లీ వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
సింగర్‌గా…
విష్ణుప్రియ మూవీకి గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా కోసం సింగర్‌గా కూడా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. సుమ్మనే అనే పాటను ఆలపించింది. మలయాళం మూవీ ఒరు అదార్ లవ్‌తో ఓవర్‌నైట్‌లోనే ఫేమస్‌గా మారింది ప్రియా ప్రకాష్ వారియర్. సినిమా పరాజయం పాలైన ప్రియా ప్రకాష్ పేరు మాత్రం మారుమోగింది. తెలుగులో చెక్, ఇష్క్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. వవన్ కళ్యాణ్ బ్రో మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది.
గుడ్ బ్యాడ్ అగ్లీలో…
గత కొన్నాళ్లుగా తమిళ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది ప్రియా ప్రకాష్ వారియర్. ధనుష్ దర్శకత్వంలో రూపొందిన జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ ఓ హీరోయిన్‌గా కనిపించింది. గురువారం రిలీజైన అజిత్ గుడ్‌బ్యాడ్ అగ్లీలో నిత్య అనే క్యారెక్టర్‌లో కనిపించింది.
సంబంధిత కథనం