

Best Web Hosting Provider In India 2024
AP Municipal Property Tax : ఏపీలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు అలర్ట్ – రాయితీ గడువు పొడిగింపు, ఈ ఛాన్స్ మిస్ కాకండి..!
AP Municipal Property Tax Updates : ఆస్తి పన్నుదారులకు ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. బకాయిలపై వడ్డీ రాయితీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. బకాయిలు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులు సూచించారు.
ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవలనే వడ్డీ రాయితీని స్కీమ్ ను ప్రకటించింది. ఈ గడువు మార్చి 31వ తేదీతో పూర్తయింది. అయితే చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంతో…మరోసారి గడువును పొడిగించింది.
ఏప్రిల్ 30 వరకు గడువు…
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 వడ్డీ రాయితీని మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.గడువు పెంచాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
50 శాతం రాయితీ…
2024-25 సంవత్సరానికి గానూ పట్టణ ప్రజలు చెల్లించాల్సిన పన్ను బకాయిలపై ఏపీ సర్కార్ 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించింది. ప్రస్తుతం గడువు పొడిగించిన నేపథ్యంలో… ఈలోపు బకాయిలను చెల్లిస్తే 50శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ సదుపాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మొత్తం వడ్డీతో సహా పన్ను కట్టిన వారందరికీ వర్తిస్తుంది. ఇప్పటికే వడ్డీ చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ రానున్న ఆర్థిక సంవత్సర పన్నులకు జమ చేస్తారు.
ఆస్తి పన్ను వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 13 క్యాష్ కౌంటర్లలతో పాటు మూడు జోనల్ కార్యాలయాలలో ఉన్న ఆరు క్యాష్ కౌంటర్లను అందుబాటులో ఉంచారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు డబ్బులు చెల్లించవచ్చు.
తెలంగాణలోనూ రాయితీ అవకాశం:
మరోవైపు తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను బకాయిల వడ్డీని 90శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్)ను అమల్లోకి తెచ్చింది.
2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలన్నీటిని ఒకేసారి చెల్లించిన వారికి 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఆస్తి పన్ను బకాయిలను వడ్డీతో సహా చెల్లించిన ఇంటి యజమానులకు వచ్చే ఏడాది ఆస్తిపన్నుల్లో 90 శాతం వడ్డీ మాఫీని వర్తింపజేస్తూ మిగిలిన పన్నులను వసూలు చేసింది. ఈ గడువు మార్చి 31వ తేదీతో పూర్తయింది. ఓటీఎస్ అవకాశాన్ని భారీ స్థాయిలో ప్రజలు ఉపయోగించుకోవటంతో… ప్రభుత్వ ఖాజానాకు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
టాపిక్