



Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 11th Episode: ఆఫీస్‌కు బాస్‌లా రాజ్- అపర్ణకు నిజం చెప్పేసిన కావ్య- రేపే రాజ్‌ను చూపిస్తానని కళావతి మాట!
Brahmamudi Serial April 11th Episode: బ్రహ్మముడి ఏప్రిల్ 11 ఎపిసోడ్‌లో స్వరాజ్ ఆఫీస్‌కు రాజ్ డైరెక్ట్ వెళ్లిపోతాడు. అది చూసి బాస్‌లా వచ్చేస్తున్నారేంటీ అని కావ్య భయపడిపోతుంది. మరోవైపు జీపీఎస్ ట్రాకర్‌లో రాజ్ కారు చూసిన యామిని కూడా భయపడుతుంది. అపర్ణకు రాజ్ గతం మర్చిపోయాడన్న నిజం చెప్పేస్తుంది కావ్య.

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హాల్లో ఉన్న ఇందిరాదేవికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లొస్తానని చెబుతుంది. వెంటే వచ్చిన కల్యాణ్‌ను చూసి కల్యాణ్‌ను కూడా తీసుకెళ్తున్నావా ఏంటీ అని ఇందిరాదేవి అడుగుతుంది. మొగుడిని చూడకుండా ఉండలేకపోతుందేమో అని స్వప్న అంటుంది.
తప్పుడు కేసులో కల్యాణ్
నువ్ ఇలాంటి ఐడియాలు ఇవ్వకు స్వప్న. ఒకవేళ తనకు నిజంగానే అప్పుకి అలాంటి ఫీలింగ్ కలిగితే నన్ను చూడటం కోసం ఏ తప్పుడు కేసులో అయినా ఇరికించి జైలులో పెట్టిన పెడుతుంది అని కల్యాణ్ అంటాడు. మరెక్కడికి వెళ్తున్నారు అని స్వప్న అడిగితే.. కల్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కలవడానికి వెళ్తున్నాడు. దారిలోనే కదా డ్రాప్ చేద్దామని తీసుకెళ్తున్నా అని అప్పు అంటుంది. మిమ్మల్ని చూస్తే జెలసీగా ఉందే. నా మొగుడు ఉన్నాడు తినడం పడుకోవడం తప్పా అని స్వప్న అంటాడు.
వీళ్లకు సపోర్ట్ చేసినట్లు నా కొడుకు సపోర్ట్ చేసి ఉంటే మహారాజు అయ్యేవాడు అని రుద్రాణి అంటుంది. రెండు రోజులు ఆఫీస్ అప్పజెబితే ఏం చేశాడో తెలుసుగా అని స్వప్న అంటుంది. ఇలా అత్తాకోడళ్లు ఇద్దరు గొడవ పడుతుంటే ఇందిరాదేవి ఆపమని అడ్డుపడుతుంది. అప్పు, కల్యాణ్‌ను వెళ్లమంటుంది ఇందిరాదేవి. ఇంతలో కావ్య వచ్చి తాతయ్యకు ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఎప్పుడు వేయాలో క్లియర్‌గా రాశాను అది ఫాలో అవ్వండి అంటుంది కావ్య.
ఇన్నాళ్లుగా మా బావను నేను చూసుకుంటున్నాను. నాకే చెబుతున్నావా అని ఇందిరాదేవి అంటే.. అవునా.. మీరు బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయారు అని చెబుతుంది కావ్య. ఏంటీ నా మీద సెటైర్ వేస్తున్నావా అని ఇందిరాదేవి అంటే అయ్యో చిన్నపిల్లని. మీ మీద సెటైర్ వేస్తానా చెప్పండి. తాతయ్య గారి ధ్యాసలో పడి మీ హెల్త్ పట్టించుకోవట్లేదని చెబుతున్నా అని కావ్య అంటుంది. ఈసారి ఏ రెస్టారెంట్‌కు వెళ్తున్నారో అమ్మగారు అని రుద్రాణి వెటకారంగా అంటుంది.
వీడియోలు కూడా తీసుకోవచ్చు
నేరుగా ఆఫీస్‌కే వెళ్తున్నాను. కష్టపడి వెంటపడాల్సిన అవసరం లేదు. కారులోనే నాతోపాటే రావొచ్చు. కావాలంటే వీడియోలు కూడా తీసుకోవచ్చు అని పంచ్ ఇచ్చి కావ్య వెళ్లిపోతుంది. దాంతో రుద్రాణిపై కావ్య బంపర్ ఆఫర్ ఇచ్చిందని కౌంటర్స్ వేస్తుంది స్వప్న. మా కావ్యను పిచ్చిదాన్ని అని నిరూపించే గ్యాప్‌లో మీకు పిచ్చిపట్టేలా ఉందని అంటుంది స్వప్న. మరోవైపు కావ్య గురించి ఆలోచించినా రాజ్ తను ఎవరు అనేది తనతోనే సమాధానం చెప్పిస్తాను అనుకుంటాడు.
రాజ్ వెళ్తుంటే.. యామిని అడ్డుపడి టిఫిన్ చేద్దామని అంటుంది. నాకు ఆకలి లేదని, అర్జంట్ వర్క్ ఉందని రాజ్ అంటాడు. కావాలంటే యామినిని కూడా తీసుకెళ్లు అని వైధేహీ అంటుంది. మమ్మీ మొన్న బావ ఏమన్నాడు. ప్రైవేసీ కావాలన్నాడుగా. ప్రతిదానికి మనం డిస్టర్బ్ చేయకూడదు అని రాజ్‌కు సపోర్ట్ చేసినట్లుగా డ్రామా చేస్తుంది యామిని. దాంతో అర్థంకాక తల్లిదండ్రులు షాక్ అవుతారు. నువ్ హ్యాపీగా వెళ్లు, ఎంతసైపు అయినా ఉండు. కానీ, నీకు అక్కడ ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చిన ఈ చిన్నిగుండె తట్టుకోలేదు అని యామిని అంటుంది.
దాంతో థ్యాంక్స్ అని రాజ్ వెళ్లిపోతాడు. ఇంతసేపు రాజ్‌తో మాట్లాడింది మన యామినేనా అని వైధేహి డౌట్ పడుతుంది. ఒక్కరోజులో ఇంత మార్పా అని అంటుంది. నువ్ తనతో ప్రేమగా మాట్లాడమని చెప్పావ్‌గా. అందుకే కారు కీస్ కూడా ఇచ్చాను. కానీ, రాజ్ ఎక్కడికి తెలుసుకోవాలంటే తనతో ఉండాల్సిన అవసరం లేదు. రాజ్ కారులో జీపీఎస్ పెట్టాను. నా ఫోన్‌కి కనెక్ట్ చేసుకున్నాను. తను ఎక్కడికి వెళ్లాడు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడో ఈ ఫోన్‌లో తెలుస్తుంది. కాబట్టి నాకు ఏ టెన్షన్ లేదు అని యామిని అంటుంది.
జాలి పడిన స్టాఫ్
నాకు నష్టం కలగనంతవరకు నా వల్ల రాజ్‌కు ఏ కష్టం రాదు అని యామిని అంటుంది. దాంతో యామిని తల్లిదండ్రులు బిత్తరపోతారు. మరోవైపు కావ్య ఆఫీస్‌కు వెళ్తే స్టాఫ్ అంతా జాలీగా చూస్తారు. రాజ్ గురించి గొప్పగా చెబుతారు. మీరు నాకు సపోర్టివ్‌గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇది చేతుల్లో కూడా ఉండాలి. ఆయన తిరిగి వచ్చేలోపు కంపెనీ అదే స్థానంలో ఉండాలి అని కావ్య అంటే.. అంతా షాక్ అయి చూస్తారు. అదే, ఎక్కడున్న ఆయన మనసులో కంపెనీనే ఉంటుందిగా అని కావ్య అంటుంది.
ఛాంబర్‌కు వెళ్లి కావ్య కూర్చుంటుంది. కంప్యూటర్‌లో రాజ్‌ను చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో శ్రుతి వచ్చి పెండింగ్ ఫైల్స్ ఇస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంత త్వరగా కోలుకుంటారని అనుకోలేదు అని శ్రుతి అంటుంది. చూడు శ్రుతి ఇంట్లో అందరు ఇలా మాట్లాడుతున్నారని ఇక్కడికి వచ్చాను. మీరు కూడా ఇలా చేస్తే ఎలా. జరిగిన విషయాలు మాట్లాడకుండా పని చూసుకోండి. ఆఫీస్ స్టాఫ్‌కి కూడా చెప్పు అని కావ్య అంటుంది.
గుండెల్లో ఉన్న బాధని ఎలా తట్టుకుంటున్నారో మేడమ్ అని శ్రుతి అంటే.. కావ్య చిరాకు పడుతుంది. ఇక మాట్లాడం మేము. స్టాఫ్‌కి కూడా చెబుతాను అని శ్రుతి వెళ్లిపోతుంది. మంచితనంతో కూడా నరకం చూపించొచ్చని నిరూపించారు కదే అందరూ అని కావ్య అనుకుంటుంది. మరోవైపు రాజ్‌ను ట్రాకర్ ద్వారా యామిని మానిటర్ చేస్తుంది. కళావతి గారిని కలుస్తున్నాను. కానీ, ఏ టాపిక్ మాట్లాడాలి. నాలాగే తనకు కూడా మాట్లాడాలని ఉంటే టాపిక్ ఏదైనా పర్లేదు. కానీ, లేకపోతే ఆఫీస్‌లో చూసి షాక్ అవుతుంది అని ఆలోచిస్తుంటాడు రాజ్.
భయపడిన యామిని
ఏం చేస్తే మాట్లాడుతుంది అని రాజ్ కారు ఆపి ఫ్లవర్ బొకె కొంటాడు. ఇది పర్ఫెక్ట్ అని అనుకుంటాడు. రాజ్ కావ్య ఆఫీస్ దగ్గరిలో ఉండటం జీపీఎస్ ద్వారా చూసిన యామిని షాక్ అవుతుంది. రామ్ కారు స్వరాజ్ గ్రూప్ కంపెనీవైపు వెళ్తుంది. తెలిసే వెళ్తున్నాడా అని ఆలోచిస్తుంది. మరోవైపు కంపెనీ దగ్గర రాజ్ ఆగుతాడు. రామ్ సరిగ్గా ఆఫీస్ దగ్గర ఆగిందేంటీ, కచ్చితంగా అక్కడికే వెళ్తాడు. అక్కడ స్టాఫ్ అంత రామ్‌ను గుర్తుపడతారు. అదే జరిగితే రామ్‌కి నిజమైన గతం తెలిసిపోతుంది. ఎలాగైనా రామ్‌ని ఆపాలి అని యామిని భయపడిపోతుంది.
మరోవైపు కావ్యకు రాజ్ కాల్ చేస్తే బిజీగా ఉందని వస్తుంది. దాంతో నేరుగా ఆఫీస్‌లోకి రాజ్ వెళ్తాడు. వాచ్‌మెన్‌కి కాల్ రావడంతో పక్కకు వెళ్లిపోతాడు. అప్పుడే రాజ్ వస్తుంటాడు. అప్పుడు మానిటర్‌లో సీసీ కెమెరాల్లో రాజ్‌ను చూసి కావ్య షాక్ అవుతుంది. ఈయనేంటీ కంపెనీకి బాస్ అని గుర్తుకు వచ్చినట్లు ఈయన నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు గనుక స్టాఫ్ అంతా ఆయన్ను చూస్తే.. స్కూల్ పిల్లల్లా సెల్యూట్ చేస్తారు. ఎందుకు అని అడిగితే ఆయనకు నిజం చెప్పాలి. నిజం చెబితే ఆయన తట్టుకోలేరు అని కావ్య భయపడిపోతుంది.
అప్పుడే శ్రుతి వాళ్లు రాజ్ వైపుకు వెళ్లడం చూసి కావ్య మరింత షాక్ అవుతుంది. ఆపాలని ప్రయత్నం చేస్తుంది. ఆఫీస్‌లోకి రాజ్ రావొద్దను అటు యామిని, ఇటు కావ్య ఇద్దరు ఒకేలా భయపడిపోయి అడ్డుకోవాలని చూస్తారు. రాజ్ డోర్ తీస్తుంటే.. పైనుంచి వచ్చిన కావ్య చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోతుంది. శ్రుతి వాళ్లు అటు వెళ్లిపోతారు. చెప్పకుండా ఇలా నేరుగా ఆఫీస్‌కు వచ్చారేంటీ అని కావ్య అడుగుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు. మీ ఆఫీసే కదా అని రాజ్ అంటాడు.
నిజం చెప్పిన కావ్య
నేను పనిచేస్తున్న ఆఫీస్. ఎందుకు వచ్చారు అని కావ్య అడుగుతుంది. రాజ్ తటాపటాయిస్తాడు. సరే అక్కడ కూర్చోని మాట్లాడుకుందాం అని పక్కకు తీసుకెళ్తుంది కావ్య. మరోవైపు కారులో యామిని వస్తుంటుంది. ఎందుకు వచ్చారని కావ్య అడిగితే.. బొకే అని రాజ్ ఇస్తాడు. ఇప్పుడా. ఏదైనా స్పెషలా అని కావ్య అంటుంది. మీకు హెడెక్ వచ్చిందిగా, గెట్ వెల్ సూన్ అని రాజ్ అంటాడు. తర్వాత బావను ఏదో ఒక రోజు తీసుకొస్తాననే నమ్మకంతో నువ్వుంటే అత్తయ్య రోజు రోజుకీ కుంగిపోతున్నారు అని కావ్యతో అప్పు చెబుతుంది.
నిజంగా వాడు బ్రతికి ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు. ఇంటికెందుకు రావడం లేదు అని కావ్యతో ఏడుస్తూ అడుగుతుంది అపర్ణ. ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని కావ్య నిజం చెప్పేస్తుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. రేపే ఆయన్ను మీకు చూపిస్తాను అని అపర్ణకు చెబుతుంది కావ్య. దాంతో అపర్ణ సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం