




Best Web Hosting Provider In India 2024

హనుమాన్ జయంతికి ప్రసాదంగా 10 నిమిషాల్లో జ్యూసీ బూందీ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో
హనుమాన్ జయంతి సందర్భంగా తీపి ప్రసాదాన్ని వండేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ మేము కేవలం పదినిమిషాల్లో మీరు జ్యూసీ బూందీని ఎలా చేయాలో తెలుసుకోండి. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. ఈ స్వీట్ రెసిపీ చాలా సులువు.

హనుమాన్ జయంతికి స్వీట్ ప్రసాదం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ చేతులతో మీరే నైవేద్యం తయారుచేస్తే అతడి కరుణ మీకు దక్కుతుంది. ఇక్కడ మేము జ్యూసీ బూందీ చేయడం ఎలాగో చెప్పాము. దీన్ని తయారు చేయడానికి చాలా సులువు. ఈ టేస్టీ స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. మీ ఇష్టదైవం కోసం బూందీ ఎలా చేయాలో తెలుసుకోండి
జ్యూసీ బూందీ రెసిపీకి కావలసిన పదార్థాలు
శనగపిండి – ఒక కప్పు
నీరు – మూడు కప్పులు
నూనె – ఒక టీస్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
పంచదార – రెండు కప్పులు
యాలకుల పొడి – ఒక స్పూను
కుంకుమపువ్వు రేకులు – కొన్ని
జ్యూసీ బూందీ సిరప్ రెసిపీ
1. శెనగపిండి జల్లించి ఉండల్లేకుండా చూసుకోవాలి.
2. ఒక కప్పు శెనగపిండి తీసుకుని అందులో ముప్పావు కప్పు నీరు కలపాలి.
3. 3. అందులో ఒక స్పూను నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా చేయడం వల్ల బూందీ గుల్లగా వస్తుంది. తరువాత పావుగంట పాటూ దీన్ని పక్కన ఉంచేయండి.
4. స్టవ్ మీద కళాయి పెట్ట డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
5. ఆ నూనె వేడెక్కాక ఈ బూందీ మిశ్రమాన్ని జల్లెడలో వేసి నూనెలో వేయండి. అవి ముత్యాల్లా కింద రాలుతాయి.
6. అవి రంగు మారేవరకు వేయించి వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
7. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి పంచదార, నీళ్లు వేసి పాకం తీయాలి. ఇందులో కుంకుమ పువ్వు రేకలు కూడా వేసి కలపాలి.
8. పాకం గోరువెచ్చగా మారాక ముందు వేయించిన బూందీని ఇందులో వేసి కలుపుకోవాలి.
9. అంతే టేస్టీ జ్యూసీ బూందీ రెడీ అయిపోయింది. మీరు దీన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.
బూందీ ఇలా చేశారంటే పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇందులో మీరు కాస్త నెయ్యి కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఇంకెందుకాలస్యం ఈ స్వీట్ రెసిపీ చేసేయండి.
సంబంధిత కథనం