



Best Web Hosting Provider In India 2024

AP Inter Results 2025 : రేపు ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు విడుదల – ఇలా చెక్ చేసుకోండి
AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ చెప్పింది. రేపు(ఏప్రిల్ 12) ఉదయం ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన చేశారు.
ఎలా చెక్ చేసుకోవాలంటే
ఏపీలో మన మిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పౌర సేవలన్నీ కూడా దీని ద్వారానే పొందవచ్చు. ఇందులో భాగంగా ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి ఉంటాయి.
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
Step 3 : ‘డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయాలి.
Step 5 : పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.
ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఇలా:
- ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ( bieap.gov.in)లోకి వెళ్లాలి.
- ఇక్కడ ఇంటర్ ఫలితాలు – 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ తో పాటు ముఖ్య వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
HT తెలుగు వెబ్ సైట్ లో ఫలితాలు:
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో కూడా ఏపీ ఇంటర్ ఫలితాలను వేగంగా పొందవచ్చు. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- అభ్యర్థులు ముందుగా హెచ్ టీ తెలుగు వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ – 2025 లింక్స్ ఉంటాయి.
- మీ ఆప్షన్ ఎంచుకోని హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు ఏపీ ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
టాపిక్