పెర్ఫ్యూమ్ అప్లై చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించారంటే సువాసన ఎక్కువసేపు ఉంటుంది!

Best Web Hosting Provider In India 2024

పెర్ఫ్యూమ్ అప్లై చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించారంటే సువాసన ఎక్కువసేపు ఉంటుంది!

Ramya Sri Marka HT Telugu
Published Apr 11, 2025 12:30 PM IST

వేసవి చెమట నుంచి తప్పించుకోవడానికి రోజూ పెర్ఫ్యూమ్ వేసుకుంటున్నారా? వేసుకున్న కొద్దిసేపటికే శరీరం నుంచి చెమట వాసన రావడం మొదలైతుందా? అయితే మీరుపెర్ఫ్యూమ్‌ను ఎలా వాడాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. పెర్ఫ్యూమ్ సువాసన మీతో ఎక్కువసేపు ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి
పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువసేపు ఉండాలంటే ఏం చేయాలి

వేసవి రోజుల్లో వేడి కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. దీని వల్ల కొంతమంది శరీరాల నుండి వింత వాసన వస్తుంది. ఈ వాసన నుండి బయటపడటానికి ప్రజలు రోజూ పెర్ఫ్యూమ్ అప్లై చేసుకుంటారు. ఇలా దుర్వాసన నుంచి బయట పడేందుకు కొద్దిగా పెర్ఫ్యూమ్ చల్లడం ద్వారా మీరు మాత్రమే కాదు మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. మీలో తెలియని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం వస్తాయి. నలుగురిలోకి వెళ్లినప్పుడు కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు.

ఇక్కడ సమస్య ఏంటంటే.. కొంతమంది పెర్ఫ్యూమ్ వాసన వారి శరీరంలో ఎక్కువసేపు ఉండదని, కాసేపటికే చమట వాసన తిరిగి బయటకు వస్తుందనీ చెబుతుంటారు. ఇలా మీకు కూడా జరుగుతుంది అంటే మీరు పెర్ఫ్యూమ్ అప్లై చేసే విధానంలో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నారని అర్థం. సువాసన ఎక్కువ కాలం పాటు ఉండాలంటే వేసవిలో పెర్ఫ్యూమ్ ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.

వేసవిలో పెర్ఫ్యూమ్ వాడటానికి చిట్కాలు

1) పల్స్ పాయింట్స్ పై వేయండి

వేసవిలో మణికట్టు, మెడ, చెవుల వెనుక, మోకాళ్ల వెనుక భాగాల్లో పెర్ఫ్యూమ్ అప్లై చేయండి. శరీరంలోని ఈ భాగాలపై చెమట ఎక్కువ పడుతుంది. వీటి దగ్గర అప్లై చేశారంటే సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

2) క్లీన్ స్కిన్‌పై స్ప్రే చేయండి

పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువ సేపు ఉండాలంటే స్నానం చేసిన తర్వాత చర్మం శుభ్రంగా ఉన్నప్పుడు వేసుకోవాలి. స్కిన్ క్లీన్ & hydratedగా ఉండడం వలన సెంటు ఎక్కువ టైం ఉంటుంది.

3) మాయిశ్చరైజర్ వేసుకున్న తర్వాత పర్ఫ్యూమ్ వాడండి

పొడి చర్మం మీద అప్లై చేస్తే పర్ఫ్యూమ్ వాసన త్వరగా పోతుంది. కాబట్టి మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పర్ఫ్యూమ్ వేసుకోండి. Fragrance-free moisturizer లేదా పర్ఫ్యూమ్కు మ్యాచ్ అయ్యే బాడీ లోషన్ వాడితే సువాసన ఎక్కువ టైం ఉంటుంది.

4) అప్లై చేశాక రుద్దకండి

చాలా మంది పెర్ఫ్యూమ్ స్ప్రే చేసిన తర్వాత వారి మణికట్లను ఒకదానితో ఒకటి రుద్దుతారు. మీరు అలా చేయకూడదు. ఎందుకంటే దీని వల్ల సువాసన మారవచ్చు.ఇది సెంట్ వాసనను పాలు చేస్తుంది. ఎప్పుడైనా స్ప్రే చేసిన తర్వాత అలాగే కాసేపు వదిలేయండి. డ్రే అవ్వనివ్వండి.

5) తడి చర్మం మీద అప్లై చేయండి

కొద్దిగా తడిచిన చర్మంపై పెర్ఫ్యూమ్ వేయడం వల్ల సువాసన ఎక్కువసేపు ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే దాన్ని వేయండి. అయితే సున్నితమైన శరీర భాగాలపై నేరుగా ఇలా వేయడం మంచిది కాదని గుర్తుంచుకోండి.

6) జుట్టు, దుస్తులపై వేయండి

సువాసన ఎక్కువసేపు ఉండాలనుకుంటే, పెర్ఫ్యూమ్‌ను జుట్టు లేదా దుస్తులపై స్ప్రే చేయవచ్చు. మార్కెట్లో హెయిర్ స్ప్రే ప్రత్యేకంగా దొరుకుతుంది.

6) లేయరింగ్ చేయండి

పెర్ఫ్యూమ్ సువాసనను ఎక్కువసేపు ఉంచుకోవడానికి, మీ పెర్ఫ్యూమ్‌తో సరిపోయే సువాసన కలిగిన బాడీ లోషన్ లేదా ఆయిల్ లేయరింగ్ చేయండి.

ఈ చిట్కాలు కూడా ఉపయోగపడతాయి

– మీరు ఎక్కువసేపు ఎండలో ఉండాల్సి వస్తే మీ చర్మంపై నేరుగా పెర్ఫ్యూమ్ వేయకపోవడం మంచిది.

– హైడ్రేటెడ్ చర్మం పెర్ఫ్యూమ్‌ను ఎక్కువసేపు ఉంచుకోవడంలో సహాయపడుతుంది, కాబట్టి క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ ఉపయోగించండి.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024