



Best Web Hosting Provider In India 2024

OTT Action Comedy: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం యాక్షన్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారితే
మలయాళం యాక్షన్ కామెడీ మూవీ బ్యాడ్‌బాయ్స్ ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. బ్యాడ్‌బాయ్స్ మూవీలో సౌత్ సీనియర్ యాక్టర్స్ రెహమాన్, బాబు ఆంథోనీ హీరోలుగా కనిపించారు.

OTT Action Comedy: మలయాళం యాక్షన్ కామెడీ మూవీ బ్యాడ్‌బాయ్స్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది.
రెహమాన్, బాబు ఆంథోనీ…
బ్యాడ్‌బాయ్స్ మూవీలో సౌత్ సీనియర్ యాక్టర్స్ రెహమాన్, బాబు ఆంథోనీ హీరోలుగా కనిపించారు. ధ్యాన్ శ్రీనివాసన్, బిబిన్ జార్జ్, అన్సన్ పాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. కోటిన్నర బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
బ్యాడ్ బాయ్స్ సినిమాలో రెహమాన్, బాబ్ ఆంథోనీ క్యారెక్టర్స్‌ను డిఫరెంట్‌గా డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. సీరియస్‌గా కనిపిస్తూనే వారు పడించిన కామెడీ అభిమానులను ఆకట్టుకున్నది.
బ్యాడ్ బాయ్స్ కథ ఇదే…
మేరీ అనే అమ్మాయిని ఇష్టపడతాడు అంతప్పన్. ఆమె కోసం రౌడీగా మారుతాడు. తన స్నేహితులతో కలిసి చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేస్తుంటాడు. వెట్టుకాడ్ బెన్సన్ డ్రగ్ మాఫియాకు కింగ్‌కు చెలామణి అవుతుంటాడు.
బెన్సన్ గ్యాంగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎస్ఐ అమ్జద్ ఖాన్ ప్రయత్నాలు చేస్తుంటాడు. కొన్ని అనుకోని పరిణామాల వల్ల బెన్సన్ స్థానంలో అంతప్పన్ మాఫియా గ్యాంగ్ లీడర్‌గా మారుతాడు. ఆ తర్వాతే ఏమైంది? చిన్న రౌడీ నుంచి మాఫియా కింగ్‌గా మారిన తర్వాత అంతప్పన్ జీవితం ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి? బెన్సన్‌ను అమ్జద్‌ఖాన్ పట్టుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
హీరోగా…
మలయాళంతో పాటు సౌత్‌లోని పలు సూపర్ హిట్ సినిమాలోని సీన్స్ నుంచి స్ఫూర్తి పొందుతూ స్ఫూఫ్ కామెడీతో దర్శకుడు ఒమర్ లులు బ్యాడ్‌బాయ్స్ సినిమాను రూపొందించారు.
బ్యాడ్‌బాయ్స్‌లో హీరోలుగా నటించిన రెహమాన్, బాబ్ ఆంథోనీ హీరోలుగా, విలన్స్‌గా పలు సినిమాలు చేశారు. భారత్ బంద్, ప్రియతమా, రేపటిరౌడీతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా కనిపించాడు రెహమాన్. బిల్లా, సింహా, సీటీమార్, జనతా గ్యారేజ్‌తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు.
ఫేమస్ విలన్…
బాబు ఆంథోనీ 1990 దశకంలో తెలుగులో పాపులర్ విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు. పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, లారీ డ్రైవర్, శత్రువు, నిప్పురవ్వతో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా నటించాడు. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కలిపి వందకుపైగా సినిమాలు చేశాడు.
సంబంధిత కథనం