Jack Day 1 Collections: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – మాస్ రాంపేజ్ అనుకుంటే సీన్ రివ‌ర్స్

Best Web Hosting Provider In India 2024

Jack Day 1 Collections: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – మాస్ రాంపేజ్ అనుకుంటే సీన్ రివ‌ర్స్

Nelki Naresh HT Telugu
Published Apr 11, 2025 01:28 PM IST

Jack Day 1 Collections: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ మూవీ ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా గురువారం రోజు ఈ మూవీకి రెండున్న‌ర కోట్ల‌లోపే క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఈ మూవీలో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది.

జాక్ ఫస్ట్ డే కలెక్షన్స్
జాక్ ఫస్ట్ డే కలెక్షన్స్

Jack Day 1 Collections: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ మూవీ ఫ‌స్ట్‌డేనే బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. ప్రీమియ‌ర్స్ నుంచే ఈ సినిమాకు దారుణంగా నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ ప్ర‌భావం క‌లెక్ష‌న్స్‌పై గ‌ట్టిగానే ప‌డింది. ఈ స్పై యాక్ష‌న్ కామెడీ మూవీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండున్న‌ర కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోటిన్న‌ర వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోగా…ఓవ‌ర్‌సీస్‌లో మ‌రో కోటి వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

23 కోట్లు…

జాక్ కంటే ముందు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన టిల్లు స్క్వేర్ మూవీ తొలిరోజు 23.70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. టిల్లు స్క్వేర్‌లో స‌గంలో స‌గం కూడా జాక్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకోలేక డీలా ప‌డింది. రెండో రోజు జాక్ మూవీ క‌లెక్ష‌న్స్ స‌గానికి పైగా త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

స్పై యాక్ష‌న్ కామెడీ…

ఈ స్పై యాక్ష‌న్ కామెడీ మూవీకి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది. ఓ సాధార‌ణ యువ‌కుడు రా ఏజెంట్స్ కంటే ముందే టెర్ర‌రిస్ట్ గ్యాంగ్‌ను ఎలా ప‌ట్టుకునే అంశాల‌తో యాక్ష‌న్ కామెడీ ప్ర‌ధానంగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ మూవీని రూపొందించాడు. సీరియ‌స్ టాపిక్‌కు ఫ‌న్నీవేలో చూపిస్తూ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కామెడీ కూడా సినిమాను నిల‌బెట్ట‌లేక‌పోయింది. మ్యూజిక్ కూడా మైన‌స్‌గా మారింది.

జాక్ ఇన్వేస్టిగేష‌న్‌…

జాక్ అలియాస్ పాబ్లో నెరుడా(సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌) బీటెక్ పూర్తిచేస్తాడు.రిసెర్చ్ ఎనాల‌సిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాల‌ని జాయిన్ కావాల‌న్న‌ద‌ని జాక్ క‌ల‌. ఇంట‌ర్వ్యూ అటెండ్ అవుతాడు. దేశంలోని కొన్ని న‌గ‌రాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఓ ఉగ్ర‌వాదులు ప్లాన్ వేస్తారు. ఉగ్ర‌వాదుల కుట్ర‌ల‌ను అడ్డుకునే క్ర‌మంలో అనుకోకుండా రా ఆఫీస‌ర్ మ‌నోజ్‌ను జాక్ కిడ్నాప్ చేస్తాడు. టెర్రిరిస్ట్ గ్యాంగ్‌ను ప‌ట్టుకోవ‌డానికి నేపాల్ వెళ‌తాడు. అక్క‌డ జాక్‌కు ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి?

జాక్ చేసే ప‌నుల వ‌ల్ల రా ఆఫీస‌ర్ మ‌నోజ్ ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? జాక్‌ను ఫాలో అవుతూ నేపాల్ వ‌చ్చిన ఆఫ్షాన్ బేగం (వైష్ణ‌వి చైత‌న్య‌) ఎవ‌రు? మ‌నోజ్ చంపేసిన టెర్ర‌రిస్ట్ అవుతార్ రెహ్మాన్ ప్రాణాల‌తో ఎలా క‌నిపించాడు? రా ఏజెన్సీలో జాక్‌కు ఉద్యోగం వ‌చ్చిందా? అత‌డి క‌ల నెర‌వేరిందా అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024