






Best Web Hosting Provider In India 2024

Mad Square OTT Release Date: మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై బజ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచేనా?
Mad Square OTT Release Date: తెలుగులో గత నెల రిలీజైన సూపర్ హిట్ యాక్షన్ కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.70 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీపై బజ్ నెలకొంది.

Mad Square OTT Release Date: బ్లాక్‌బస్టర్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మూవీ మ్యాడ్ స్క్వేర్. గత నెల 28న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ పార్ట్ అంత పాజిటివ్ టాక్ రాకపోయినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెసైంది. దీంతో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఆసక్తి నెలకొంది.
మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్
మ్యాడ్ మూవీ పెద్ద హిట్ కావడంతో మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజైంది. మార్చి 28న రిలీజైన ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఏప్రిల్ 29 నుంచి ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
కనీసం నాలుగు వారాల గ్యాప్ అనే నిబంధన ఉండటంతో ఈ సినిమాను నెల తర్వాత ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు సమాచారం. మ్యాడ్ స్క్వేర్ కేవలం ఇండియా నెట్ వసూళ్లే రూ.50 కోట్లకు చేరువ కావడం విశేషం.
మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉందంటే?
మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. ఈ సీక్వెల్‌లో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. మ్యాడ్ స్వ్కేర్ కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా అని ప్రమోషన్స్‌లో నిర్మాత నాగవంశీ చెప్పాడు.
ఇందులో కథ, లాజికల్‌లను వెతకొద్దని ముందే హింట్ ఇచ్చాడు. నిర్మాత చెప్పినట్లే ఈ మూవీ సాగుతుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. సినిమా నిండా ఫన్ కోసమే క్రియేట్ చేసిన క్యారెక్టర్లు, సీన్లు కనిపిస్తాయి.
మ్యాడ్‌కు కొనసాగింపుగానే ఈ సీక్వెల్ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మూడేళ్ల తర్వాత డీడీ, అశోక్, మనోజ్ ఏం చేస్తున్నారది చూపిస్తూ కథను మొదలుపెట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపడేందుకు డీడీ చేసే పనులు నవ్విస్తాయి.
లడ్డు పెళ్లి వేడుకలోకి ఈ ముగ్గురు స్నేహితులు అటెండ్ అయిన తర్వాత వచ్చే కామెడీ సీన్లు హిలేరియస్‌గా నవ్విస్తాయి. పెళ్లి వేడుకలో అశోక్, డీడీ, మనోజ్ చేసే సందడి, పెళ్లి కూతురి ఫ్యామిలీతో లడ్డు, అతడి తండ్రి సాగించే సంభాషణలు ఆకట్టుకుంటాయి. లడ్డు పెళ్లి చుట్టే ఫస్ట్ కథను నడిపించి ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు దర్శకుడు.
సంబంధిత కథనం