



Best Web Hosting Provider In India 2024
TG TET 2025 : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్షల తేదీలు, పూర్తి వివరాలు ఇవే!
TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ నిర్వహించనున్నట్లు.. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు.. స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ వివరించింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 15వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఏడాదిలో రెండుసార్లు జూన్, డిసెంబర్ మాసాల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
అర్హత ప్రమాణాలు..
దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థులు సంబంధిత టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
పేపర్-I కి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.Ed) లేదా తత్సమాన అర్హత ఉండాలి.
పేపర్-II కి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వివిధ కేటగిరీల వారికి కనీస మార్కులలో సడలింపు ఉంటుంది (జనరల్ – 60%, బీసీ – 50%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు – 40%).
ముఖ్యమైన విషయాలు..
టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజ్ ఉంటుంది.
టెట్ అర్హత సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.
దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.
మరింత సమాచారం కోసం https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్