





Best Web Hosting Provider In India 2024

Horror Thriller Web Series: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అమ్మాయిల హాస్టల్లో భయం భయం.. స్ట్రీమింగ్ ఆరోజే
Horror Thriller Web Series: ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 11) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. టైటిల్ లోనే భయం ఉన్న ఈ వెబ్ సిరీస్.. ట్రైలర్ తోనే వణికించింది.

Horror Thriller Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మరో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు ఖౌఫ్ (Khauf). అంటే భయం అని అర్థం. ఓ అమ్మాయిల హాస్టల్, అక్కడి అతీత శక్తుల చుట్టూ తిరిగే కథలా ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. వచ్చే వారం ఈ కొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఖౌఫ్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కొన్ని రోజుల కిందటే ఖౌఫ్ అనే ఈ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 18 నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా అప్పుడే వెల్లడించింది. అయితే సరిగ్గా వారం ముందు అంటే శుక్రవారం (ఏప్రిల్ 11) ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజత్ కపూర్, చమ్ దరంగ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ ట్రైలరే భయపెడుతోంది.
స్వేచ్ఛగా తనకు తానుగా బతకాలని కలలు కంటూ ఢిల్లీకి వచ్చిన మాధురి (చమ్ దరంగ్) అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఢిల్లీకి వచ్చిన ఆమెకు తన బడ్జెట్ లో మారుమూల హాస్టల్లో ఓ రూమ్ లభిస్తుంది. అయితే అందులోకి అడుగుపెట్టే ముందే అక్కడున్న మిగిలిన అమ్మాయిలను ఆమెను హెచ్చరిస్తారు. వెంటనే వెళ్లిపోవాలని, తర్వాత నువ్వు వెళ్లాలన్నా వెళ్లలేవని అంటారు.
వాళ్లు ఏం చెబుతున్నారో అప్పుడు ఆమెకు అర్థం కాదు. అయితే ఆమె ఉండే గదిలో అతీత శక్తులు ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని రోజులకే మాధురి.. వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సమయంలో భూత వైద్యుడి పాత్ర పోషించిన రజత్ కపూర్ సీన్లోకి ఎంటరవుతాడు. ఆ తర్వాత ట్రైలర్లో మరిన్ని ట్విస్టులు కనిపిస్తాయి. చివరికి ఆ అమ్మాయికి అక్కడ ఏం జరిగింది? ఆ హాస్టల్లో నుంచి ఆమె సురక్షితంగా బయటపడుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ ఖౌఫ్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
ప్రైమ్ వీడియోలోకి చోరీ 2
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (ఏప్రిల్ 11) మరో హారర్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్ వచ్చింది. ఈ సినిమా పేరు చోరీ 2. నాలుగేళ్ల కిందట వచ్చిన చోరీ మూవీకి ఇది సీక్వెల్. ఇందులో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ నటించారు.
ఈ సినిమాలో సోహా దెయ్యం పాత్రలో కనిపించడం విశేషం. తన కూతురును అతీత శక్తుల నుంచి కాపాడుకోవడానికి ఓ యువతి చేసే ప్రయత్నమే ఈ చోరీ 2 మూవీ. ప్రైమ్ వీడియోలోనే ఈ చోరీ, చోరీ 2.. రెండు సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత కథనం