





Best Web Hosting Provider In India 2024

Anjanadri Theme Song Lyrics: హనుమాన్ మూవీలోని అంజనాద్రి థీమ్ సాంగ్ లిరిక్స్.. హనుమాన్ జయంతినాడు భక్తిపారవశ్యంతో పాడండి
Anjanadri Theme Song Lyrics: హనుమాన్ జయంతి వచ్చేసింది. ఈ శుభ సందర్భంలో బ్లాక్‌బస్టర్ మూవీ హనుమాన్ లోని అంజనాద్రి థీమ్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతూ ఈ పాట పాడుకోండి.

Anjanadri Theme Song Lyrics: హనుమాన్ మూవీ గతేడాది సంక్రాంతికి రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. ఈ సినిమాలోని పాటలు కూడా జనాదరణ పొందాయి. పవర్‌ఫుల్ హనుమాన్ చాలీసాతోపాటు అంజనాద్రి థీమ్ సాంగ్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా అంజనాద్రి థీమ్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.
అంజనాద్రి థీమ్ సాంగ్
ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీలోని పాట ఈ అంజనాద్రి. పవన సుతుడు హనుమంతుడు జన్మించిన అంజనాద్రి గురించి చెబుతూ రాసిన ఈ పాటకు అంతే పవర్ ఫుల్ మ్యూజిక్, లిరిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సాయి చరణ్ భాస్కరుని ఈ పాట పాడాడు.
ఇక గౌర హరి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. శిక శక్తి దత్తా లిరిక్స్ అందించాడు. మనల్ని భక్తి పారవశ్యంలో ముంచుతూనే అంజనాద్రి గురించి చెబుతూ సాగే శక్తివంతమైన పాట ఇది. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం.
అంజనాద్రి సాంగ్ లిరిక్స్ ఇవే
అంజనాద్రిపై సంతతి కొరకై
అహో రాత్రములు
తపస్సు చేసే వానర కేసరి
కేసరి కులసతి కడుపు పండగా
జనించినాడొక అసమాన
భలోద్బదుడు సంయుతుడూ
అంజనా సుతుడూ పవన నందనుడూ
అరుణ కిరణముల ఉదయాగ్నిని కని
అది పండిన తియ్యని పండనుకొని
సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే
తన దేహం మాటున రవిమరుగై
జగము చీకటై పోగా
అది అమరేంద్రుడు గమనించి
తన ఐరావతమధిరోహించి
ఆంజనేయుని సమీపించి
తన వజ్రాయుధమును విసరగా
అది పవన నందనుని హనుముని తాక
చిందిన రక్త బిందువే
విద్యుత్ వేగంతో ధరణీ స్థలి
గంగ కడలిలో చొచ్చి
గంగ కడలి అట్టడుగున గల
శ్రీ రంగ శుద్ధి గర్భమ్ము చేరి యట
కాలక్రమమున ఘనీభవించి
హనుమ రుధిరమని ఘనియై
అర్హత గల ఒక సహృదయునికై
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం
నిరంతనిశ్చల నిరీక్షణం
వర్ష సహస్రక నిరీక్షణం
సంబంధిత కథనం