



Best Web Hosting Provider In India 2024

SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సమ్మర్‌లో అందుబాటులోకి 14 స్పెషల్ ట్రైన్స్
SCR Special Trains : ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవిలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు 14 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఏప్రిల్ నుంచి జూన్ వరకు రాకపోకలు సాగిస్తాయి. అలాగే నెల్లూరు- సూళ్లూరుపేట మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు.

1. తిరుపతి-మచిలీపట్నం (07121) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు మే 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం ప్రయాణిస్తుంది. మొత్తం ఎనిమిది సర్వీసులు ఉంటాయి.
2. మచిలీపట్నం-తిరుపతి (07122) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు మే 26 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి సోమవారం ప్రయాణిస్తుంది. మొత్తం ఎనిమిది సర్వీసులు ఉంటాయి.
ఈ రెండు రైళ్లు తిరుపతి- మచిలీపట్నం మధ్య రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
3. చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు (07025) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శుక్రవారం ప్రయాణిస్తుంది. మొత్తం 12 సర్వీసులు ఉంటాయి.
4. శ్రీకాకుళం రోడ్డు- చర్లపల్లి (07026) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు జూన్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం ప్రయాణిస్తుంది. మొత్తం 12 సర్వీసులు ఉంటాయి.
5. తిరుపతి- సాయినగర్ షిర్డి (07637) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు జూన్ 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం ప్రయాణిస్తుంది. మొత్తం 12 సర్వీసులు ఉంటాయి.
6. సాయినగర్ షిర్డి- తిరుపతి (07638) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి సోమవారం ప్రయాణిస్తుంది. మొత్తం 12 సర్వీసులు ఉంటాయి.
7. హుబ్బలి- కతిహార్ (07325) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి బుధవారం ప్రయాణిస్తుంది. మొత్తం నాలుగు సర్వీసులు ఉంటాయి.
8. కతిహార్- హుబ్బలి (07326) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు మే 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం ప్రయాణిస్తుంది. మొత్తం నాలుగు సర్వీసులు ఉంటాయి.
ఈ రెండు రైళ్లు గుంతకల్, ధోనే, నంద్యాల, దిగువమెట్ట, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
9. ఎస్ఎంవీటీ బెంగళూరు-నారంగి (06559) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు ఏప్రిల్ 29 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి మంగళవారం ప్రయాణిస్తుంది. మొత్తం నాలుగు సర్వీసులు ఉంటాయి.
10. నారంగి- ఎస్ఎంవీటీ బెంగళూరు (06560) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు మే 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి శనివారం ప్రయాణిస్తుంది. మొత్తం నాలుగు సర్వీసులు ఉంటాయి.
ఈ రెండు రైళ్లు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
11. ఎస్ఎంవీటీ బెంగళూరు- మాల్దా (06565) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు ఏప్రిల్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి ఆదివారం ప్రయాణిస్తుంది. మొత్తం మూడు సర్వీసులు ఉంటాయి.
12. మాల్దా- ఎస్ఎంవీటీ బెంగళూరు (06566) సమ్మర్ వీక్లీ స్పెషల్ రైలు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి బుధవారం ప్రయాణిస్తుంది. మొత్తం మూడు సర్వీసులు ఉంటాయి.
ఈ రెండు రైళ్లు రేణిగుంట, గూడూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
13. మదురై- భగత్ కీ కొత్తి (06067) సూపర్ ఫాస్ట్ సమ్మర్ స్పెషల్ రైలు ఏప్రిల్ 14వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి సోమవారం ప్రయాణిస్తుంది. ఒక సర్వీసు మాత్రమే ఉంటుంది.
14. భగత్ కీ కొత్తి- మదురై (06068) సూపర్ ఫాస్ట్ సమ్మర్ స్పెషల్ రైలు ఏప్రిల్ 17వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్రతి గురువారం ప్రయాణిస్తుంది. ఒక సర్వీసు మాత్రమే ఉంటుంది.
ఈ రెండు రైళ్లు సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
రెండు రైళ్లు రద్దు..
1. సూళ్లూరుపేట-నెల్లూరు (66037) రైలు ఏప్రిల్ 12న రద్దు చేశారు.
2. నెల్లూరు-సూళ్లూరుపేట (66038) రైలు ఏప్రిల్ 12న రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్