






Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller: నేరుగా ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. గోవా స్మగ్లింగ్ స్టోరీతో..
OTT Crime Thriller: ఓటీటీలోకి ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు వస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో నవాజుద్దీన్ సిద్దిఖీ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా.. ఒకప్పటి గోవా స్మగ్లింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మెయిన్ రోల్‌లో నటిస్తున్న కోస్టావో మూవీని జీ5 ఓటీటీ తీసుకొస్తోంది. గోవా సినిమాటిక్ చరిత్రలో ఒక కొత్త, అదిరిపోయే చాప్టర్‌గా ఉండబోతోంది. ఈ సినిమా 1990ల నాటి కథతో వస్తోంది. ఆ కాలంలో బీచ్‌ల స్వర్గంగా పేరున్న గోవా.. మిస్టరీలతో, పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ దందాలతో, నేరాలతో నిండి ఉండేది.
కోస్టావో మూవీ గురించి..
భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్ ‘కోస్టావో’ను తెరపైకి తెస్తోంది. బాంబే ఫేబుల్స్ మోషన్ పిక్చర్స్, వినోద్, కమలేష్, భావేష్, సేజల్, శ్యామ్ భానుశాలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోవాకు చెందిన ధైర్యవంతుడైన కస్టమ్స్ ఆఫీసర్ మిస్టర్ కోస్టావో ఫెర్నాండెజ్ నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉద్యోగం పట్ల తనకు ఉన్న అంకితభావంతో దేశ చరిత్రలో అతిపెద్ద బంగారు స్మగ్లింగ్ దందాలలో ఒకదాన్ని ఆయన ఎలా భగ్నం చేశారో ఈ సినిమా చూపిస్తుంది.
‘కోస్టావో’ కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు అని దాని కాన్సెప్ట్ ద్వారానే తెలుస్తోంది. ఎందుకంటే ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. మన దేశానికి సేవ చేసిన గుర్తింపు లేని యోధుల గురించి, వారు పోరాడిన నిశ్శబ్ద పోరాటాల గురించి ఈ సినిమా చూపించబోతోంది. తన సాహసోపేతమైన మిషన్ తర్వాత జీవితం నాటకీయ మలుపు తిరిగిన నిర్భయమైన అధికారి పాత్రను సిద్ధిఖీ పోషిస్తున్నాడు.
కోస్టావో కథేంటంటే?
దేశం ఆర్థిక సంస్కరణలతో నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో ఈ కథ జరుగుతుంది. ఆ సమయంలో స్మగ్లింగ్ ముఠాలు బాగా చెలరేగిపోయాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో.. మిస్టర్ ఫెర్నాండెజ్ భారీగా బంగారు సరుకు భారత తీరాలకు చేరకుండా అడ్డుకోవడానికి తన కెరీర్‌ను, ప్రాణాలను పణంగా పెట్టారు.
నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ కోస్టావో నచ్చే అవకాశం ఉంది. ఇక టూరిస్టుల స్వర్గధామమైన ఇప్పటి గోవా.. ఒకప్పుడు ఎలా ఉండేదో ఈ సినిమా కళ్లకు కట్టనుంది. ఈ కోస్టావో స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే జీ5 ఓటీటీ అనౌన్స్ చేయనుంది.
సంబంధిత కథనం