TN BJP president: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ అన్నాడీఎంకే నేత

Best Web Hosting Provider In India 2024


TN BJP president: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ అన్నాడీఎంకే నేత

Sudarshan V HT Telugu
Published Apr 11, 2025 06:55 PM IST

TN BJP president: అన్నాడీఎంకే నుంచి ఫిరాయించిన నైనార్ నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఫైర్ బ్రాండ్ మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై స్థానంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ అన్నాడీఎంకే నేత
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మాజీ అన్నాడీఎంకే నేత (Facebook/Nainar Nagendran)

TN BJP president: భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే నుంచి ఫిరాయించిన నైనార్ నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ అధికారి, ఫైర్ బ్రాండ్ కె.అన్నామలై స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2026 లో అసెంబ్లీ ఎన్నికలు

ద్రవిడ రాజకీయాల ఆధిపత్యం ఉన్న తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఆ రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర రాజకీయాల భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలకు పార్టీని నడిపించడం నైనార్ నాగేంద్రన్ కు చాలా కష్టమైన పని.

ఎవరీ నైనార్ నాగేంద్రన్?

నైనార్ నాగేంద్రన్ తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1960 అక్టోబర్ 16న వడివేేశ్వరంలో జన్మించిన నాగేంద్రన్ జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి తిరునల్వేలి నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా సేవలందించారు. 2001 నుంచి 2006 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్, పరిశ్రమలు, రవాణా శాఖలను నిర్వహించారు.

2020 నుంచి బీజేపీ ఉపాధ్యక్షుడిగా..

2011లో అన్నాడిఎంకె తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు నాగేంద్రన్ ను మంత్రివర్గం నుండి తప్పించారు. 2016 డిసెంబర్ లో జయలలిత మరణించిన తరువాత, 2017 లో ఆయన అన్నాడీఎంకే ను వీడి బీజేపీలో చేరారు. 2020 నుండి తమిళనాడు బిజెపి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన నైనార్ నాగేంద్రన్ 2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరునల్వేలి నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ పై గెలిచారు.

వివాదాస్పద నేత

నైనార్ నాగేంద్రన్ 2006లో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2010లో రూ.3.9 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన, ఆయన భార్య, మరో నలుగురు బంధువులపై అవినీతి నిరోధక చట్టం కింద విజిలెన్స్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసింది. 2018 జనవరిలో ‘ఆండాళ్’ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ప్రముఖ తమిళ గేయ రచయిత, రచయిత వైరముత్తుపై నైనార్ నాగేంద్రన్ హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందూ మతం గురించి చెడుగా మాట్లాడే వారిని చంపడానికి సంకోచించరాదని ఆయన అన్నారు.

Sudarshan V

eMail
వీ సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియాతో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ పదవులలో పనిచేశారు. తనకు జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకునే వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆటోమోటివ్, సాంకేతిక పరిణామాలపై ఆసక్తి ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link