BJP-AIADMK alliance: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ, అన్నాడీఎంకే

Best Web Hosting Provider In India 2024


BJP-AIADMK alliance: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ, అన్నాడీఎంకే

Sudarshan V HT Telugu
Published Apr 11, 2025 05:41 PM IST

BJP-AIADMK alliance: వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.

బీజేపీ, అన్నాడీఎంకే కూటమి
బీజేపీ, అన్నాడీఎంకే కూటమి (PTI)

BJP-AIADMK alliance: వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, అన్నాడిఎంకె కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం చెన్నైలో ప్రకటన చేశారు. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిత్వ శాఖల పంపకాలు జరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తూ, సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తెస్తోందని అమిత్ షా ఆరోపించారు.

2023 లో బయటకు..

2023 సెప్టెంబర్లో అప్పటి తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి ఏఐఏడీఎంకే వైదొలగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మళ్లీ ఎన్డీఏ గూటికి చేరింది. అన్నాడీఎంకే అగ్రనేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి అమిత్ షా 2026లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీయే బ్యానర్ కింద ప్రాంతీయ పార్టీతో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు.

పళనిసామి నాయకత్వంలో

తమిళనాడులో రాబోయే విధాన సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ, మిగతా కూటమి పార్టీలు కలిసి ఎన్డీయేగా పోటీ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ నేతలు నిర్ణయించారని తెలిపారు. తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిసామి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని అమిత్ షా తెలిపారు. అమిత్ షా ఈ ప్రకటన చేస్తున్న సమయంలో బీజేపీతో అన్నాడీఎంకే సంబంధాలు తెంచుకోవడానికి కారణమైన అన్నామలై కూడా అక్కడే ఉన్నారు.

Sudarshan V

eMail
వీ సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియాతో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ పదవులలో పనిచేశారు. తనకు జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకునే వివిధ రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆటోమోటివ్, సాంకేతిక పరిణామాలపై ఆసక్తి ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link