AP intermediate results : భయపడకండి! ఎగ్జామ్​ రిజల్ట్స్​ వేళ ‘ఒత్తిడి’ని ఇలా దూరం చేయండి..

Best Web Hosting Provider In India 2024


AP intermediate results : భయపడకండి! ఎగ్జామ్​ రిజల్ట్స్​ వేళ ‘ఒత్తిడి’ని ఇలా దూరం చేయండి..

Sharath Chitturi HT Telugu
Published Apr 12, 2025 06:37 AM IST

AP Inter results 2025 : ఇంకొన్ని గంటల్లో ఏపీ ఇంటర్​ ఫలితాలు వెలువడనున్నాయి. ఫలితాల చుట్టూ చాలా మంది విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు కనిపిస్తుంటాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి? ఈ సింపుల్​ టిప్స్​ ఫాలో అవ్వండి చాలు..

పరీక్షల ఫలితాలపై ఒత్తిడిగా ఉందా? ఇలా చేయండి..
పరీక్షల ఫలితాలపై ఒత్తిడిగా ఉందా? ఇలా చేయండి..

బోర్డ్​ ఎగ్జామ్స్​ సీజన్​ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్​ ‘రిజల్ట్స్​’పై పడింది. నేడు ఏపీ ఇంటర్మీడియట్​ ఫలితాలు వెలువడనున్నాయి. త్వరలోనే సీబీఎస్​ఈతో పాటు అనేక పరీక్షల ఫలితాలు వెలువడతాయి. రిజల్ట్స్​ డేట్​ దగ్గరపడే కొద్ది చాలా మంది విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతుంటుంది. కొందరు పరీక్షల ఫలితాల ఒత్తిడిని కంట్రోల్​ చేసుకోలేకపోతుంటారు. అది వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సరిగ్గా నిద్రపట్టదు, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతుంటారు. కొందరిలో డిప్రెషన్​ లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తుంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అసలు పరీక్షల ఫలితాల చుట్టూ మనకి ఎదురయ్యే స్ట్రెస్​ని ఎలా మేనేజ్​ చేయాలి? అన్న టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

పరీక్షల ఫలితాల వేళ ఒత్తిడి- లక్షణాలు ఇవి..

  • తలనొప్పి, కడుపు నొప్పి
  • నిరంతరం పరీక్షల ఫలితాల గురించే ఆలోచించడం, ప్రశాంతత లేకపోవడం
  • కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి దూరంగా జరిగిపోవడం
  • సరిగ్గా నిద్రలేకపోవడంతో శరీరంలో వీక్​నెస్​
  • తినాలని లేకపోవడం
  • అన్ని విషయాల్లోనూ నెగిటివ్​ ఆలోచనలు ఉండటం
  • అగ్రెసివ్​గా ప్రవర్తించడం, చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం

AP inter results 2025 : పైన చెప్పిన లక్షణాలు మీలో మీకు కనిపిస్తే, కచ్చితంగా కొన్ని టిప్స్​ పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవాలి.

ఈ సింపుల్​ టిప్స్​తో ఒత్తిడిని తగ్గించుకోండి..

మాట్లాడండి– మీ ఫీలింగ్స్​ని లోలోపల దాచుకోకండి. ఇతరులతో మాట్లాడండి. విద్యార్థుల్లో మానసిక సమస్యలు సాధారణం అని గుర్తుపెట్టుకోండి. మీ ఒక్కరికే ఇలా జరుగుతోందని అనుకోకండి. ఓపెన్​-అప్​ అవ్వండి. రిలీఫ్​గా ఉంటుంది.

ప్లాన్​ చేయండి– ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్న విషయాన్ని అంగీకరించండి. మీరు ప్లాన్​ చేసినట్టే ఫలితాలు వస్తే మంచిదే! కానీ రాకపోతే? అందుకు ముందు నుంచే ప్రిపేర్​ అవ్వండి. మీరు ఊహించిన స్థాయిలో ఫలితాలు రాకపోయినా, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి.

రెగ్యులర్​ రొటీన్​ ఉండాలి– ఒక రొటీన్​ని ఫాలో అవ్వడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఫిజికల్​ యాక్టివిటీ ఉంటే బెటర్​. పరీక్షల ఫలితాలపై ఆలోచనలను తగ్గించుకునేందుకు మిమ్మల్ని మీరు బిజీ బిజీగా ఉంచుకోవడం మంచిది.

ఎవరైనా పక్కన ఉండాలి– పరీక్షల ఫలితాలు చెక్​ చేస్తున్నప్పుడు ఎవరినైనా పక్కన పెట్టుకోండి. మీ మీద నమ్మకం ఉన్న వారు మీ పక్కన ఉండటం ఆ సమయంలో చాలా అవసరం. మీలో ధైర్యాన్ని నింపే వారు ఉండాలి.

AP inter results 2025 date ఇతరులతో పోల్చుకోకండి– ఒత్తిడికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఇతరులతో పోల్చుకోవడం! ఇలా చేసేందుకు మీ చుట్టుపక్కన చాలా మంది ఉంటారు. మీరు మిమ్మల్ని, మీ మార్కులను ఇతరులతో పోల్చుకోవాల్సి అవసరం లేదు. ఏ ఇద్దరు ఒకటి కాదని గుర్తుపెట్టుకోండి. మీ జీవితం మీది. ఎదుటి వ్యక్తి సక్సెస్​కి అభినందించడం. కానీ మీరు అలా ఎందుకు లేరని బాధపడకుండా, సక్సెస్​ ఎలా అవ్వాలో ప్లాన్​ చేయండి.

చివరిగా ఒక్క మాట- జీవితంలో గెలుపోటములు సహజం. పరీక్షల్లో సక్సెస్​- ఫెయిల్​లు సహజం. ఏం జరిగినా, జీవితం అక్కడితో ఆగిపోదని గుర్తుపెట్టుకోండి. మరో అవకాశం వస్తుంది. మరింత కష్టపడి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link