Best Web Hosting Provider In India 2024

Brahmamudi April 12th Episode: కావ్యకు గిఫ్ట్ ఇచ్చిన రాజ్ -యామినిపై రామ్ డౌట్ – రుద్రాణికి ఇచ్చిపడేసిన ధాన్యలక్ష్మి
బ్రహ్మముడి ఏప్రిల్ 12 ఎపిసోడ్‌లో కావ్యను కలిసిన రాజ్…మన మధ్య ఉన్న బంధం ఏమిటో చెప్పాలని పట్టుపడతాడు. కానీ రాజ్‌కు సమాధానం చెప్పకుండా కావ్య తప్పించుకుంటుంది. మరోవైపు అపర్ణ బాధను పట్టించుకోకుండా చులకనగా మాట్లాడిన రుద్రాణికి ధాన్యలక్ష్మి క్లాస్ ఇస్తుంది.
కావ్యను కలవడానికి ఆఫీస్‌కు వస్తాడు రాజ్. మీతో మాట్లాడటానికి వచ్చానని అంటాడు. భర్త ముందు నిజాలు మాట్లాడలేకపోతున్నందుకు బాధపడుతుంది కావ్య. ఏమైందని రాజ్ అడుగుతుంది. వర్క్ వదిలేసి వచ్చా కదా అదే ఆలోచిస్తున్నానని అబద్ధం ఆడుతుంది.
కావాల్సిన వాళ్లలా…
మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు నాకు బాగా కావాల్సిన వాళ్లలా అనిపించారని రాజ్ అంటాడు. నాలాగే మీకు అనిపించిందా అని కావ్యను అడుగుతాడు. మీ కళ్లల్లోకి చూస్తే మన మధ్య ఏదో బంధం, పరిచయం ఉందని నా మనసు స్ట్రాంగ్‌గా చెబుతుందని రాజ్ చెబుతాడు. కానీ ఆ బంధం ఏదో తెలియడం లేదని అంటాడు. నేనంటే గతం మర్చిపోయాను.
మీరు బాగానే ఉన్నారు కదా…మనం ఇంతకు ముందు ఎప్పుడు, ఎక్కడ కలిశామో చెప్పమని కావ్యను నిలదీస్తాడు రాజ్.ఈ రోజు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఎక్కడికి పంపించేది లేదని అంటాడు. కావ్య మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.
వెళ్లాలని లేదు కానీ…
నాకు వెళ్లాలని లేదు. కానీ ఉండలేను. ఉండి చెప్పలేను. అబద్దానికి, నిజానికి మధ్య నలిగిపోతున్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. మీరు ఏదో నిజాన్ని దాస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీ కళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా…బలవంతంగా ఆ నిజాన్ని బయటకు రాకుండా దాస్తున్నారని తెలిసిపోతుందని కావ్య అంటుంది. రాజ్ ఎంత అడిగిన కావ్య మాత్రం మౌనం వీడదు.
కావ్య అబద్ధం…
కావ్య నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ అప్పుడే ఫోన్ మోగుతుంది. ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చిందని ఇప్పుడు నేను వెళ్లకపోతే జాబ్ నుంచి నన్ను తీసేస్తారని అబద్ధం ఆడుతుంది. కావ్య వెళ్లడానికి రాజ్ ఒప్పుకుంటాడు. మీతో ఉంటే నిజం చెప్పేస్తానేమోనని భయంగా ఉందని, అందుకే వెళ్లిపోతున్నానని నన్ను క్షమించండి అని రాజ్‌ను ఉద్దేశించి మనసులో అనుకుంటుంది. కావ్యను పిలుస్తాడు రాజ్. ఫ్లవర్ బొకే మర్చిపోయారని ఇస్తాడు.
సమాధానం చెప్పడం ఇష్టం లేక…
బొకే తీసుకుందని సంతోషపడాలా? అసలు నిజంగానే పని ఉండి వెళ్లిపోయిందా? తనకు సమాధానం చెప్పడం ఇష్టం లేక కావ్య వెళ్లిపోయిందా అని రాజ్ ఆలోచిస్తాడు. రాజ్ కారులోని జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా అతడు ఉన్న లొకేషన్‌కు వస్తుంది యామిని. కావ్య ఆఫీస్ ముందు రాజ్ కారు ఉండటం చూసి షాకవుతుంది.
ఈ పాటికి రాజ్‌ను అందరూ గుర్తుపట్టి ఉంటారని అనుకుంటుంది. టెన్షన్‌గా ఆఫీస్‌లో అడుగుపెడుతుంది. యామిని ఆపిన శృతి…ఎవరు కావాలని అడుగుతుంది. రాజ్ కోసం వచ్చానని యామిని బదులిస్తుంది.
యామిని తడబాటు…
మీరు రాజ్ సార్ ఫ్రెండా? కావ్యను ఓదార్చడానికి వచ్చారా అని యామినితో శృతి అంటుంది. ఆఫీస్ ఎదురుగా ఉన్న కేఫ్ నుంచి బయటకు వస్తాడు రాజ్. యామిని కార్ కనిపించడంతో డౌట్ వచ్చి కాల్ చేసి కారు దగ్గర ఉన్నానని చెబుతాడు. యామిని కారు దగ్గరకు రాగానే… నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసిందని ప్రశ్నిస్తాడు. నాకు తెలియకుండా నన్ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నావా అని యామినిపై ఫైర్ అవుతాడు. జీపీఎస్ ట్రాకర్ సీక్రెట్ బయటపడకుండా మ్యానేజ్ చేస్తుంది యామిని. నా ఫ్రెండ్‌ను కలవడానికి వెళుతుంటే దారిలో నీ కారు కనిపించిందని అందుకే ఆగానని యామిని అబద్ధం ఆడుతుంది.
ఫ్రెండ్‌ను కలవడానికి
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని రాజ్‌ను అడుగుతుంది యామిని. తన ఫ్రెండ్ కనిపిస్తే కలవడానికి కేఫ్‌కు వెళ్లానని రాజ్ కూడా ఆబద్ధం ఆడుతాడు. రాజ్ తన ఆఫీస్‌కు వెళ్లలేదని తెలిసి యామిని రిలీఫ్‌గా ఫీలవుతుంది. రాజ్ ఇచ్చిన ఫ్లవర్ బొకే చూసి మురిసిపోతుంది కావ్య. మీరు నన్ను గుర్తుపట్టకపోయినా మీ మనసులో నేను ఉండటం ఆనందంగా ఉందని రాజ్ గురించి ఆలోచిస్తూ కావ్య అనుకుంటుంది. అసలు నేను ఎవరన్నది మీతో చెప్పాలని ఉందని, ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తున్నానని కావ్య అంటుంది.
పరిచయం ఎప్పటిది…
మరోవైపు రాజ్ కూడా కావ్య గురించే ఆలోచిస్తుంటాడు. మన మధ్య ఉన్న ఈ పరిచయం ఎప్పటిదీ, నిజంగా మన మధ్య పరిచయం లేదా? లేనట్లు దాచడానికి ప్రయత్నిస్తున్నావా అని కావ్యను తలుచుకుంటూ ఆలోచిస్తాడు రాజ్. నిజంగానే మనం ఒకప్పుడు కలిసి ఉన్న మాట నిజమైతే అది తెలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నానని రాజ్ అనుకుంటాడు. ఎంత ప్రయత్నించిన గుర్తురావడం లేదని అంటాడు. మన మధ్య ఉన్నది స్నేహమేనా అని అనుకుంటాడు.
బ్రహ్మముడి వేసిన దేవుడు…
మనకు సాయం చేసిది, మనలను తిరిగి కలిపేది మన మధ్య బ్రహ్మముడి వేసిన దేవుడు ఒక్కడేనని, త్వరలోనే అన్ని విషయాలు గుర్తుకొస్తాయనే నమ్మకం ఉందని అనుకుంటుంది. మన దూరమైనా కొత్త ప్రేమికుల్లా ఇలా ప్రేమించుకోవడం నచ్చిందని ఆనందపడుతుంది.
రాజ్ దూరమయ్యాడన్న బాధలో…
అపర్ణ పుట్టినరోజు కదా దాని గురించి ఏం ఆలోచించావని సుభాష్‌ను అడుగుతాడు రాజ్. అందరికి అపర్ణ పుట్టినరోజు అందరికి గుర్తున్నా…రాజ్ దూరమయ్యాడన్న బాధలో ఎవరూ దాని గురించి ఆలోచించలేదని అంటుంది. రాజ్ బతికి ఉన్నప్పుడు అపర్ణ పుట్టినరోజు నాడు గుడిలో అన్నదానం చేసి అందరికి పట్టుబట్టలు పెట్టేవాడు అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు వదినకు రాజ్‌తో పాటు ఆ ఆనందాలు దూరమయ్యాయని అంటుంది.
ఆనందాలు అవసరం లేదు…
రాజ్ లేనప్పుడు నాకు ఆనందాలు, అన్నదానాలు అవసరం లేదని, ఇక నుంచి అలాంటివేవి జరిపించవద్దని అపర్ణ అంటుంది. రాజ్‌కు నీ పేరు మీద అన్నదానం జరిపించడం ఇష్టం కదా…వాడికోసమైనా ఒప్పుకోమని అపర్ణను బతిమిలాడుతాడు ప్రకాశం. అందరూ కన్వీన్స్ చేయడంలో అపర్ణ ఒప్పుకుంటుంది.
ధాన్యలక్ష్మి క్లాస్…
రాజ్ గుర్తురావడంతో అపర్ణ అన్నం తినకుండా రూమ్‌లోకి వెళ్లుతుంది. అపర్ణ బాధను పట్టించుకోకుండా మన వెళ్లి భోజనం చేద్దామని రుద్రాణి అంటుంది. రుద్రాణికి క్లాస్ ఇస్తుంది ధాన్యలక్ష్మి. అపర్ణ రాజ్‌ను తల్చుకొని అంత బాధపడుతుంటే నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావని, మన ఇంటి మనిషి పస్తులతో పడుకుంటే మనకు తినబుద్ది ఎలా అవుతుందని ధాన్యలక్ష్మి.
నువ్వు నేను ఒకటి కాదు…
నువ్వేంటి ఉత్తమురాలిగా మాట్లాడుతున్నావని, ఇన్ని రోజులు ఆస్తుల కోసం గొడవలు పడినట్లు ఈ ప్రేమ ఎటు పోయింది అని ధాన్యలక్ష్మిపై సెటైర్లు వేస్తుంది రుద్రాణి. నా కొడుకుకు న్యాయం జరగడం కోసం నీతో కలిసి నాలుగు మాట్లాడాను. అంత దానికే నువ్వు నేను ఒకటి అనుకుంటే ఎలా. నేను మనిషిని…సాటి మనిషికి కష్టం వస్తే చూస్తూ ఉండలేను. నీలా అస్సలు ఉండలేను అని ధాన్యలక్ష్మి అంటుంది.
బతకడానికి కాదు…
నువ్వు రుద్రాణితో కలిసి ఆమెలా ఎక్కడ మారిపోయావో అనుకున్నాను….కానీ వదిన బాధను అర్థం చేసుకొని ఇంకా నా భార్యవే అని నిరూపించుకున్నావని ప్రకాశం అంటాడు. మీరు చెప్పే డైలాగ్స్ మాట్లాడటానికి బాగుంటాయి. కానీ బతకడానికి కాదని, ప్రాక్టికల్‌గా ఆలోచించమని రివర్స్‌గా ధాన్యలక్ష్మి, ప్రకాశంపై పంచ్‌లు వేస్తుంది రుద్రాణి.
మరో కంపెనీకి చెల్లించాల్సిన రెండు కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కావ్య దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు. అకౌంట్స్‌లో డబ్బులు లేకపోవడంతో చెల్లించలేకపోయామని మేనేజర్ చెప్పడంతో కావ్య షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.