Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: దీపపై మర్డర్ కేసు -అరెస్ట్ చేసిన పోలీసులు -భార్యకు కార్తీక్ సపోర్ట్ -సుమిత్ర కన్నీళ్లు
Karthika Deepam 2: కార్తీక దీపం ఏప్రిల్ 12 ఎపిసోడ్‌లో దశరథ్‌ను గన్‌తో షూట్ చేసిన దీపను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తాను ఏ తప్పు చేయలేదని దీప వాదిస్తుంది. కానీ ఆమె మాటలను పోలీసులు నమ్మరు. నువ్వే మర్డర్ అటెంప్ట్ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయని అంటారు.
తనపై జ్యోత్స్న వేసిన నిందలను ఆధారాలతో నిరూపించాలని దీప అనుకుంటుంది. కానీ జ్యోత్స్న తెలివిగా వేసిన ప్లాన్ కారణంగా అడ్డంగా బుక్కవుతుంది. దీపను గన్‌తో బెదిరిస్తుంది జ్యోత్స్న. ఆమె చేతులలో నుంచి గన్ లాక్కున్న దీప…జ్యోత్స్నకు గురిపెడుతుంది. కానీ పొరపాటున గన్ పేలి బుల్లెట్ దశరథ్‌కు తాకుతుంది. దశరథ్ కుప్పకూలిపోతాడు.
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆ సీన్ చూసి షాకవుతాడు. దీప మా బావను షూట్ చేసిందని కార్తీక్‌తో జ్యోత్స్న అంటుంది. దశరథ్‌ను మావయ్య అని పిలుస్తాడు కార్తీక్. ఎవర్రా నీకు మావయ్య అని కార్తీక్‌ను నెట్టేస్తాడు శివన్నారాయణ. చావును నా ఇంటికి పంపించావుగా…నువ్వు నా కొడుకును ముట్టుకోవద్దని అంటాడు.
మీ అంతు తేలుస్తా…
దశరథ్‌ను బతికించుకున్న తర్వాత మీ అంతుతేలుస్తానని, ఎవరిని వదిలిపెట్టనని కార్తీక్, దీపలకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. షాక్ నుంచి తేరుకున్న దీప…. దశరథ్ దగ్గరకు వస్తుంది. అతడి చేయి వేసి పిలుస్తుంది.
నా భర్తను వదిలిపెట్టు, నువ్వు అసలు మనిషివే కాదని సుమిత్ర కోపంగా అరుస్తుంది. అప్పుడే అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దీపనే దశరథ్‌ను గన్‌తో షూట్ చేసిందని, తనను అరెస్ట్ చేయమని పారిజాతం అంటుంది.
ప్రాణం పోయిన సరే…
దశరథ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి కార్తీక్ సాయం చేస్తానని అంటాడు. ప్రాణం పోయిన సరే నువ్వు మాత్రం నీ సాయం మాత్రం మాకు అక్కరలేదని శివన్నారాయణ అంటాడు. దీపనే హంతకురాలు అని, ఈ గన్‌తోనే దశరథ్‌ను చంపాలని చూసిందని ఎస్ఐతో శివన్నారాయణ అంటాడు. దీపను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళతారు. సైకిల్‌పై కార్తీక్ పోలీసులను ఫాలో అవుతాడు.
డిన్నర్ ప్లాన్…
కూరగాయలు కట్ చేస్తూ వేలు కట్ చేసుకుంటుంది స్వప్న కాశీ కంగారు పడతాడు. గాయాన్ని పట్టించుకోదు స్వప్న. మొండిదానిలా మారిపోతున్నావని స్వప్నతో అంటాడు కాశీ. దీప చాలా మంచిది. కానీ కోపం వస్తే అవతలి వాళ్లు ఏ స్థాయిలో ఉన్న వారిని చావగొడుతుంది.
శౌర్యతో పాటు కార్తీక్‌ను ఏమన్న తట్టుకోలేదు. మన ప్రేమించిన వాళ్లకు ఏదైనా ఐతే తట్టుకోలేం అని కాశీతో అంటుంది స్వప్న. మనం అందరం ఒకే ఇంట్లో ఉంటే బాగుంటుందని స్వప్నతో అంటాడు కాశీ. కార్తీక్, దీపలతో కలిసి ఈ సండే డిన్నర్ ప్లాన్ చేద్దామని అంటాడు కాశీ.
కిందపడిపోయిన కాంచన…
శౌర్య స్కూల్ నుంచి వచ్చేసరికి కాంచన కిందపడిపోయి కనిపిస్తుంది. స్పృహలో ఉండదు. శౌర్య, అనసూయ కంగారు పడతారు. అమ్మనాన్నలకు ఫోన్ చేసి విషయం చెబుతానని శౌర్య అంటుంది. ఆమెను అనసూయ ఆపేస్తుంది. మనవాళ్లకు ఏదో అయినట్లు గుండె దడగా అనిపించి కళ్లు తిరిగి పడిపోయానని కాంచన అంటుంది.
సాక్ష్యాలు ఉన్నాయి…
తాను దశరథ్‌ను కాల్చలేదని పోలీసులకు చెబుతుంది దీ. కానీ దీప మాటలను పోలీసులు నమ్మరు. నువ్వు నేరం చేశావు అనడానికి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. నిన్ను ఎవరూ కాపాడలేరని ఎస్ఐ అంటాడు.
మొదటిసారే గురి తప్పకుండా…
అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. నేను ఎవరిని కాల్చలేదని, ఆ గన్ ఎలా పేలిందో కూడా తనకు తెలియదని కార్తీక్‌తో అంటుంది దీప. గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి అని చెబుతుంది. మొదటిసారి అయినా గురి తప్పకుండా గుండెలపై కాల్చావని ఎస్ఐ అంటాడు. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడొద్దు పోలీస్ ఆఫీసర్‌పై కార్తీక్ ఫైర్ అవుతాడు. దశరథ్ తనకు మావయ్య అని కార్తీక్ అంటాడు. ఆస్తి గొడవల వల్లే మీ మావయ్యపై దీప ప్రతీకారం తీర్చుకుందా, అందుకే ఆయన్ని చంపాలని అనుకుందా అంటూ ఎస్ఐ అడుగుతాడు.
గన్ పేల్చలేదు…
జ్యోత్స్నతో మాట్లాడటానికే ఆ ఇంటికి వెళ్లానని, దశరథ్‌ను చంపడానికి కాదని అంటుంది. గన్ తాను పేల్చలేదని అంటుంది. దీప మాటలను ఎవరు నమ్మరు. నువ్వే దశరథ్‌ను కాల్చవనడానికి అన్ని ఆధారాలు దొరికాయని ఎస్ఐ అంటాడు. దీప అబద్ధం చెబుతుందని కోప్పడుతాడు.
మర్డర్ అటెంప్ట్…
దశరథ్‌ను తను కాల్చలేదని చెబుతుంది కదా పోలీస్ ఆఫీసర్‌తో కార్తీక్ అంటాడు. మీరు చూశారా అని ఎస్ఐని ప్రశ్నిస్తాడు. గొడవ జరిగిందని ఫోన్ వచ్చిందని, అక్కడికి వెళితే దశరథ్‌పై దీప మర్డర్ అటెంప్ట్ చేసిందని, అందుకే అరెస్ట్ చేశామని అంటాడు. గన్‌పై దీప వేలి ముద్రలు తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, దీపపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని, కోర్టుకు పంపిస్తామని అంటాడు. శిక్ష ఎవరికి వేయాలన్నది కోర్టు డిసైడ్ చేస్తుందని కార్తీక్‌తో చెబుతాడు ఎస్ఐ.
ఎన్నిసార్లు మోసపోతావు…
నిన్ను ఏమనాలో నాకే తెలియడం లేదని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న కుట్రల గురించి నీకు తెలిసిన వెంటనే నువ్వు నాకు చెబితే ఇలా జరిగేది కాదని, జ్యోత్స్న చేతిలో ఎన్నిసార్లు మోసపోతావు అని దీపకు క్లాస్ ఇస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిపోయి వెళ్లి సమస్యల్లో పడ్డావు. జరిగింది చూస్తుంటే మాట్లాడటానికి వెళ్లినట్లు లేవు…మర్డర్ చేయడానికి వెళ్లినట్లు ఉన్నావు. నీ చేతిలో గన్ ఉండటం తాను చూశానని కార్తీక్ అంటాడు.
ఏ తప్పు చేయలేదు…
తన చేతిలో గన్ అసలు పేలలేదని, ఎవరో కాల్చారో తనకు తెలియదని దీప అంటుంది. తాను ఏ తప్పుచేయలేదని కార్తీక్‌తో చెబుతుంది. ఇదంతా శౌర్యకు చెప్పొద్దని, తట్టుకోలేదని కన్నీళ్లతో కార్తీక్‌తో అంటుంది దీప. బాధతో పోలీస్ స్టేషన్ నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు. దశరథ్‌కు ఎలా ఉందో అని దీప ఆవేదనకు లోనవుతుంది.
శివన్నారాయణ కన్నీళ్లు…
డాక్టర్లు దశరథ్‌కు సర్జరీ చేసి బుల్లెట్ బయటకు తీస్తారు. కొడుకు పరిస్థితి చూసి శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే హాప్పిటల్‌కు కార్తీక్ వస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.