JEE Mains 2025 answer key : జేఈఈ మెయిన్స్​​ సెషన్​ 2 ఆన్సర్​ కీ విడుదల..

Best Web Hosting Provider In India 2024


JEE Mains 2025 answer key : జేఈఈ మెయిన్స్​​ సెషన్​ 2 ఆన్సర్​ కీ విడుదల..

Sharath Chitturi HT Telugu
Published Apr 12, 2025 09:39 AM IST

NTA JEE Mains 2025 : జేఈఈ మెయిన్స్​ రెండో సెషన్​కు హాజరైన అభ్యర్థులకు కీలక అలర్ట్​! జేఈఈ మెయిన్స్​ 2025 ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్​​ సెషన్​ 2 ఆన్సర్​ కీ విడుదల..
జేఈఈ మెయిన్స్​​ సెషన్​ 2 ఆన్సర్​ కీ విడుదల..

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్​ 2025 సెషన్ 2కు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు jeemain.nta.nic.in లో ఆన్సర్​ కీని చెక్​ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్ 2 ఆన్సర్ కీ డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

జేఈఈ మెయిన్స్​ సెషన్​ 2..

జేఈఈ మెయిన్స్​ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రికార్డు చేసిన సమాధానాలను కూడా అధికారిక వెబ్సైట్​లో చూడవచ్చు. అభ్యంతరాలు చెప్పాలనుకునే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్ 13 రాత్రి 11:50 గంటల వరకు ఈ విండో యాక్టివ్​గా ఉంటుంది.

జేఈఈ మెయిన్ 2025 రెండో సెషన్ ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరిగింది. కాగా పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ మాత్రమే విడుదలైంది.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ, ప్రశ్నపత్రం, వాటి సమాధానాలను ఉపయోగించి ఎన్ని మార్కులు వస్తాయో లెక్కించవచ్చు.

జేఈఈ మెయిన్స్​ 2025 ఆన్సర్ కీ ఎలా చెక్ చేసుకోవాలి?

స్టెప్​ 1- జేఈఈ మెయిన్స్- jeemain.nta.nic.in కోసం ఎన్టీఏ వెబ్సైట్ ఓపెన్ చేయండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే ఆన్సర్ కీ లింక్​పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

స్టెప్​ 4- ఆన్సర్ కీ, ప్రశ్నలు, మీరు రికార్డ్ చేసిన రెస్పాన్స్​ని చెక్​ చేయండి.

స్టెప్​ 5- మీరు అభ్యంతరాలు లేవనెత్తాలనుకుంటే, ఇచ్చిన సూచనలను అనుసరించండి.

అభ్యంతర విండో ముగిసిన తర్వాత అభ్యర్థుల ఫీడ్ బ్యాక్​ను సబ్జెక్టు నిపుణులు సమీక్షిస్తారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తుది ఆన్సర్ కీని సవరిస్తారు.

జేఈఈ మెయిన్స్​ సెషన్ 2 ఫలితాలను సిద్ధం చేయడానికి, ప్రకటించడానికి తుది ఆన్సర్ కీని ఎన్టీఏ ఉపయోగిస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో నడిచే, ప్రైవేటు సంస్థలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఈ జేఈఈ మెయిన్స్.

ఇది ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రవేశ పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్​డ్​కి స్క్రీనింగ్ పరీక్షగా ఉంటుంది.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక వెబ్సైట్స్​ని సందర్శించవచ్చు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link