






Best Web Hosting Provider In India 2024

Romantic Movie: బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ – రాక్‌స్టార్ లవ్‌లో ఫెయిలైతే!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన ఆకాశ వీధుల్లో మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. హీరోగా నటిస్తూనే ఈ మూవీకి గౌతమ్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించాడు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన ఆకాశ వీధుల్లో మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆకాశ వీధుల్లో సినిమాకు గౌతమ్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించాడు. హీరోగా, డైరెక్టర్‌గా ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పూజిత పొన్నాడ హీరోయిన్…
ఈ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించింది. 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఆకాశ వీధుల్లో మూవీలో సత్యం రాజేష్, దేవీప్రసాద్‌తో పాటు మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ హర్షిత్ గౌర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు జుడా శాండీ మ్యూజిక్ అందించాడు. ప్రేమ, లివింగ్ రిలేషన్, కెరీర్ లాంటి విషయాల్లో యువతరంలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది.
రాక్‌స్టార్ సిద్ధు కథ….
మిడిల్ క్లాస్‌లో పుట్టిన సిద్ధుకు మ్యూజిక్ అంటే ప్రాణం. సిద్దు బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలని అతడి తండ్రి కలలు కంటాడు. మ్యూజిక్ కారణంగా చదువు ఆపేస్తాడు సిద్ధు. తండ్రితో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. రాక్‌స్టార్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు.
అలాంటి టైమ్‌లోనే అతడి జీవితంలోకి నిషా వస్తుంది. నిషాతో ప్రేమలో పడతాడు సిద్ధు. అపోహలు, అపార్థాల కారణంగా కొద్ది రోజుల్లోనే సిద్ధుకు దూరమవుతుంది నిషా. లవ్ ఫెయిల్యూర్‌తో సిద్ధు డ్రగ్స్‌కు బానిసగా మారుతాడు? ఆ తర్వాత ఏమైంది. నిషా ప్రేమను అతడు తిరిగి పొందగలిగాడా? రాక్‌స్టార్ కావాలనే సిద్ధు కల తీరిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
బిగ్‌బాస్ రన్నరప్…
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7తో పాటు సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. సీజన్ 7లో 91వ రోజు ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ…సీజన్ 8లో మాత్రం రన్నరప్‌గా నిలిచాడు. వైల్డ్‌కార్డ్ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ…అనూహ్యంగా టైటిల్ రేసులోకి వచ్చాడు. తన ఆటతీరు, అగ్రెసివ్ బిహేవియర్‌తో ఓటింగ్‌లో టాప్‌లో నిలుస్తూ వచ్చాడు.
కానీ చివరలో చేసిన కొన్ని తప్పుల కారణంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్‌గా నిఖిల్ నిలిచాడు. ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ సీజన్ 8 ద్వారా ఇరవై లక్షల వరకు రెమ్యునరేషన్ దక్కించుకున్నట్లు సమాచారం.
ఆకాశ వీధుల్లో తర్వాత సోలో బాయ్ పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు గౌతమ్ కృష్ణ. ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది.
సంబంధిత కథనం