





Best Web Hosting Provider In India 2024

రీల్స్ చూసి ముఖానికి అన్నీ అప్లై చేసేయడమేనా? ఏది మంచిదో ఏది చెడ్డతో తెలుసుకో అక్కర్లేదా?
చర్మ సంరక్షణకు సంబంధించిన రీల్ లేదా వీడియో చూసి వెంటనే దాన్నిట్రే చేస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ఇది మంచిది కాదని తెలుసుకోండి. అందం కోసం కళ్ళు మూసుకుని DIY బ్యూటీ చిట్కాలను ప్రయత్నించడం వల్ల కొన్నిసార్లు చర్మం మరింత పాడవచ్చు. ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోకపోతే మీ అందం పాడైపోవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా DIY (Do it yourself) స్కిన్ కేర్ ట్రెండ్ పెరిగింది. ఎలాంటి క్రీములు వాడకుండా, పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే స్వయంగా సహజమైన పదార్థాలతోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోవడమే ఈ పద్ధతి. ఆన్‌లైన్‌లో అంటే యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాట్సప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లేదా పుస్తకాలలో లభించే సమాచారం, సూచనలు, పదార్థాలను ఉపయోగించి మనమే స్వయంగా ఉత్పత్తులను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.
సాధారణంగా DIY ద్వారా ప్రజలు చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు మాస్క్‌లు, మాయిశ్చరైజర్లు, క్లెంజర్లు, నూనెలు, సీరమ్ లు వంటి వాటిని తయారు చేసుకుంటారు. నిజానికి ఇలా సహజమైన వస్తువులతో స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడం మంచి పద్ధతే అయితే ఇది అన్ని సార్లు కాదట.. అందరికీ కాదట. కొన్నిసార్లు సహజ పదార్థాలు కూడా చర్మానికి హాని కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధన ఏమి చెబుతోంది?
జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ స్కిన్ కేర్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం స్వయంగా తయారు చేయడం వల్ల DIY సౌందర్య ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండవచ్చు, కానీ వాటి పదార్థాలు కొంతమంది చర్మానికి ప్రమాదకరంగా హాని కలిగించవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తి చర్మ స్వభావం వేరుగా, వేరుగా ఉంటుంది. కొందరికి DIY బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల అలెర్జీలు సంభవించే ప్రమాదం ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్ అధ్యయనం ప్రకారం, DIY ఉత్పత్తులలో ప్రిజర్వేటివ్స్ ఉపయోగించరు, అందువల్ల అవి త్వరగా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని ఉపయోగించడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సరైన సమాచారం అవసరం
నిమ్స్ మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలోని డెర్మటాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఋషభ రాజ్ శర్మ చెబుతున్నారు, ‘ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో చాలా DIY చర్మ సంరక్షణ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అవన్నీ సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి కావు. ప్రతి గృహ వస్తువు మీ చర్మానికి ఉపయోగకరంగా ఉండదు. చర్మ సంరక్షణలో ఉపయోగించే పదార్థాల గురించి మనకు ఎల్లప్పుడూ సరైన సమాచారం ఉండాలి మరియు కొన్ని పదార్థాలను నివారించాలి.’
సహజ ఉత్పత్తులతొ చర్మానికి ఎలాంటి సమస్యలు రావచ్చు..?
1. అలెర్జీలు, చికాకు:
ప్రతి ఒక్కరి చర్మం వేరుగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి కొన్ని పుల్లని పదార్థాలు అంటే ఉదాహరణకు నిమ్మకాయ, టమాటో, వెనిగర్ వంటివి అలెర్జీలు, చికాకు వంటివి కలిగించవచ్చు.
2. pH అసమతుల్యత:
చర్మ సహజ pH సమతుల్యత 4.5 నుండి 5.5 మధ్య ఉంటుంది. నిమ్మకాయ లేదా బేకింగ్ సోడా ఈ సమతుల్యతను దెబ్బతీయవచ్చు.
3. ఇన్ఫెక్షన్ ప్రమాదం:
కొన్ని DIY రెసిపీలలో ప్రిజర్వేటివ్స్ లేని మిశ్రమాలు ఉంటాయి. దీని వలన బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. వీటి ఉపయోగించడం వల్నల స్కిన్ ఇన్ఫెక్షన్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.
4. అసమాన ప్రభావం:
ఇంట్లో తయారు చేసిన చర్మ సంరక్షణ ఉత్పత్తులలో పదార్థాల పరిమాణం అటు ఇటుగా మారచ్చు. దీని వలన అవి కొన్నిసార్లు ప్రభావవంతంగా ఉంటాయి, మరికొన్నిసార్లు చర్మానికి హాని కలిగిస్తాయి.
నిర్భయంగా ఏయే పదార్థాలను ఉపయోగించవచ్చు?
యాలోవేరా జెల్(కలబంద గుజ్జు): ఇది చర్మానికి తేమను అందించి ఉపశమనం కలిగిస్తుంది. ఎలాంటి సమస్యలు రావు.
తేనె: ఇందులో సహజంగానే బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. ఇది చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది. ఎలాంటి హాని కలిగించదు.
పెరుగు: ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
నారింజ నూనె: ఇది పొడి చర్మానికి మంచి మాయిశ్చరైజర్. సహజ కాంతినిస్తుంది.
వీటిని ఉపయోగించే ముందు ఆలోచించండి
నిమ్మకాయ:
నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల సన్‌బర్న్, దద్దుర్లు వంటివి రావచ్చు.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా చర్మలోని సహజ నూనెలను తొలగించి, చర్మాన్ని పొడిగా చేస్తుంది. దురద, ఎర్రటి మచ్చలు కూడా రావచ్చు.
టూత్‌పేస్ట్:
ముఖంపై టూత్‌పేస్ట్ వేసుకోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. చికాకు కలుగుతుంది. దీనిలో ఉన్న రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు.
షుగర్ స్క్రబ్:
ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చక్కెర గరుకుగా ఉంటుంది. దీని ఉపయోగించడం వల్ల చర్మంపై మైక్రో-టీర్లు ఏర్పడవచ్చు. చర్మంపై చికాకు, ఇన్ఫెక్షన్ రావచ్చు.
వెనిగర్:
వెనిగర్ pH చాలా ఆమ్లంగా ఉంటుంది. దీన్ని పలుచన చేయకుండా వేసుకోవడం వల్ల చర్మం మండిపోవచ్చు, ఎర్రబడవచ్చు. కొన్నిసందర్భాల్లో గాయాలు కూడా కావచ్చు.
గుడ్డు:
DIY ఫేస్ మాస్క్‌లో గుడ్డును ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, దీనిలో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణమవచ్చు.
సంబంధిత కథనం