AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్ – మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

AP Inter Results 2025 : ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు వచ్చేశాయ్ – మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu Published Apr 12, 2025 11:05 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Published Apr 12, 2025 11:05 AM IST

AP Inter 1st Year 2nd Year Results 2025 : ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను ప్రకటించారు. పరీక్ష రాసిన విద్యార్థులు HT తెలుగు వెబ్ సైట్ లో వేగంగా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లోనూ అందుబాటులో ఉన్నాయి.

ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల
ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 విడుదల
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయ్..! శనివారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్ ను విడుదల చేశారు. పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు…హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ తో పాటు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈసారి సరికొత్తగా వాట్సాప్ (మన మిత్ర నెంబర్) లోనూ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

HT తెలుగులో సులభంగా పొందండి ఇలా…

హిందుస్తామ్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ లో ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ (ఒకేషనల్ తో సహా) రిజల్ట్స్ ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన డైరెక్ట్ లింక్స్ కింద ఇవ్వటం జరిగింది…..

  • ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2025 : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result
  • ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2025: https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result
  • ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాలు 2025: https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result
  • ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాలు 2025 : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result

విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కి “Hi” మెసేజ్ పంపితే కూడా ఫలితాలను పొందవచ్చు.

పెరిగిన ఉత్తీర్ణత శాతం:

ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందైంది.మొదటి సంవత్సరం విద్యార్థులకు 70 శాతం, రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదైంది. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది. ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతంగా ఉంది.

ఈ ఏడాదికి సంబంధించిన ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిశాయి. పది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఎగ్జామ్స్ పూర్తైన వెంటనే వెంటనే ఇంటర్ బోర్డు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా… మొత్తం 4 విడుతల్లో పూర్తి చేసింది. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో ఇవాళ (ఏప్రిల్ 12) ఫలితాలను విడుదల చేశారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ap IntermediateAp Inter Board Results 2025EducationExam Results
Source / Credits

Best Web Hosting Provider In India 2024