





Best Web Hosting Provider In India 2024
Warner Counter Pakistan Reporter: ఇండియాపై పాకిస్థాన్ రిపోర్టర్ ప్రశ్న.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వార్నర్.. ఏమన్నాడంటే?
Warner Counter Pakistan Reporter: పాకిస్థాన్ సూపర్ లీగ్ లో డెబ్యూకు లెజెండ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెడీ అయ్యాడు. కరాచి కింగ్స్ కెప్టెన్ గా అతను ఆ లీగ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో ఇండియా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వార్నర్ కౌంటర్ ఇచ్చాడు.

ఆస్ట్రేలియా విధ్వంసక మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తన అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. కరాచి కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బిజీ షెడ్యూల్ కారణంగా పీఎస్ఎల్ లో వార్నర్ ఆడలేకపోయాడు. ఇప్పుడు తన ఫస్ట్ సీజన్ కోసం రెడీ అయ్యాడు. నేడు (ఏప్రిల్ 12) కరాచి కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో వార్నర్ పాల్గొన్నాడు. అప్పుడు ఇండియా గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు వార్నర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఐపీఎల్ వేలం
కరాచి కింగ్స్ జట్టు ఈ రోజు ముల్తాన్ సుల్తాన్స్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వార్నర్‌కు ఒక పాకిస్తాన్ రిపోర్టర్ నుంచి ఉద్దేశపూర్వకమైన ప్రశ్న ఎదురైంది. ఈ ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో వార్నర్ అమ్ముడుపోలేదు. దీంతో పీఎస్ఎల్ లో ఆడుతున్నందుకు చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ వార్నర్ ను ట్రోల్ చేస్తున్నారని ఆ పాకిస్థాన్ రిపోర్టర్ అడ్డగోలుగా వాదించాడు.
వార్నర్ ఆన్సర్ అదుర్స్
ఇండియన్ ఫ్యాన్స్ చూపిస్తున్న ద్వేషానికి ఎలా స్పందిస్తారని వార్నర్ ను రిపోర్టర్ ప్రశ్నించాడు. కానీ అలాంటిదేమీ లేదని వార్నర్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘నేను ఇలాంటిది వినడం మొదటిసారి. నా దృక్కోణం నుంచి చూస్తే నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నా. పీఎస్‌ఎల్‌కు రావడానికి ఛాన్స్ వచ్చింది. గతంలో నా అంతర్జాతీయ క్యాలెండర్ బిజీ కారణంగా పీఎస్‌ఎల్‌కు రాలేకపోయా. ఇప్పుడు కరాచి కింగ్స్ కెప్టెన్ గా ట్రోఫీని గెలుచుకుంటామని ఆశిస్తున్నా’’ అని వార్నర్ కౌంటర్ ఇచ్చాడు.
వార్నర్ గత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. 2023 ఎడిషన్‌లో రిషబ్ పంత్ (అప్పటి కెప్టెన్) కారు ప్రమాదంలో గాయపడి సీజన్‌ను మిస్ అయిన తర్వాత ఆ జట్టుకు వార్నర్ నాయకత్వం వహించాడు. కానీ నవంబర్‌లో జరిగిన మెగా వేలం ముందు ఆ జట్టు ఆస్ట్రేలియా ఆటగాడిని విడుదల చేసింది. వేలంలో వార్నర్ అన్ సోల్డ్ గా మిగిలాడు.
ఈ రికార్డు
వార్నర్ 184 మ్యాచ్‌లలో 6565 పరుగులతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన విదేశీ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నారు. లీగ్‌లో తన కెరీర్‌లో రెండు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఆడాడు. 2016లో హైదరాబాద్ కెప్టెన్ గా టైటిల్ గెలిచాడు. మొత్తంమీద వార్నర్ లీగ్‌లో నాలుగో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్. విరాట్ కోహ్లి, ధావన్, రోహిత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link