Karthika Deepam 2 Serial: హీరోయిన్ల‌కు ధీటుగా దీప రెమ్యున‌రేష‌న్ – కార్తీక దీపం 2 కోసం కార్తీక్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: హీరోయిన్ల‌కు ధీటుగా దీప రెమ్యున‌రేష‌న్ – కార్తీక దీపం 2 కోసం కార్తీక్ రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Nelki Naresh HT Telugu
Published Apr 12, 2025 11:36 AM IST

Karthika Deepam 2: కార్తీక దీపం 2 సీరియ‌ల్ కోసం కార్తీక్‌, దీప సినిమా హీరోహీరోయిన్ల‌కు ధీటుగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం దీప యాభై వేల‌కుపైగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. కార్తీక్ నెల‌కు 14 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

కార్తీక దీపం 2 సీరియల్
కార్తీక దీపం 2 సీరియల్

కార్తీక దీపం 2 ప్ర‌స్తుతం స్టార్ మాలో నంబ‌ర్ వ‌న్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.ఫ‌స్ట్ ఎపిసోడ్ నుంచే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన ఈ సీక్వెల్ సీరియ‌ల్ చాలా కాలం పాటు టీఆర్‌పీ రేటింగ్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో కొన‌సాగుతూ వ‌స్తోంది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో సీరియ‌ల్ స‌డెన్‌గా రెండో స్థానంలోకి ప‌డిపోయింది. కార్తీక దీపం 2 సీరియ‌ల్‌ను దాటేసిన గుండె నిండా గుడి గంట‌లు టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చింది.

సెకండ్ ప్లేస్‌…

ఇటీవ‌ల ప్ర‌క‌టించిన తాజా టీఆర్‌పీ రేటింగ్‌లో గుండె నిండా గుడి గంట‌లు 11.76 టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకోగా…కార్తీక దీపం 2 సీరియ‌ల్ 11.68 టీఆర్‌పీతో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.

తెలుగులో విజ‌య‌వంత‌మైన కార్తీక దీపం సీరియ‌ల్‌కు సీక్వెల్‌గా కార్తీక దీపం 2 తెర‌కెక్కుతోంది. కార్తీక దీపం 2 సీరియ‌ల్‌లో నిరుప‌మ్ ప‌రిటాల‌, ప్రేమీ విశ్వ‌నాథ్, గాయ‌త్రి సింహాద్రి, జీడిగుంట శ్రీధ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

దీప రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

కాగా కార్తీక దీపం 2 సీరియ‌ల్ కోసం దీప పాత్ర‌లో న‌టిస్తోన్న ప్రేమీ విశ్వ‌నాథ్‌ భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు 50 నుంచి 60 వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను ప్రేమీ విశ్వ‌నాథ్‌ డిమాండ్ చేస్తోన్న‌ట్లు తెలిసింది. నెల‌లో… 20 రోజుల వ‌ర‌కు ఈ సీరియ‌ల్ షూటింగ్ కోసం దీప డేట్స్ కేటాయిస్తోన్న‌ట్లు చెబుతోన్నారు. ఈ సీరియ‌ల్ ద్వారా నెల‌కు 12 ల‌క్ష‌ల‌పైనే ప్రేమీ విశ్వ‌నాథ్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

నిరుపమ్ పరిటాల టాప్…

తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా నిరుప‌మ్ ప‌రిటాల కొన‌సాగుతోన్నాడు. నిరుప‌మ్ ప‌రిటాల కార్తీక దీపం 2 ఒక్కో ఎపిసోడ్ కోసం 70 నుంచి 80 వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ సీరియ‌ల్ ద్వారా నెల‌కు 14 ల‌క్ష‌ల‌పైనే నిరుప‌మ్‌కు రెమ్యున‌రేష‌న్ రూపంలో ద‌క్కుతున్న‌ట్లు స‌మాచారం.

లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌…

తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కార్తీక దీపం నిలిచింది. 2017లో మొద‌లైన ఈ సీరియ‌ల్ 2023లో ముగిసింది. కార్తీక దీపంలోని పాత్ర‌ల‌నే తీసుకొని కొత్త క‌థ‌తో సీక్వెల్‌ను తెర‌కెక్కించారు.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024