RRB ALP Recruitment 2025 : ఆర్ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్- 9వేలకు పైగా పోస్టులకు రిజిస్ట్రేషన్​ షురూ

Best Web Hosting Provider In India 2024


RRB ALP Recruitment 2025 : ఆర్ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్- 9వేలకు పైగా పోస్టులకు రిజిస్ట్రేషన్​ షురూ

Sharath Chitturi HT Telugu
Published Apr 12, 2025 02:34 PM IST

RRB ALP Recruitment 2025 apply online : ఏఎల్​పీ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్​ఆర్బీ ప్రారంభించింది. అర్హత, ఎంపిక విధానం, ఫీజు సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆర్ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్ 2025
ఆర్ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్ 2025 (Rajkumar)

ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్​! ఏఎల్​పీ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ని ఏప్రిల్​ 12, శనివారం నాడు ప్రారంభించింది ఆర్​ఆర్బీ (రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు). అసిస్టెంట్ లోకో పైలట్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్న అభ్యర్థులు rrbapply.gov.in ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ- 2025 మే 11 అని గుర్తుపెట్టుకోవాలి. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేదీ 13 మే 2025. మాడిఫికేషన్ విండో మే 14న ఓపెన్​ అయ్యి, 2025 మే 23న ముగుస్తుంది.

ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో భాగంగా సంస్థలో 9970 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఈ కింద తెలుసుకోండి..

ఆర్​ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్​- 

అర్హత- ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ద్వారా విద్యార్హతలను తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్​ చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం- మొదటి దశ సీబీటీ (సీబీటీ-1), రెండో దశ సీబీటీ(సీబీటీ-2), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ (ఎంఈ).

పరీక్ష ఫీజు- రూ.500. కాగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, మహిళలు, ట్రాన్స్​జెండర్లు, మైనార్టీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈబీసీ): రూ.250/-.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా ఆన్​లైన్ ఫీజు చెల్లింపును మాత్రమే స్వీకరిస్తారు. వర్తించే అన్ని సర్వీస్ ఛార్జీలను అభ్యర్థి భరించాలి.

పరీక్ష రుసుము (అంటే రూ.400/- లేదా రూ.250/- వర్తించే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి) రిఫండబుల్ భాగాన్ని పొందడానికి.. అభ్యర్థులందరూ తమ దరఖాస్తు ఫారంలో (బ్యాంక్ పేరు, ఖాతాదారుడి పేరు, ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్​సీ కోడ్) తమ బ్యాంక్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి.

ఆర్​ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​కి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆర్ఆర్బీ ఏఎల్పీ రిక్రూట్మెంట్ 2025: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటే

ఇలా అప్లై చేసుకోండి..

1. ఆర్ఆర్బీల అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆర్ఆర్బీ ఏఎల్​పీ రిక్రూట్​మెంట్​ 2025 లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

5. సబ్మిట్​పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link