






Best Web Hosting Provider In India 2024

Rama Raama Song Lyrics Vishwambhara: విశ్వంభర ‘రామ.. రామ’ భక్తి పాటకు అద్భుత రెస్పాన్స్.. ఈ సాంగ్ లిరిక్స్ ఇవే
Rama Raama Song Lyrics Vishwambhara: విశ్వంభర చిత్రం నుంచి తొలి పాట వచ్చింది. శ్రీ రాముడి భక్తి పాటగా వచ్చి ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ రిలిక్స్ ఇక్కడ చూడండి. చూస్తూ పాడుకోండి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రంపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి నేడు (ఏప్రిల్ 12) తొలి పాట వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ పాటను మూవీ టీమ్ తీసుకొచ్చింది. ‘రామ రామ’ అంటూ శ్రీరాముడిని కీర్తిస్తూ హుషారుగా ఈ పాట ఉంది. ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
కీరవాణి సంగీతం.. శంకర్ మహదేవన్ గాత్రం
విశ్వంభర చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామ.. రామ అంటూ ఉన్న ఈ భక్తి పాటకు మంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్‍తో పాటు లిప్సిక భాస్యం ఆలపించారు. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రాముడి గొప్పతనాన్ని స్తుతిస్తూ విశ్వంభరలోని పాట సాగింది. చిరంజీవి డ్యాన్స్, ఏఐ విజువల్స్ కూడా లిరికల్ వీడియోలో ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూడండి. పాడుకోండి.
రామ రామ పాట లిరిక్స్
జై శ్రీరామ్.. జై శ్రీరామ్
రామ.. రామ.. రామ.. రమ.. రామ.. రామ..రామ.. రామ.. రామ రమా.. రామా (మరో 3 సార్లు రిపీట్)
హేయ్ తయ్యతక్క తకదిమి చెక్కా భజనలాడి..
రాములోరి గొప్ప చెప్పుకుందామా..
ఆసాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ
లక్షణాలు ముచ్చటించుకుందామా..
నీ గొంతు కలిపి మా వంత పాడగా
రావయ్య అంజని హనుమా…
రామయ్య కీర్తన నోరార పలుకగ.. చిరంజీవి నీ జనుమ..
రామ.. రామ.. రామ.. రమ.. రామ.. రామ..రామ.. రామ.. రామ రమా.. రామా (మరో 3 సార్లు రిపీట్)
శివుని ధనువు వంచినోడు.. శ్రీరామ్
రావణ మదము తెంచినోడు.. శ్రీరామ్
ధర్మము విలువ పెంచినోడు.. దశరథ సుతుడు
అతడి జంటగ అమ్మతోడు..
మాయమ్మ సీతమ్మ సరిజోడు..
పట్టిన మగని కోనవేలు
వీడలేదు ఎపుడూ..
పాదుకలను మోసినోడు తమ్ముడంటే వాడు..
ఆ తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు..
అన్నయ్యంటే ఇతడు..
హే రంగ.. రంగ వైభవంగా రామా కల్యాణ వేళ
సంబరాల పాట పాడుకుందామా..
రంగురంగు ఉత్సవాల కోలాటమాడుకుంటూ
చిన్నపెద్ద చిందులాడుకుందామా..
నీ గొంతు కలిపి మా వంత పాడగా
రావయ్య అంజని హనుమ..
రామయ్య కీర్తన నోరార పలుకగ.. చిరంజీవి నీ జనుమా..
రామ.. రామ.. రామ.. రమ.. రామ.. రామ..రామ.. రామ.. రామ రమా.. రామా (మరో 3 సార్లు)
విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే రూమర్లు ఉన్నాయి. రిలీజ్ డేట్‍ను టీమ్ త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది.
విశ్వంభర చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా కనిపించనున్నారు. అషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రమోద్, వంశీ, విక్రమ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం