సింపుల్‌గా తయారయ్యే మునగకాయ సూప్ రెస్టారెంటుకు ధీటుగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది!

Best Web Hosting Provider In India 2024

సింపుల్‌గా తయారయ్యే మునగకాయ సూప్ రెస్టారెంటుకు ధీటుగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది!

Ramya Sri Marka HT Telugu
Published Apr 12, 2025 05:00 PM IST

మునగకాయలతో సూప్ ఎప్పుడైనా తయారు చేసుకున్నారా? ఈ రెసిపీతో తయారు చేసుకున్నారంటే రెస్టారెంట్లలో సూప్‌ల కోసం పడిగాపులు కాయరు. ఇంటికి హానికరమైన సూప్ ప్యాకెట్లను తెచ్చుకోవడం మానేస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా మునగ సూప్ తయారు చేసుకున్నారంటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

మునగకాయలతో తయారు చేసిన రుచికరమైన సూప్
మునగకాయలతో తయారు చేసిన రుచికరమైన సూప్

మునగకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు చాలా సార్లు చదివి ఉంటారు, విని ఉంటారు కూడా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి వీరాభిమాని. కూరగాయలన్నింటిలోనూ మునగకాయలను సూపర్ ఫుడ్‌గా చెబుతుంటారు. అందుకే చాలా మందిని వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు ఇప్పటి వరకూ మునగకాయలతో సాంబారు చేసుకుని ఉండచ్చు, రకరకాల కూరగాయలతో కలిపి వీటిని కూర చేసుకుని ఉండచ్చు. మాంసాహార ప్రియులైతే మటన్ మునగకాయ కలిని కూర తయారు చేసుకుని ఉండచ్చు. కానీ దీన్ని సూప్‌గా ఎప్పుడైనా ట్రై చేశారా?

అవును పిల్లల నుంచి పెద్దల వరకూ. రుచికీ ప్రాధాన్యత ఇచ్చేవారి నుంచి ఫిట్ నెస్ ప్రియుల వరకూ అందరు ఇష్టపడే సూప్‌ని ఆరోగ్యకరమైన మునగకాయలతో కూడా తయారు చేయచ్చు. ఇది రుచిలో అద్భుతంగా ఉంటుంది. మునగకాయ సూప్ తయారు చేయడం కూడా చాలా సులువు. ఇదిగోండి రెసిపీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు.

మునగకాయ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు:

  • మునగకాయలు – రెండు లేదా మూడు
  • కొత్తిమీర- పావు కప్పు
  • టమోటాలు- ఒకటి
  • ఉల్లిపాయ- ఒకటి
  • అల్లం- చిన్న ముక్క
  • వెల్లుల్లి- రెండు లేదా మూడు రెబ్బలు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నల్ల మిరియాల పొడి- అర టీస్పూన్
  • పచ్చిమిర్చి- ఒకటి లేదా రెండు
  • జీలకర్ర పొడి- అర టీస్పూన్

మునగకాయ సూప్ తయారీ విధానం:

  1. మునగకాయ సూప్ తయారు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ సింపుల్ రెసిపీ ఉంది.
  2. ముందుగా మీరు ముందుగా మునగకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. తర్వాత వీటిపైన తొక్కతీసి పక్కకు పెట్టుకోండి.
  4. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని దాంట్లో మునగకాయ ముక్కలను వేయండి.
  5. తరువాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను ఇందులో వేయండి.
  6. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలతో పాటు రుచికి తగినంత ఉప్పు వేసి వేయండి.
  7. తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి నీరు పోసి అన్నింటినీ ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించండి.
  8. రెండు లేదా మూడు విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా బయటికి పోనివ్వండి.
  9. ప్రెజర్ బయటికి పోయిన తర్వాత మూత తీసి ఈ మిశ్రమాన్నికాసేపు చల్లారనివ్వండి.
  10. కాస్త చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
  11. ఇప్పుడు ఒక జల్లెడ లేదా పలుచటి బట్ట తీసుకుని ఈ మిశ్రమాన్ని వడకట్టి బౌల్ లో పోసుకోండి.
  12. తర్వాత ఇందులో కొద్దిగా నీరు పోసి గ్యాస్ మీద పెట్టి మరిగించాలి.
  13. సూప్ మరగడం మొదలు కాగానే ఇందులో నల్ల మిరియాల పొడి, నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసి కలుపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
  14. మీకు కావాలనుకుంటే ఇందులో కాస్త జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అంతే టేస్టీ అండ్ హెల్తీ మునకగాయ సూప్ రెడీ అయినట్టే.

దీన్ని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా తాగచ్చు. ముఖ్యంగా పిల్లలు సూప్ కావాలని మారాం చేసేనప్పుడు బయటి నుంచి ప్యాకెట్లు తెచ్చి చేసి ఇచ్చే బదులు ఇలా కూరగాయలతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసి ఇవ్వండి. వారికి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024