



Best Web Hosting Provider In India 2024
Waqf Act protests: పశ్చిమ బెంగాల్ లో తీవ్రమవుతున్న ‘వక్ఫ్’ అల్లర్లు; తండ్రీకొడుకుల దారుణ హత్య
West Bengal Violence: పశ్చిమబెంగాల్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనలు రెండు వర్గాల మధ్య అల్లర్లు మారాయి. ముర్షిదాబాద్ లో శనివారం జరిగిన హింసాకాండలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురికాగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి.

West Bengal Violence: పశ్చిమ బెంగాల్ లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో అవి రెండు వర్గాల మధ్య ఘర్షణలుగా మారి హింసాత్మకమవుతున్నాయి. శనివారం జరిగిన తాజా హింసాకాండలో పశ్చిమబెంగాల్ లోని ముర్షిదాబాద్ లో ఇద్దరిని ప్రత్యర్థులు నరికి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రాష్ట్రంలో విస్తృత అశాంతి చోటు చేసుకుంది.
118 మంది అరెస్టు
ముర్షిదాబాద్ హింసాకాండకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 118 మందిని అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. అల్లర్లు తీవ్రంగా ఉన్న ముర్షీదాబాద్ లోని సంసర్ గంజ్ ప్రాంతంలోని జఫ్రాబాద్ లోని తమ ఇంట్లో తండ్రీకొడుకులు కత్తిపోట్లకు గురై చనిపోయి కనిపించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ఎల్ఓపీ, బీజేపీ నేత సువేందు అధికారి కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
ముర్షిదాబాద్ హింస: కీలక పరిణామాలు
- కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన సువేందు అధికారి
పశ్చిమబెంగాల్ అంతటా పెద్ద ఎత్తున మతఘర్షణలు దావానలంలా వ్యాపిస్తున్న దృష్ట్యా కేంద్ర పారామిలటరీ బలగాలను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ‘‘నా అభ్యర్థనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. గత్యంతరం లేక అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించాను. నా అభ్యర్థనను అంగీకరించి, జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ రాజా బసు చౌదరిలతో కూడిన డివిజన్ బెంచ్ నేను దాఖలు చేసిన పిల్ ను విచారిస్తుంది’ అని సువేందు అధికారి తెలిపారు.
2. మమతా బెనర్జీ విన్నపం
ప్రజలు సంయమనం పాటించాలని పశ్చిమబెంగాల్ సీఎ మమత బెనర్జీ కోరారు. “గుర్తుంచుకోండి, చాలా మంది ఆందోళన చేస్తున్న చట్టాన్ని మేము రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. కాబట్టి మీరు కోరుకునే సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి కోరాలి’ అని సీఎం పేర్కొన్నారు. “ఈ విషయంలో మేము మా వైఖరిని స్పష్టం చేసాము – మేము ఈ చట్టాన్ని సమర్థించము. ఈ చట్టం మన రాష్ట్రంలో అమలు కాదు. ఇంక అల్లర్లు దేనికి?’’ అని ఆమె ప్రశ్నించారు.
3. తండ్రీకొడుకుల హత్య
పశ్చిమబెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లాలో వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో ముడిపడి ఉన్న హింసాత్మక ఘర్షణల్లో ఇద్దరు మరణించారని ఒక ఐపీఎస్ అధికారి శనివారం తెలిపారు
4. బుల్లెట్ గాయాలతో వ్యక్తి మృతి
శాంసర్ గంజ్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో బుల్లెట్ గాయాలైన వ్యక్తి మృతి చెందాడు. తమ సిబ్బంది ఈ కాల్పుల్లో పాల్గొనే అవకాశం లేదని, అశాంతిని నియంత్రించడానికి ఈ ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించినందున ఇది బిఎస్ఎఫ్ నుండి వచ్చి ఉండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు.
5. అశ్విని వైష్ణవ్ కు సువేందు లేఖ
అశ్విని వైష్ణవ్ కు సువేందు అధికారి లేఖ రాశారు. జిల్లాలో రైల్వే ఆస్తుల విధ్వంసంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ)తో విచారణ జరిపించాలని కోరుతూ సువేందు అధికారి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. జిహాదీ శక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, సమాజంలోని ఇతర వర్గాలలో భయాన్ని నాటడానికి అరాచకాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.
6. ముర్షిదాబాద్ హింస
కొత్త వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాల్దా, ముర్షీదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో శుక్రవారం జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. పోలీసు వ్యాన్లతో సహా పలు వాహనాలను తగలబెట్టారు, భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు, రహదారులను దిగ్బంధించారు. ధూలియాన్-రతన్పూర్ ప్రాంతంలో వక్ఫ్ చట్టంపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ముర్షిదాబాద్లోని జంగీపూర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
7. పరిస్థితి అదుపులోనే
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, సరిహద్దు భద్రతా దళం (BSF) రాష్ట్ర పోలీసులు శాంతిని కాపాడుతున్నారని అధికారులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా హింసకు కేంద్ర బిందువైన జంగీపూర్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link